స్మార్ట్‌ఫోన్‌తోపాటు హైబ్రిడ్ టాబ్లెట్... | addition to the smartphone tablet hybrid | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్‌తోపాటు హైబ్రిడ్ టాబ్లెట్...

Published Tue, Nov 25 2014 11:26 PM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

స్మార్ట్‌ఫోన్‌తోపాటు హైబ్రిడ్ టాబ్లెట్...

స్మార్ట్‌ఫోన్‌తోపాటు హైబ్రిడ్ టాబ్లెట్...

తైవాన్ కంపెనీ ఆసుస్ తన పాడ్‌ఫోన్ శ్రేణిలో భాగంగా భారత మార్కెట్‌లో ఓ వినూత్నమైన ఫోన్, టాబ్లెట్ హైబ్రిడ్‌ను విడుదల చేసింది. ఈ పాడ్‌ఫోన్ మినీ అటు అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్‌గా, ఇటు ఏడు అంగుళాల టాబ్లెట్‌గానూ పనిచేస్తుంది. అవసరమైనప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను టాబ్లెట్ వెనుకభాగంలో అమర్చుకోవడమే మనం చేయాల్సిన పని. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే ఒక మోస్తరుగా ఉంటే.. టాబ్లెట్ మాత్రం హెచ్‌డీ డిస్‌ప్లే కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ నాలుగు అంగుళాల స్క్రీన్‌సైజు కలిగి ఉంది. రెండు గాడ్జెట్లను సమర్థంగా నడిపించేందుకు 1.6 గిగాహెర్ట్జ్‌క్లాక్‌స్పీడ్‌తో పనిచేసే ఇంటెల్ ఆటమ్ డ్యుయెల్ కోర్ ప్రాసెసర్ ను ఉపయోగించారు.

ర్యామ్ 1 గిగాబైట్ కాగా, కిట్‌క్యాట్ అప్‌గ్రేడ్ అవకాశం కల్పిస్తూ... జెల్లీబీన్ 4.3 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ప్రధాన మెమరీ దాదాపు 8 గిగాబైట్లు. కెమెరాలు 8 ఎంపీ, రెండు ఎంపీ రెజల్యూషన్ కలిగి ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో 1170 ఎంఏహెచ్ బ్యాటరీ, టాబ్లెట్‌లో 2100 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. మొత్తమ్మీద 3270 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం అందుబాటులో ఉంటుందన్నమాట. జీపీఆర్‌ఎస్, వైఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్‌బీ తదితర కనెక్టివిటీ ఆప్షన్లున్న ఆసుస్ పాడ్‌ఫోన్ మినీ ధర దాదాపు రూ. 15,999.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement