భారత డ్రోన్‌ను కూల్చేశాం: చైనా ఆర్మీ | China says Indian drone entered its airspace, crashed | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 7 2017 9:33 AM | Last Updated on Thu, Dec 7 2017 9:33 AM

China says Indian drone entered its airspace, crashed - Sakshi

బీజింగ్‌: చైనా గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన భారత్‌కు చెందిన డ్రోన్‌ను కూల్చేశామంటూ ఆ దేశ మీడియా గురువారం వెల్లడించింది. 'భారత్‌ చర్య చైనా ప్రాదేశిక సార్వభౌమాత్వాన్ని ఉల్లంఘించేలా ఉంది. దీనిపై మేం తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాం' అని చైనా ఆర్మీ వెస్టర్న్‌ థియేటర్‌ కొంబాట్‌ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్‌ ఝాంగ్‌ షుయిలిని ఉటంకిస్తూ జిన్హుహా వార్తాసంస్థ తెలిపింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన డ్రోన్‌ పట్ల తాము వృత్తిపరమైన దృక్పథంతో వ్యవహరించి.. దాని గుర్తింపు వివరాలు సేకరించామని ఆయన తెలిపారు. అయితే, ఈ డ్రోన్‌ ఎప్పుడు చైనాలోకి ప్రవేశించింది.. దీనిని ఎక్కడ కూల్చేశారు అనే విషయాలు వెల్లడించలేదు.

చైనా, భూటాన్‌, సిక్కిం ట్రైజంక్షన్‌లో ఉన్న డోక్లాం కొండప్రాంతంలో సైనిక ప్రతిష్టంభన తలెత్తడంతో భారత్‌-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ కొండప్రాంతంలో సైనికులు ముఖాముఖి తలపడే పరిస్థితి నెలకొనడంతో దాదాపు రెండు నెలలు పరిస్థితి తీవ్ర వివాదాన్ని రేపింది. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకున్న నేపథ్యంలో చైనా చేస్తున్న తాజా వాదన గమనార్హం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement