The Indian market
-
స్మార్ట్ఫోన్తోపాటు హైబ్రిడ్ టాబ్లెట్...
తైవాన్ కంపెనీ ఆసుస్ తన పాడ్‌ఫోన్ శ్రేణిలో భాగంగా భారత మార్కెట్లో ఓ వినూత్నమైన ఫోన్, టాబ్లెట్ హైబ్రిడ్‌ను విడుదల చేసింది. ఈ పాడ్‌ఫోన్ మినీ అటు అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్‌గా, ఇటు ఏడు అంగుళాల టాబ్లెట్‌గానూ పనిచేస్తుంది. అవసరమైనప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను టాబ్లెట్ వెనుకభాగంలో అమర్చుకోవడమే మనం చేయాల్సిన పని. స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే ఒక మోస్తరుగా ఉంటే.. టాబ్లెట్ మాత్రం హెచ్డీ డిస్ప్లే కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ నాలుగు అంగుళాల స్క్రీన్‌సైజు కలిగి ఉంది. రెండు గాడ్జెట్లను సమర్థంగా నడిపించేందుకు 1.6 గిగాహెర్ట్జ్‌క్లాక్‌స్పీడ్‌తో పనిచేసే ఇంటెల్ ఆటమ్ డ్యుయెల్ కోర్ ప్రాసెసర్ ను ఉపయోగించారు. ర్యామ్ 1 గిగాబైట్ కాగా, కిట్‌క్యాట్ అప్‌గ్రేడ్ అవకాశం కల్పిస్తూ... జెల్లీబీన్ 4.3 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ప్రధాన మెమరీ దాదాపు 8 గిగాబైట్లు. కెమెరాలు 8 ఎంపీ, రెండు ఎంపీ రెజల్యూషన్ కలిగి ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో 1170 ఎంఏహెచ్ బ్యాటరీ, టాబ్లెట్‌లో 2100 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. మొత్తమ్మీద 3270 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం అందుబాటులో ఉంటుందన్నమాట. జీపీఆర్ఎస్, వైఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ తదితర కనెక్టివిటీ ఆప్షన్లున్న ఆసుస్ పాడ్‌ఫోన్ మినీ ధర దాదాపు రూ. 15,999. -
36 రోజుల స్టాండ్‌బైతో నోకియా ఫోన్!
భారత్ మార్కెట్లో నోకియా సరికొత్త మొబైల్‌ను విడుదల చేసింది. నోకియా 130 పేరుతో విడుదల అయిన ఈ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ విషయంలో మిగతా ఫోన్లకు సరికొత్త సవాలు విసరుతున్నట్టుగా ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ స్టాండ్‌బై మొత్తం 36 రోజులట. మ్యూజిక్ ప్లేయర్ 46 గంటలసేపు ఆన్‌లోనే ఉన్నా మొబైల్ స్విచాఫ్ అయ్యేది ఉండదట. మైక్రోచిప్ఎస్డీ కార్డ్‌తో మెమొరీని 32 జీబీ వరకూ పెంచుకొనే అవకాశం ఉంది, ఫ్లాష్‌లైట్, ఎఫ్ఎమ్ రేడియో, యూఎస్బీ చార్జింగ్ ఈ ఫోన్‌తో ఉండే ఇతర సదుపాయాలు. దీని ధర 1,649 రూపాయలు. -
భారత్‌లోకి శామ్సంగ్ గెలాక్సీ నోట్ 4..
న్యూఢిల్లీ: శామ్సంగ్ కంపెనీ గెలాక్సీ నోట్ 4 ఫ్యాబ్లెట్‌ను భారత మార్కెట్లోకి మంగళవారం ప్రవేశపెట్టింది. ధర రూ.58,300. దీనితో పాటు శామ్సంగ్ గేర్ ఎస్ స్మార్ట్‌వాచ్(ధర రూ.28,900), గేర్ సర్కిల్(ధర రూ.8,500) డివైస్‌లను కూడా శామ్సంగ్ కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. శామ్సంగ్ ఖరీదైన స్మార్ట్‌డివైస్ ఈ గెలాక్సీ నోట్ 4 డివైస్‌ను శామ్సంగ్ కంపెనీ గత నెలలో బెర్లిన్‌లో జరిగిన ఐఎఫ్ఏ ఎలక్ట్రానిక్స్ షోలో ఆవిష్కరించింది. దీపావళి సందర్భంగా గెలాక్సీ నోట్ 4ను మార్కెట్లోకి తెస్తున్నామని శామ్సంగ్ ఇండియా వైస్‌ప్రెసిడెంట్ (మొబైల్ అండ్ ఐటీ) ఆశిమ్ వార్శి చెప్పారు. శామ్సంగ్ కంపెనీ భారత్‌లో అందిస్తున్న అత్యంత ఖరీదైన స్మార్ట్ డివైస్ ఇది. గెలాక్సీ నోట్ 3(ఎన్900)ను రూ.38,900కు, గెలాక్సీ 5ఎస్‌ను రూ.36,000కు కంపెనీ విక్రయిస్తోంది. మెరుగుపరిచిన ఎస్పెన్ ఫీచర్‌తో, పెద్ద డిస్ప్లే, అత్యున్నతమైన ఫీచర్లతో గెలాక్సీ నోట్4ను రూపొందించామని ఆశిమ్ వివరించారు. ఈ గెలాక్సీ నోట్ 4లో 5.7 అంగుళాల క్వాడ్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 3.7 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. వేగంగా చార్జింగ్ కావడం ఈ ఫ్యాబ్లెట్ ప్రత్యేకత అని ఆశిమ్ వివరించారు. 30 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ అవుతుందని పేర్కొన్నారు.