Indian Origin Businessman
-
బ్రిటన్‌లో అత్యంత సంపన్నుడు భారతీయుడే..!
భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త గోపీచంద్ హిందూజా యూకేలో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ‘ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్’ యూకేలోని 1,000 మంది సంపన్నులు లేదా కుటుంబాలతో వారి మొత్తం నెట్‌వర్త్ ప్రకారం జాబితా రూపొందించింది. ఈ జాబితాలో హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ హిందూజాను అగ్రస్థానంలో నిలిచారు.‘ది మిర్రర్’ ప్రకారం.. హిందుజా కుటుంబం ఆరు సంవత్సరాలుగా బ్రిటన్‌లో అత్యంత సంపన్నులుగా నిలుస్తూ వస్తోంది. ర్యాంకింగ్ ఆధారంగా హిందూజా నెట్‌వర్త్ అంతకు ముందు సంవత్సరంలోని 35 బిలియన్ పౌండ్ స్టెర్లింగ్స్ (సుమారు రూ. 3.7 లక్షల కోట్లు) నుంచి సుమారు 37.196 బిలియన్ పౌండ్ స్టెర్లింగ్స్‌కు (సుమారు రూ. 3.9 లక్షల కోట్లు) పెరిగింది.జీపీగా పిలిచే గోపీచంద్ హిందూజా భారత్‌లో 1940లో జన్మించారు. హిందూజా ఆటోమోటివ్ లిమిటెడ్ ఛైర్మన్ అయిన ఆయన గత సంవత్సరం తన సోదరుడు శ్రీచంద్ హిందూజా మరణించిన తరువాత తమ వ్యాపార సమూహానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. గోపీచంద్ 1959లో ముంబైలోని జై హింద్ కళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. దీంతోపాటు లండన్‌లోని రిచ్మండ్ కళాశాల నుంచి ఆర్థికశాస్త్రంలో గౌరవ డాక్టరేట్‌ను పొందారు. గోపీచంద్ తండ్రి, పరమానంద్ హిందూజా 1914లో హిందూజా ఫ్యామిలీ కంపెనీని స్థాపించారు. -
Canada: భారత సంతతి వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులు
ఒట్టావా: కెనడా రాజధాని నగరం ఒట్టావాలో భారత సంతతి వ్యాపారవేత్త ఇంటిపై దాడి జరిగింది. వ్యాపారవేత్త ఇంటిపై దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దాడికి పాల్పడింది పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ అలియాస్ సతిందర్‌జిత్ సింగ్ గ్రూపునకు చెందిన మనుషులుగా అనుమానిస్తున్నారు. మాస్కులు ధరించిన వ్యక్తులు వ్యాపారవేత్త ఇంటిలోకి కాల్పులు జరుపుతున్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత్, కెనడాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌గా పేరున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో గోల్డీ బ్రార్ గ్యాంగ్‌కు సంబంధాలున్నాయి. అయితే వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులకు పాల్పడింది తామేనని ఇప్పటివరకు గోల్డీ బ్రార్ గ్యాంగ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. భయపెట్టి బలవంతపు వసూళ్లకు(ఎక్స్టార్షన్) పాల్పడేందుకే వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. కెనడాలో గ్యాంగ్స్టర్లు ఎక్స్‌టార్షన్‌కు పాల్పడటం ప్రస్తుతం సాధారణంగా మారిపోవడం గమనార్హం. ఇదీ చదవండి.. ట్రంప్ ప్రపంచానికే ముప్పు -
విషాదం.. అమెరికాలో భారత వ్యాపారవేత్త మృతి
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో విషాదం జరిగింది. కాటేజ్ హోంకు నిప్పంటుకుని భారత సంతతి యువ వ్యాపారవేత్త తాన్య బాతిజ(32) ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 14న జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ఆమె పెంపుడు కుక్క కూడా చనిపోయింది. తాన్య న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్ డిక్స్ హిల్స్ కాటేజ్ హోంలో నివసిస్తోంది. డెసెంబర్ 14న ఉదయం 3 గంటల సమయంలో ఆమె కాటేజ్‌కు నిప్పంటుకుంది. నిద్ర నుంచి లేచి అగ్నికీలలు చూసి షాక్ అయింది. వెంటనే సాయం కోసం పోలీసులకు ఫోన్ చేసింది. హుటాహుటిన రంగంలోకి దిగిన ఇద్దరు పోలీసులు తాన్యను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ భారీ అగ్నికీలల ధాటికి ఆమెను చేరుకోలేకపోయారు. ఫైరింజన్ పూర్తిగా మంటలు ఆర్పే సమయానికి తాన్య అగ్నికి ఆహుతైంది. ఆమె పెంపుడు కుక్క కూడా మరణించింది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ఈ ఘటనలో నేరపూరితంగా ఏమీ కన్పించడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. చదవండి: అవసరమైతే అణుబాంబు వాడతాం.. భారత్‌కు పాక్ మంత్రి బెదిరింపులు -
ఆయన గ్యారేజ్‌లో ఆరు రోల్స్ రాయిస్ కార్లు..
లండన్ : రోల్స్ రాయిస్ కారును సొంతం చేసుకోవాలనుకునే కల చాలామందికి కలగానే మిగిలిపోతుంది. బ్రిటన్‌లో స్ధిరపడిన భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త రూబెన్ సింగ్ మాత్రం ఏకంగా 15 రోల్స్ రాయిస్ లగ్జరీ కార్లను సొంతం చేసుకున్నాడు. సింగ్ ఇటీవల రూ 50 కోట్లకు పైగా వెచ్చించి ఆరు రోల్స్ రాయిస్ లగ్జరీ కార్లను కొనుగోలు చేశాడు. వీటిలో ఇటీవల లాంఛ్ అయిన మూడు ఫాంటాన్ లగ్జరీ సెడాన్లున్నాయి. లండన్‌లో ఫైనాన్షియల్ కంపెనీని నిర్వహించే రూబెన్ సింగ్ ఇటీవల తాను కొనుగోలు చేసిన లగ్జరీ కార్లను సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సింగ్ పోస్ట్ చేసిన రోల్స్ రాయిస్ కలెక్షన్‌కు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. రోల్స్ రాయిస్ కార్లతో పాటు ఆయనకు బుగాట్టి వెరైన్, పోర్షే 918, సైడర్, పగాని హుయర, లంబోర్గిని హరికేన్, ఫెరారి ఎఫ్ 12, బెర్లినెట్టా పరిమిత ఎడిషన్ (ప్రపంచంలో ఒకే ఒక్క వాహనం) వంటి పలు లగ్జరీ కార్లున్నాయి. రూబెన్ సింగ్ బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌కు చిన్న పరిశ్రమలు, కాంపిటీటివ్ కౌన్సిల్‌పై ప్రభుత్వ సలహామండలిలో సభ్యుడిగా పనిచేశారు. గతంలోనూ బ్రిటన్ ప్రభుత్వంలో ఆయన పలు పదవులు నిర్వహించారు. -
మాములోడు కాదు..19 ఏళ్లకే రూ. 100 కోట్లు
లండన్: బ్రిటన్ ధనవంతుల జాబితాలో భారత సంతతికి చెందిన ఓ యువ వ్యాపారవేత్త చోటు దక్కించుకున్నారు. దీంతో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ఆయన గుర్తింపు పొందారు. అక్షయ్ రుపారేలియా అనే 19 ఏళ్ల యువకుడు చదువుకుంటున్న సమయంలోనే డోర్‌స్టెప్స్.కో. యూకే అనే వెబ్సైట్ రూపొందించి తన వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ వెబ్సైట్ ద్వారా యూకేలో స్వయం ఉపాధి పొందుతున్న తల్లుల నుంచి స్థిరాస్తి సమాచారం సేకరించి, దానిని తమ సైట్లో పోస్ట్ చేస్తుంటారు. కేవలం ఏడాదికాలంలోనే 100 మిలియన్ ఫౌండ్స్( దాదాపు 100 కోట్లను) ఆర్జించారు. 16 నెలల్లోనే యూకేలో 18వ అతిపెద్ద ఏజెన్సీగా ఈ వెబ్సైట్ పేరుగాంచింది. ఆక్సఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్‌లో అవకాశం వచ్చినా అక్షయ్ చదువుకు స్వస్తి చెప్పి బిజెనెస్ వైపు మొగ్గు చూపాడు. తన బందువుల నుంచి 7 వేల పౌండ్లను సాయంగా తీసుకొని ఈ బిజినెస్ ప్రారంభించానని అక్షయ్ పేర్కొన్నాడు. తన తల్లి తండ్రులు చెవిటి వారని, వీరిద్దరు చెవిటి విద్యార్ధులకు శిక్షణ ఇస్తారని తెలిపారు. పిల్లలకోసం ఎంతో పరితపించే తల్లుల కోసం ఈ వెబ్సైట్ రూపోందించానని గర్వంగా చెప్పుకొచ్చారు. -
మరో విద్వేషపు తూటా!
అమెరికాలో భారత సంతతి వ్యాపారి హర్నీష్ హత్య -మృతుడి స్వస్థలం గుజరాత్‌లోని వడోదర - దక్షిణ కరోలినాలో ఆయన ఇంటి వద్దే కాల్పులు - షాపు మూసి ఇంటికొస్తుండగా దారుణం - జాత్యహంకార హత్య కాకపోవచ్చంటున్న పోలీసులు న్యూయార్క్/న్యూఢిల్లీ అమెరికాలో జాతి విద్వేషం మళ్లీ బుసలు కొట్టింది! తెలుగు ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్‌ను పొట్టనబెట్టుకున్న కాన్సస్ జాత్యహంకార కాల్పులను మరవక ముందే అమెరికాలో మరో భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈసారి తూటాలకు బలైంది ఓ గుజరాతీ వ్యాపారి. దక్షిణ కరోలినా రాష్ట్రంలోని లాంకాస్టర్ కౌంటీలో కిరాణా షాపు నిర్వహిస్తున్న హర్నీష్ పటేల్ (43)ను గురువారం అర్ధరాత్రి(అమెరికా కాలమానం ప్రకారం) ఓ దుండగుడు ఆయన ఇంటి వెలుపలే తుపాకీతో కాల్చి చంపాడు. రాత్రి 11:24 ప్రాంతంలో తన ‘స్పీడీ మార్ట్’షాపును మూసేసి 6 కి.మీ. దూరంలోని ఇంటికి టయోటా మినీ వ్యాన్‌లో వెళ్లిన పటేల్.. పది నిమిషాలు కూడా గడవకముండే హత్యకు గురయ్యాడు. తుపాకీ కాల్పులు, అరుపులు విన్నానంటూ ఒక మహిళ 11:33కు పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి చూడగా తన ఇంటికి కొన్ని అడుగుల దూరంలోనే పటేల్ రెండు తూటా గాయాలతో విగతజీవిగా కనిపించాడు. పోలీసులు ఆ ప్రాంతం నుంచి రెండు ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు జాగిలం ఏ వాసనా పసిగట్టకుండా అక్కడే ఆగిపోయింది. పటేల్ వాహనాన్ని దుండుగుడు అడ్డుకుని కాల్పులు జరిపి ఉండొచ్చని అధికారులు చెప్పారు. ఈ హత్య ఒక్కరే చేశారా, లేకపోతే కొందరు కలసి చేశారా అన్నది తెలియడం లేదు. పోలీసు అధికారి ఆఫీసుకు సమీపంలోనే దుకాణం పోలీసు అధికారి కార్యాలయానికి సమీపంలోనే పటేల్ దుకాణం ఉంది. డిప్యూటీ పోలీసు అధికారులు తరచూ ఈ దుకాణానికి వస్తుంటారు. గుజరాత్‌లోని వడోదరకు చెందిన పటేల్ బతుకు తెరువు కోసం అమెరికా వెళ్లాడు. ఆయనకు భార్య సోనాల్, కుమారుడు సిద్ధాంశ్ ఉన్నారు. హత్య సమయంలో వారు ఇంట్లో ఉన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక వలసదారులపై జాతివిద్వేష దాడులు, హత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఈ దారుణం వెనుక కూడా జాతివివక్ష కోణం ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఇది జాత్యహంకార హత్య అని భావించడానికి కారణాలు కనిపించడం లేదని స్థానిక పోలీసు అధికారి బారీ ఫైలీ చెప్పారు. హత్యపై అక్కడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, అట్లాంటాలోని తమ కాన్సులేట్ జనరల్ బాధిత కుటుంబాన్ని సంప్రదించిందని భారత విదేశాంగ శాఖ అధికారి ఒకరు చెప్పారు. అధికారులు మృతుడి కుటుంబాన్ని కలుసుకోనుందన్నారు. పటేల్ స్పీడీ మార్ట్ దుకాణం(ఇన్సెట్లో కుటుంబ సభ్యులతో హర్నీష్ పటేల్) డబ్బులు లేకపోయినా సరుకులు ఇచ్చేవాడు.. మంచి మనిషిగా అందరి ఆదరాభిమానానాలు చూరగొన్న పటేల్ హత్యపై స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అతణ్ని ఎందుకు చంపారో తమకు అర్థం కావడం లేదంటున్నారు. పలువురు పటేల్ షాపు వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు. దుకాణానికి వచ్చేవారితో పటేల్ స్నేహపూర్వకంగా ఉండేవాడని, ఎవరి వద్దయినా కొనడానికి డబ్బుల్లేకపోతే ఆహార పదార్థాలను ఉచితంగానే ఇచ్చేవాడని స్పీడీ మార్ట్‌కు వెళ్లే నికోల్ జోన్స్ అనే మహిళ కన్నీటి పర్యంతమవుతూ చెప్పింది. పటేల్ తనకు గతంలో ఉద్యోగం ఇచ్చాడని, కష్ట సమయాల్లో ఆదుకున్నాడని మారియో శాడ్లర్ తెలిపారు. షాపు ఉద్యోగులు బాగుండాలని తమ యజమాని తపించేవాడని స్పీడీ మార్ట్ ఉద్యోగి కీరా బాస్కిన్ చెప్పారు. హైదరాబాద్‌కు చేరుకున్న శ్రీనివాస్ మృతదేహం ‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’ అమెరికాలో ప్రమాదం ఇలా తప్పించుకోండి అమెరికాలో భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అమెరికాలో జాతి విద్వేష కాల్పులు విద్వేషపు తూటా! మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో? నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి ‘తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి’