indian scouts and guides
-
దేవుని సేవ పేరుతో శఠగోపం?
కందుకూరు: భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే సంస్థ పేరుతో భక్తులను మోసం చేశారని బాధితులు వాపోతున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ టీటీడీకి అనుబంధంగా పనిచేస్తుంది. తిరుపతి సహా టీటీడీకి చెందిన దేవాలయాల్లో ఉచితంగా వారం రోజుల పాటు సేవ చేసే అవకాశాన్ని ఈ సంస్థ కల్పిస్తుంది. దీనిలో భాగంగా ముందుగానే పలు ప్రాంతాల్లో దేవుని సేవ చేసేందుకు ముందుకు వచ్చే భక్తులకు శిక్షణ ఇస్తుంది. ఇదిలా ఉండగా గత ఏడాది జూలైలో కందుకూరులోని కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో 170 మంది ఆర్యవైశ్య భక్తులకు శిక్షణ ఇచ్చారు. ఖర్చుల పేరుతో ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 350 చొప్పున రూ. 59,500 వసూలు చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సంస్థ తరఫున ఐడీ కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా వీరు తిరుపతిలో శ్రీవారి సేవలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు వీరికి ఐడీ కార్డులు ఇవ్వలేదు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థకు కార్యదర్శిగా ఉన్న సుబ్బారావు ఇలా మోసానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఫోన్ చేసి అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కందుకూరుతో పాటు ఒంగోలు, చీమకుర్తి, కనిగిరి జిల్లాలోని తదితర ప్రాంతాల్లో వందల మంది నుంచి డబ్బులు వసూలు చేసి సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు. దేవుని పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇటువంటి వారిని శిక్షించాలని పట్టణంలోని శిక్షణ పొందిన ఆర్యవైశ్య భక్తులు డిమాండ్ చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలి ఈ ఘటనపై బాధితులు ఎం. రమేష్, టి. వెంకట్, డి.మల్లికార్జున తదితరులు శనివార ం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. దేవుని సేవలో తరిస్తామనుకుంటే ఇలా అన్యాయం జరిగిందని వాపోయారు. త్వరలోనే కార్డు ఇస్తాం: మా సంస్థ కార్యాలయం గతంలో హైదరాబాద్‌లో ఉండేది. ప్రస్తుతం విజయవాడలోని ఇబ్రహీంపట్నంలోకి మార్చారు. దీనివల్ల ఐడీ కార్డులు అందజేయడంలో జాప్యం జరిగింది. శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికీ త్వరలోనే కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటా. – సుబ్బారావు, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ కార్యదర్శి -
గెలుపోటములు సమానంగా తీసుకోవాలి
గుంతకల్లు : జయాపజయాలను సమానంగా స్వీకరించి, స్ఫూర్తిని చాటాలని దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ జనరల్ మేనేజర్ (ఎస్సీఆర్ ఏజీఎం) ఏకే.గుప్తా సూచించారు. స్థానిక రైల్వే మైదానంలో బుధవారం సాయంత్రం సౌత్ సెంట్రల్ రైల్వే స్టేట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 22వ స్టేట్ (జోనల్ స్ధాయి) ర్యాలీ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ రైల్వే డివిజన్ల నుంచి వందలాది మంది స్కౌట్స్ విద్యార్థులు హాజరయ్యారు. వ్యాసరచన, నృత్యాలు, డ్రాయింగ్ కాంపిటీషన్, క్విజ్, ఫిజికల్ డిస్ప్లే కాంపిటీషన్, స్కౌట్స్ విద్యార్థులు తయారు చేసిన వస్తువుల ప్రదర్శన, క్యాంపుఫైర్ తదితర విభాగాల్లో నాలుగు రోజులు స్కౌట్స్ విద్యార్థులకు పోటీలు ఉంటాయి. డీఆర్ఎం బీజీ మాల్య మాట్లాడుతూ భారత్ స్కౌట్స్ గైడ్స్‌లో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి గనితే 94 ఏళ్ల వయసులోనూ దేశంలో ఈవెంట్లు ఎక్కడ జరిగినా హాజరవుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. అనంతరం సౌత్ సెంట్రల్ రైల్వే స్టేట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 22వ సేట్ట్ ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. జోనల్ పరిధిలోని వివిధ డివిజన్లకు చెందిన రైల్వే పాఠశాలల విద్యార్థులు పెరేడ్ ద్వారా ఏజీఎం ఏకే.గుప్తా గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ కమిషనర్ పద్మజ, స్టేట్ కార్యదర్శి ఎస్కే. గుప్తా, ఏడీఆర్ఎం సుబ్బరాయుడు, సీనియర్ డీపీఓ బలరామయ్య, ఆర్పీఎఫ్ గుంతకల్లు రైల్వే డివిజన్ సెక్యూరిటీ కమాండెంట్ ఏలీషా, సీనియర్ డీఈఎన్ కోఆర్డినేషన్ మనోజ్‌కుమార్ పాల్గొన్నారు.