లండన్: బ్రిటన్ ధనవంతుల జాబితాలో భారత సంతతికి చెందిన ఓ యువ వ్యాపారవేత్త చోటు దక్కించుకున్నారు. దీంతో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ఆయన గుర్తింపు పొందారు. అక్షయ్ రుపారేలియా అనే 19 ఏళ్ల యువకుడు చదువుకుంటున్న సమయంలోనే డోర్‌స్టెప్స్.కో. యూకే అనే వెబ్‌సైట్ రూపొందించి తన వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్ ద్వారా యూకేలో స్వయం ఉపాధి పొందుతున్న తల్లుల నుంచి స్థిరాస్తి సమాచారం సేకరించి, దానిని తమ సైట్లో పోస్ట్ చేస్తుంటారు. కేవలం ఏడాదికాలంలోనే 100 మిలియన్ ఫౌండ్స్( దాదాపు 100 కోట్లను) ఆర్జించారు. 16 నెలల్లోనే యూకేలో 18వ అతిపెద్ద ఏజెన్సీగా ఈ వెబ్‌సైట్ పేరుగాంచింది.
ఆక్సఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్‌లో అవకాశం వచ్చినా అక్షయ్ చదువుకు స్వస్తి చెప్పి బిజెనెస్ వైపు మొగ్గు చూపాడు. తన బందువుల నుంచి 7 వేల పౌండ్లను సాయంగా తీసుకొని ఈ బిజినెస్ ప్రారంభించానని అక్షయ్ పేర్కొన్నాడు. తన తల్లి తండ్రులు చెవిటి వారని, వీరిద్దరు చెవిటి విద్యార్ధులకు శిక్షణ ఇస్తారని తెలిపారు. పిల్లలకోసం ఎంతో పరితపించే తల్లుల కోసం ఈ వెబ్‌సైట్ రూపోందించానని గర్వంగా చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment