Indian drone
-
భారత డ్రోన్‌ను కూల్చేశాం: చైనా ఆర్మీ
బీజింగ్: చైనా గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన భారత్‌కు చెందిన డ్రోన్‌ను కూల్చేశామంటూ ఆ దేశ మీడియా గురువారం వెల్లడించింది. 'భారత్ చర్య చైనా ప్రాదేశిక సార్వభౌమాత్వాన్ని ఉల్లంఘించేలా ఉంది. దీనిపై మేం తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాం' అని చైనా ఆర్మీ వెస్టర్న్ థియేటర్ కొంబాట్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ ఝాంగ్ షుయిలిని ఉటంకిస్తూ జిన్హుహా వార్తాసంస్థ తెలిపింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన డ్రోన్ పట్ల తాము వృత్తిపరమైన దృక్పథంతో వ్యవహరించి.. దాని గుర్తింపు వివరాలు సేకరించామని ఆయన తెలిపారు. అయితే, ఈ డ్రోన్ ఎప్పుడు చైనాలోకి ప్రవేశించింది.. దీనిని ఎక్కడ కూల్చేశారు అనే విషయాలు వెల్లడించలేదు. చైనా, భూటాన్, సిక్కిం ట్రైజంక్షన్‌లో ఉన్న డోక్లాం కొండప్రాంతంలో సైనిక ప్రతిష్టంభన తలెత్తడంతో భారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ కొండప్రాంతంలో సైనికులు ముఖాముఖి తలపడే పరిస్థితి నెలకొనడంతో దాదాపు రెండు నెలలు పరిస్థితి తీవ్ర వివాదాన్ని రేపింది. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకున్న నేపథ్యంలో చైనా చేస్తున్న తాజా వాదన గమనార్హం. -
భారత డ్రోన్‌ను కూల్చాం: పాక్
-
భారత డ్రోన్‌ను కూల్చాం: పాక్
ఇస్లామాబాద్: నియంత్రణ రేఖ దాటి తమ భూభాగంలోకి చొరబడిన భారత డ్రోన్‌ను నేలకూల్చామని పాకిస్థాన్ సైన్యం శనివారం ప్రకటించింది. ‘పాక్ భూభాగంలోకి ప్రవేశించిన భారత క్వాడ్‌కాప్టర్‌ను పాక్ దళాలు శనివారం సాయంత్రం కుప్పకూల్చాయి. దాని శకలాలు రాక్చక్రి సెక్టార్‌లోని అగాయ్ పోస్టు సమీపంలో పడ్డాయి’ అని పాక్ ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. సర్జికల్ దాడుల తరువాత ఇరు దేశాల సరిహద్దుల్లో పాక్ 286 సార్లు షెల్లింగ్, మోర్టార్లతో కాల్పులకు పాల్పడటంతో 14 మంది భద్రతా సిబ్బంది సహా 26 మంది ప్రజలు చనిపోయారు. భారత్‌కే ఎక్కువ నష్టం జరిగింది: పాక్ అత్యున్నత కమాండర్ గత కొద్దిరోజులుగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో భారత సైనికులే ఎక్కువ మంది చనిపోయారని పాక్ 10 కారప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మాలిక్ జఫార్ ఇక్బాల్ అన్నారు. పాక్ సైనికులు 20 మంది చనిపోగా భారత్ వైపు కనీసం 40 మంది మరణించారని తెలిపారు. ప్రజాగ్రహానికి భయపడే భారత్ ఈ సంఖ్యను తగ్గించి చూపుతోందని ఆరోపించారు.