
నగ్న చిత్రాలు పంపితే సమాచారమిస్తా...
హైదరాబాద్: పాకిస్తాన్ యువతి మోజులో పడి దేశభద్రత విషయాలను పాకిస్థాన్ కు చేరవేస్తున్నాడన్న అనుమానంతో పతక్ కుమార్‌ను అనే భారత సైనికాధికారిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. పతక్‌కుమార్ రిమాండ్‌కు తరలించారు. అతడిపై దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు. పాకిస్తాన్ యువతితో పతక్ కుమార్ రెండేళ్లుగా చాటింగ్‌చ చేస్తున్నట్టు గుర్తించారు.
నగ్న చిత్రాలు పంపితే తమ దేశ భద్రతకు చెందిన సమాచారం ఇస్తానని సదరు యువతితో పతక్ కుమార్ సందేశం పంపినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఐబీ సమాచారంతో ఆర్మీ అప్రమత్తమై హైదరాబాద్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి మిగతా వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.