Indian model
-
ఒక్క పాటతో స్టార్డమ్.. కొన్నాళ్లకు ప్రమాదకర క్యాన్సర్.. ఇప్పుడేమో! (ఫొటోలు)
-
వెబ్ సిరీస్ చేస్తే సినిమా ఛాన్స్‌లు రావని భయపెట్టారు: నటి
అందమైన నవ్వు.. నాజూకైన ఆకృతి.. చక్కటి హావభావాలను ఒక్కచోట ఫోకస్ చేస్తే.. సాహెర్ బంబా. వెబ్ తెరకు కొత్త గ్లామర్‌ను పరిచయం చేసిన ఆమె గురించి కొన్ని వివరాలు.. పుట్టింది, పెరిగింది సిమ్లాలో. తల్లి.. శిలా బంబా, తండ్రి సునీల్బంబా. సాహెర్ డిగ్రీ పట్టా పుచుకుంది ముంబైలోని జై హింద్ కాలేజీలో. సాహెర్ మంచి యోగా నిపుణురాలు కూడా. తన ఫిట్నెస్ రహస్యం క్రమం తప్పని కథక్, యోగా ప్రాక్టీసే అంటుంది. వెబ్ కంటే ముందు బిగ్ స్క్రీన్ మీదే కనిపించింది ‘పల్ పల్ దిల్ కే పాస్’ సినిమాతో. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే మోడల్‌గా రాణించింది. 2016లో ఒప్పో బాంబే టైమ్స్ ఫ్రెష్ ఫేస్ టైటిల్ గెలుచుకుంది. చిన్నప్పుడే కథక్ డాన్స్ నేర్చుకుంది. డ్యాన్స్ మీదున్న మక్కువే నటన మీద కుతూహలాన్ని, ఆసక్తిని పెంచింది. కరోనా సమయంలో వెబ్ ఎంట్రీ ఇచ్చింది ‘దిల్ బేకరార్’ సిరీస్‌తో. సినిమా కంటే కూడా ఆ సిరీస్‌తోనే పాపులారిటీ సంపాదించుకుంది. వెబ్ సిరీస్‌లో నటించొద్దు, దాని వల్ల సినిమా అవకాశాలు పోతాయని చాలా మంది పెద్దలు నన్ను హెచ్చరించారు. కానీ కరోనాలో నన్ను బిజీగా ఉంచింది వెబ్ సిరీసే. పైగా ఎక్కువ మంది ప్రేక్షకులకూ దగ్గర చేసింది. అందుకే నేను రెండిటికీ ఈక్వల్ ప్రయారిటీ ఇస్తాను. ఇంకా చెప్పాలంటే నేను పోషించే పాత్ర ప్రాధాన్యమే నాకు ముఖ్యం. మాధ్యమం ఏదైనా సరే. అయినా సినిమాకు, వెబ్ సిరీస్‌కు పెద్ద తేడా కూడా ఏం లేదు. మేకింగ్‌లో కానీ.. రీచింగ్‌లో కానీ! – సాహెర్ బంబా చదవండి: మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జక్కన్న -
ధైర్యం... ఆమె మనసు మాట విన్నది..
Miss Deaf Asia 2018 Winner Nishtha Dudeja: ఈ అమ్మాయికి చిన్ననాటి నుంచి వినికిడి లోపం ఉందని చెబితే ఎవ్వరైనా జాలిపడతారు. కానీ, ఈ అమ్మాయే మిస్ డెఫ్ ఆసియా 2018 టైటిల్ విజేత, మిస్ అండ్ మిస్టర్ డెఫ్ ఇండియా పోటీ లో ఢిల్లీ నుంచి ప్రాతినిథ్యం వహించింది. 18 సంవత్సరాల మిస్ అండ్ మిస్టర్ డెఫ్ వరల్డ్ పోటీల్లో భారతదేశం నుంచి టైటిల్ గెలుచుకున్న మొదటి ప్రతినిధి అని చెబితే ఆమె ధైర్యానికి, పట్టుదలకు ఫిదా అవకుండా ఉండరు. గ్లామర్ ప్రపంచంలో మోడల్‌గా రాణిస్తూ, క్రీడల్లోనూ ఎదిగిన 26 ఏళ్ల నిష్ఠా దూదెజా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న తీరు గురించి తెలుసుకోవాల్సిందే అనిపించక మానదు. నిష్ఠా దూదెజాకు చిన్ననాటి నుంచి వినికిడి సమస్య ఉంది. ఫలితంగా మనం అడిగిన దానికి సమాధానమివ్వలేదు. ఏదైనా చెప్పాల్సి వస్తే కాగితమ్మీద రాసిస్తుంది. లేదంటే ఫోన్లో టెక్స్›్ట మెసేజ్‌ల ద్వారా విషయం చెప్పేస్తుంది. మనం ఓ ప్రశ్న రాసిస్తే, ఆమె దానికి రాతపూర్వకంగానే సమాధానమిస్తుంది. కానీ, ఆమే గ్లామర్ ప్రపంచంలో విజయవంతమైన మోడల్‌గా రాణిస్తోంది. టెన్నిస్ క్రీడాకారిణి.. నిష్ఠా తన గురించి రాతపూర్వకంగా ఇచ్చిన తన మనసులోని మాటలు.. ‘12 ఏళ్ల వయసు నుంచి పదేళ్ల పాటు టెన్నిస్ క్రీడలో సాధన చేశాను. 2013, 2015, 2017 సంవత్సరాలలో బధిరుల ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొన్నాను. తీవ్రమైన దవడ కండరాల నొప్పులు రావడంతో వైద్యుల సూచన మేరకు కొన్నాళ్లు ఆ క్రీడకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అమ్మానాన్న తర్వాత టెన్నిస్ నాకు బెస్ట్ ఫ్రెండ్. అందుకే, పోటీలలో పాల్గొనలేకపోయినా టెన్నిస్‌ను పూర్తిగా వదులుకోలేదు. ఐదేళ్ల వయసు నుంచి జూడో ఆడటంలో సాధన చేశాను. ఏడేళ్లపాటు ఈ గేమ్‌లో రాణించాను’ అని తన గెలుపుకు వేసుకున్న బాట గురించి వివరిస్తుంది. అందాల పోటీలో మేటి మరిన్ని వివరాలను తెలియజేస్తూ– ‘టెన్నిస్ పోటీలో పాల్గొనలేనని అర్థమయ్యాక అంతకుమించి ఏదైనా చేయాలని ఆలోచించినప్పుడు మిస్ ఇండియా బ్లైండ్ గురించి తెలిసింది. ఈ విభాగంలో డెఫ్ కూడా ఉంటారని తెలుసుకున్నాను. దానికి తగిన కృషి చేశాను. అలా మిస్ ఇండియా డెఫ్, మిస్ ఆసియా డెఫ్ టైటిట్స్ గెలుచుకున్నాను’ అని తెలిపిన నిష్ఠా దూదెజా జూడో, టెన్నిస్, బ్యూటీ విభాగాలలోనూ నంబర్ వన్ అనిపించుకుంది. వికలాంగుల సాధికారత భారత ఉపరాష్ట్రపతి నుంచి రోల్ మోడల్ కేటగిరీలో వికలాంగుల సాధికారత జాతీయ అవార్డును అందుకున్నది. ‘నా పై జాలి చూపే వారిని నేను ఇష్టపడను’ అని చెప్పే నిష్ఠా ప్రయాణం అంత తేలికగా సాగలేదు. ‘పాఠశాల స్థాయిలో తోటి పిల్లలే ఎగతాళి చేసేవారు. చిన్నప్పుడు అర్ధం కాలేదు. చాలా బాధనిపించేది. టీనేజ్ దాటాక నా పరిస్థితి పైన పూర్తి అవగాహన వచ్చింది. అప్పటి నుంచే జీవితంలోని సానుకూల కోణాన్ని చూశాను. అడ్డంకులను దాటుకుంటూ నా ప్రయణాన్ని కొనసాగించాను. విజయవంతమయ్యాను’ తెలిపే నిష్ఠా దూదెజా విజయం వినికిడి లోపం గల పిల్లలున్న తల్లిదండ్రులు తమ పిల్లలపై ఆశలు చివురించేలా చేస్తుంది. సరైన విధంగా దారి చూపిస్తే తమ పిల్లలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారనే ధైర్యాన్ని నింపుతుంది. -
ఆర్థిక సంస్కరణలతో ప్రజలకు మేలు: ముఖేష్ అంబానీ
సాక్షి, హైదరాబాద్: దేశంలో మూడు దశాబ్దాల ఆర్థిక సంస్కరణలతో పౌరులు అసమానమైన ప్రయోజనలు పొందుతున్నారని ఇప్పుడు ‘ఇండియన్ మోడల్’ దిశలో సంపద సృష్టించడంపై దృష్టిపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అభిప్రాయపడ్డారు. 2047 నాటికి అమెరికా, చైనా దేశాలతో సమానంగా ఇండియా ఎదుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల ఆర్థిక సరళీకరణ సందర్భంగా ఆయన అరుదైన కాలమ్ రాస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లుగా సంపద సృష్టి మీద మాత్రమే దృష్టి సారించామని.. అందరికీ విద్య, అందరకీ ఆరోగ్యం, అందరికీ ఉపాధి, అందరికీ హౌసింగ్ సాధించడంలోనే నిజమైన సంపద దాగుందనే సత్యాన్ని విస్మరించామని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలలో కంపెనీల విస్తరణ సమయంలో ప్రజల శ్రేయస్సు, సంరక్షణ అంశాలను పట్టించుకోవటం లేదని ఈ అంశాల్లో భారత్ ప్రారంభ దశలో ఉందన్నారు. -
అతనితో ఏకాంతంగా గడిపా.. అయితే ఏంటి?
పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇండియన్ మోడల్, నటి ఆర్షి ఖాన్ వ్యక్తిగత విషయాలు వెల్లడించింది. ఆఫ్రిదితో ప్రేమాయణం సాగించిన మాట వాస్తమేనని అంగీకరించింది. అతడితో ఏకాంతంగా గడిపినట్టు బోల్డ్ గా ప్రకటించింది. వీరిద్దరూ దుబాయ్ లో ప్రణయ కార్యకలాపాలు సాగించినట్టు వచ్చిన వార్తలను అంతకుముందు ఆర్షి ఖాన్ తోసిపుచ్చింది. ఆఫ్రిది తనకు ఆప్తమిత్రుడు మాత్రమేనని చెప్పుకొచ్చింది. అయితే తాజా ఇంటర్వ్యూలో అతడితో తనకున్న సంబంధాన్ని బయటపెట్టింది. ట్విటర్ లోనూ ఈ విషయాన్ని వెల్లడించింది. 'అవును. ఆఫ్రిదితో శృంగారంలో పాల్గొన్నా. నేను ఎవరితో గడపాలన్నా ఇండియా మీడియా అనుమతి తీసుకోవాలా? ఇది నా వ్యక్తిగత జీవితం. నాకు సంబంధించినంత వరకు ఇది ప్రేమ' అని ట్వీట్ చేసింది. వివాదస్పద సన్యాసిని రాధే మా వ్యభిచార వ్యాపారం చేస్తోందని అంతకుముందు ఆర్షి ఖాన్ ఆరోపించింది. వ్యభిచారంలోకి దించేందుకు రాధే మాకు చెందిన ఏజెంట్ ఒకరు తనను సంప్రదించారని బాంబు పేల్చి పతాక శీర్షికల్లో నిలిచింది. Yes, I had sex with Afridi! Do I need the Indian media's permission to sleep with someone? It's my personal life. For me it was love. — Arshi Khan (@ArshiKOfficial) September 8, 2015 -
భారత మోడల్‌ను పెళ్లాడిన టెయిట్
ముంబై: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ షాన్ టెయిట్ పెళ్లి కొడుకయ్యాడు. తన స్నేహితురాలు, భారత మోడల్ మాషూమ్ సింఘాను అతను గత వారం వివాహమాడాడు. వీరిద్దరు గత నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ముంబైలోనే జరిగిన ఈ పెళ్లికి భారత క్రికెటర్లు జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ కూడా హాజరయ్యారు.