బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు నాన్ బెయిలబుల్ వారెంట్!
బాలీవుడ్ తార ప్రీతి జింటాకు స్థానిక కోర్టులో చుక్కెదురైంది. పలుమార్లు కోర్టు ఆదేశించినప్పటికి హాజరకాకపోవడంతో ప్రీతి జింటాపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక జింటాకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది.
చెక్ బౌన్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రితీ జింటా కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కోర్టు హాజరుకాకపోవడంతో వారెంట్ ను చండీగడ్ కోర్టు జారీ చేసింది. ఇటీవల బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దూరమై.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు సహ భాగస్వామిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలకు ప్రీతి జింటా ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సిందే!