Indian star shuttler
-
2028 ఒలింపిక్స్‌లో ఆడతా!
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో పతకం అంచనాలతో బరిలోకి దిగినా... ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. ఆ తర్వాత ఆడిన మూడు టోర్నీల్లో కూడా ఆమె విఫలమైంది. ఈ నేపథ్యంలో సింధు భవిష్యత్తుపై చర్చ నడుస్తోంది. అయితే తాను ఆటను ఇంకా ముగించలేదని సింధు స్పష్టం చేసింది. ఫిట్‌గా ఉంటే 2028లో లాస్ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లోనూ పాల్గొంటానని స్పష్టం చేసింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధు... 2020 టోక్యో క్రీడల్లో కాంస్యం సాధించింది. వచ్చే ఒలింపిక్స్ సమయానికి సింధుకు 33 ఏళ్లు నిండుతాయి. ‘ఆ సమయానికి నేను ఫిట్‌గా, గాయాలు లేకుండా ఉంటే కచి్చతంగా లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతాను. ఇప్పుడైతే నా ఆలోచన ఇదే. కాబట్టి ప్రస్తుత నా లక్ష్యం పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉండేందుకు ప్రయతి్నంచడం. అప్పుడు సహజంగానే ఆడాలనే ప్రేరణ లభిస్తుంది. సరిగ్గా చెప్పాలంటే నాలో ఇంకా చాలా ఆట మిగిలి ఉంది. ఎంతో సాధించాలనే తపన ఉంది. మరిన్ని టైటిల్స్ గెలిచి పోడియం మీద నిలబడాలని భావిస్తున్నా. నా ఆటతో భవిష్యత్ తరాలను స్ఫూర్తినివ్వాలని భావిస్తున్నా. అందుకోసం నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయతి్నస్తా’ అని సింధు పేర్కొంది. పారిస్‌లో ఓటమితో తానేమీ బాధ పడలేదని, పరాజయంతో ప్రపంచం ఆగిపోదని ఆమె అభిప్రాయ పడింది. ‘నా కెరీర్లో రెండు ఒలింపిక్స్‌లు అద్భుతంగా సాగాయి. అయితే ప్రతీసారి అలా జరగదు. మూడోసారి పతకం గెలవలేకపోయా. నేను బాగానే ఆడానని అనుకుంటున్నా. అక్కడితో అంతా ముగిసిపోలేదు. తప్పుల నుంచి మనం పాఠాలు నేర్చుకుంటాం. కాబట్టి పారిస్ వైఫల్యంపై బాధ లేదు. అక్కడితో ప్రపంచం ఏమీ ఆగిపోదు’ అని సింధు చెప్పింది. తన ఆటతీరు మెరుగుపర్చుకునే క్రమంలో మాజీ ఆటగాళ్లు లీ హ్యూన్, అనూప్ శ్రీధర్ల వద్ద ఆమె శిక్షణ తీసుకుంటోంది. కొన్ని సందర్భాల్లో మార్పు తప్పనిసరి అవుతుందని... అదే కారణంతో గత కోచ్‌ల వద్ద శిక్షణకు గుడ్‌బై చెప్పి కొత్త కోచ్‌లను ఎంచుకున్నట్లు సింధు వివరించింది. త్వరలో జరిగే జపాన్, చైనా ఓపెన్లపై దృష్టి పెట్టానని, మళ్లీ వరుస విజయాలు దక్కుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.‘ఇప్పుడు నేను శారీరకంగా, మానసికంగా మంచి స్థితిలో ఉన్నా. పూర్తి ఫిట్‌గా కూడా మారాను. స్పీడ్, డిఫెన్స్‌కు సంబంధించి కొన్ని లోపాలను సరిదిద్దుకునే పనిలో ఉన్నాను. కోచ్‌ల ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవడం ఎప్పుడూ బాగుంటుంది. వారి పర్యవేక్షణలో రాబోయే జపాన్, చైనా టోర్నీల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నా. అక్కడినుంచే మ్యాజిక్ మొదలవుతుంది. చూస్తూ ఉండండి’ అని సింధు వ్యాఖ్యానించింది. విశాఖపట్నంలో తన బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణం పనులు ప్రారంభం అయ్యాయని... ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రాబోయే ఏడాదిన్నర కాలంలో అది సిద్ధమవుతుందని సింధు వెల్లడించింది. -
స్వర్ణ పతకం ఫేవరెట్స్‌లో సింధు: గోపీచంద్
టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు స్వర్ణ పతకం గెలిచే సత్తా ఉందని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. సింధుతోపాటు ఇతర క్రీడాంశాల్లోనూ భారత్‌కు పతకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని గోపీచంద్ అభిప్రాయపడ్డారు. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి క్రీడాకారులకు కావాల్సినంత మద్దతు లభించిందని... ఈసారి భారత్‌కు రెండంకెల్లో పతకాలు వస్తాయని తాను ఆశిస్తున్నాననని గోపీచంద్ పేర్కొనాడు. -
క్వీన్ సైనా
జకార్తా: ఇండోనేసియా గడ్డపై భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ అనుబంధం కొనసాగుతోంది. గతంలో ఇక్కడ పలు చిరస్మరణీయ విజయాలు సాధించిన సైనా... ఇప్పుడు మరో మేజర్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. అర్ధాంతరంగా ముగిసిన ఫైనల్లో విజేతగా నిలిచి ఇండోసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నీలో సైనా విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన తుదిపోరులో ఆమె ప్రత్యర్థి కరోలినా మారిన్ (స్పెయిన్) తొలి గేమ్‌లోనే కాలి గాయంతో తప్పుకుంది. ఆ సమయంలో సైనా 4–10తో వెనుకబడి ఉంది. విజేత సైనాకు 26, 250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 61 వేలు) లభించింది. 2018లో ఇదే టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచిన సైనా... ఇప్పుడు విజయం అందుకుంది. గత రెండేళ్లలో సైనాకు ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్ కావడం విశేషం. 2017 జనవరిలో ఆమె మలేసియా మాస్టర్స్ టైటిల్ గెలిచింది. గత వారమే మలేసియా మాస్టర్స్ టోర్నీలో సైనాపై ఘన విజయం సాధించిన మారిన్ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. వేగంగా కదులుతూ తొలి రెండు పాయింట్లు తన ఖాతాలో వేసుకున్న మారిన్ అదే జోరును కొనసాగించింది. సైనా తప్పిదాలతో ఆమె 6–2తో ముందంజ వేసింది. దూకుడు పెంచిన మారిన్ 9–2తో దూసుకుపోయిన దశలో కోర్టులో అనూహ్యంగా పడిపోవడంతో కాలికి గాయమైంది. చికిత్స అనంతరం ఆమె ఆట కొనసాగించినా...మరో మూడు పాయింట్ల తర్వాత ఇక తన వల్ల కాదంటూ కుప్పకూలింది. కన్నీళ్లతో మారిన్ కోర్టు వీడగా...సైనా విజేతగా ఆవిర్భవించింది. ‘నేను టైటిల్ సాధించిన తీరు పట్ల ఆనందంగా లేను. కఠినమైన ప్రత్యర్థులను ఓడించి ఫైనల్ వరకు వెళ్లడం సంతోషకరం. ఫైనల్లో నేను వెనుకబడ్డాననేది వాస్తవం. అయితే గట్టిగా పోరాడేదాన్ని. దురదృష్టవశాత్తూ ఈ ఘటన జరిగింది. కోర్టులో ఈ తరహాలో గాయపడటం చాలా బాధాకరం. నాకు కూడా ఇలాంటి అనుభవం గతంలో ఎదురైంది కాబట్టి ఆ వేదన ఎలాంటిదో బాగా తెలుసు’ అని మ్యాచ్ అనంతరం సైనా వ్యాఖ్యానించింది. -
శ్రీకాంత్ జాక్‌పాట్
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ బ్రాండింగ్ ప్రపంచంలో బ్రహ్మాండంగా మెరిశాడు. క్రికెటేతర ఆటగాళ్లలో రికార్డు మొత్తానికి భారీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. చైనా స్పోర్ట్స్ బ్రాండ్ ‘లి–నింగ్’ నాలుగేళ్ల కాలానికి శ్రీకాంత్‌తో రూ.35 కోట్లకు డీల్ కుదుర్చుకుంది. ఇందులో రూ. 30 కోట్లు స్పాన్సర్షిప్ మొత్తంగా అందించనుండగా... మరో రూ. 5 కోట్ల విలువైన క్రీడా సామగ్రిని లి–నింగ్ అందిస్తుంది. 2023 వరకు ఈ ఒప్పందం కొనసాగుతుందని శ్రీకాంత్ వ్యవహారాలు చూసే బేస్‌లైన్ వెంచర్స్ సంస్థ వెల్లడించింది. ఒప్పంద కాలంలో భారత షట్లర్ ఆ సంస్థకు చెందిన క్రీడోపకరణాలే వాడటంతో పాటు మ్యాచ్‌లు ఆడేటపుడు కూడా లి–నింగ్ దుస్తులే ధరించాల్సి ఉంటుంది. కెరీర్లో ఆరు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన శ్రీకాంత్ గత ఏడాది వరల్డ్ నంబర్‌వన్‌గా కూడా నిలిచాడు. ప్రస్తుతం అతను ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నాడు. గతంలో రెండేళ్ల పాటు (2014–15) శ్రీకాంత్ లి–నింగ్‌కు ప్రచారకర్తగా ఉన్నాడు. అయితే ఆ తర్వాత అతను ప్రముఖ జపాన్ సంస్థ ‘యోనెక్స్’తో జత కలిశాడు. చైనాకు చెందిన లి–నింగ్ సంస్థ తమ దేశంతో పాటు ఇండోనేసియా, సింగపూర్, ఆస్ట్రేలియా బ్యాడ్మింటన్ టీమ్‌లకు కిట్లను అందిస్తోంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత బృందానికి స్పాన్సర్‌గా వ్యవహరించిన లి–నింగ్... 2020 టోక్యో ఒలింపిక్స్ వరకు కూడా భారత జట్టుతో ఒప్పందం కొనసాగించనుంది. -
క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్
జ్వాల-అశ్విని జోడి ఔట్ ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ జకార్తా: ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన రెండో రౌండ్లో సైనా 21-17, 21-9 తేడాతో కిర్స్టీ గిల్మర్ (స్కాట్లాండ్)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో నాలుగో సారి టైటిల్ వేటలో మరో అడుగు ముందుకేసిన ఎనిమిదో సీడ్ సైనా.. క్వార్టర్స్‌లో టాప్‌సీడ్, చైనా క్రీడాకారిణి జురుయ్ లీతో తలపడనుంది. జురుయ్ లీ రెండో రౌండ్లో 21-12, 21-19తో అడ్రియంటి ఫిర్దాసరిపై నెగ్గి క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. ఇరువురి మధ్య ఇప్పటిదాకా జరిగిన ముఖాముఖి పోరులో సైనాపై 6-2తో జురుయ్ లీదే పైచేయిగా ఉంది. అయితే ఇదే టోర్నీలో 2012 ఫైనల్లో జురుయ్ లీని ఓడించి విజేతగా నిలిచిన రికార్డు సైనా ఆత్మవిశ్వాసాన్ని పెంచనుంది. ఇక మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్వినీ పొన్నప్ప జోడి పోరాటం రెండో రౌండ్‌తోనే ముగిసింది. కొరియా జంట యీ నా జంగ్-సో యంగ్ కిమ్ చేతిలో జ్వాల-అశ్విని ద్వయం 16-21, 21-15, 12-21 తేడాతో ఓటమిపాలైంది.