indianapolis
-
మెగా మ్యూజియం గురించి తెలుసా?
మ్యూజియం అంటే కళాఖండాలు, పురాతన వస్తువులు ఉంటాయని తెలుసు. అయితే చిన్నపిల్లల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజియం గురించి మీకు తెలుసా? అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఇండియానా పోలిస్ అనే ప్రాంతంలో ’The Children’s Museum of Indianapolis.’ ఉంది. ప్రపంచంలో పిల్లల కోసం ఏర్పాటు చేసిన అతి పెద్ద మ్యూజియం ఇది. 1925లో మేరీ స్టీవర్ట్ కారీ అనే ఆయన దీన్ని ప్రారంభించారు. మొదట చిన్నగా మొదలైన ఈ మ్యూజియం అనంతరం విస్తరిస్తూ 1976లో అతి పెద్ద మ్యూజియంగా మారింది. 4,72,900 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మ్యూజియంలో ఐదు అంతస్తులున్నాయి. ఇక్కడ దాదాపు 1,30,000కు పైగా రకరకాల వస్తువులు, కళాఖండాలు ఉన్నాయి. ఏటా పది లక్షలమందికి పైగా ఈ మ్యూజియాన్ని సందర్శిస్తుంటారు. వారికి సేవలందించేందుకు నాలుగు వందల మంది ఉద్యోగులు, 1500 మంది వాలంటీర్లు ఉంటారు.చిన్నారుల్లో సైన్స్ పట్ల, సామాజిక అంశాల పట్ల ఆసక్తి, అవగాహన పెంచడం ఈ మ్యూజియం ప్రధాన ఉద్దేశం. ఇందులో సైన్స్, చరిత్ర, జంతువులు, వైద్యం, సామాజిక, ఆర్థిక అంశాలను సూచించే అనేక వస్తువులున్నాయి. అవన్నీ పిల్లలకు చూపించడం ద్వారా వారిలో ఆ అంశాలపై అవగాహన పెంచుతారు. ఒక్కో ఫ్లోర్లో ఒక్కో అంశానికి సంబంధించిన వస్తువులు ఉంటాయి. డైనోసార్ల జీవితం, వాటి మరణం వంటి అంశాలను వివరించేందుకు ఇక్కడ ప్రత్యేక విభాగం ఉంది. అది చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటుంది.కేవలం వస్తువులు చూసి వెళ్లిపోయేలా కాకుండా ఈ మ్యూజియంలో పలు క్రీడా కోర్టులు ఏర్పాటు చేశారు. చిన్నారులు అక్కడికి వెళ్లి వారికి నచ్చిన ఆటలు ఆడుకోవచ్చు. మ్యూజియంలో ‘లిల్లీ థియేటర్’ కూడా ఉంది. అక్కడ చిన్నారుల కోసం ప్రత్యేకంగా నాటకాలు, షోలు ఏర్పాటు చేస్తుంటారు. -
ఫెడెక్స్ మాజీ ఉద్యోగి ఘాతుకం, నలుగురు భారతీయులు బలి
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలోని ఇండియానాపొలిస్ నగరంలో చోటు చేసుకున్న కాల్పుల్లో చనిపోయిన వారిలో నలుగురు భారతీయులు ఉండటం విషాదాన్ని నింపింది. ఈ కాల్పుల ఘటనపై విదేశీ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికాలోని ఇండియానా పోలిస్‌లోని స్థానిక అధికారులకు, సిక్కు సంఘ నాయకులకు భారతదేశం అన్ని విధాలా సహాయం చేస్తుందని వెల్లడించారు. నలుగురు సిక్కులు ప్రాణాలు కోల్పోవడంపై సిక్కు సంఘం కూడా స్పందించింది. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. అటు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 4 గురు సిక్కులతో సహా 8 మందిని బలితీసుకున్న ఈ కాల్పుల సంఘటన తనను షాక్‌కు గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడి పోలీసులు వెల్లడించారు. ఎనిమిది మంది మృతుల్లో నలుగురు సిక్కులున్నారని తెలిపారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న 19 ఏళ్ల బ్రాండన్ స్కాట్ హోల్ ఈ దారుణానికి పాల్పడ్డాడని, ఇతను ఫెడెక్స్ మాజీ ఉద్యోగి అని పేర్కొన్నారు. (అమెరికాలో మరోసారి భారీ కాల్పులు: దుండగుడి ఆత్మహత్య) ఇండియానాపోలిస్ మెట్రోపాలిటన్ పోలీస్ విభాగం వెల్లడించిన భారతీయ బాధితుల పేర్లు అమర్ జీత్ జోహాల్ (66) జస్వీందర్ కౌర్ (64) అమర్ జీత్ షెఖాన్ (48) జస్వీందర్ సింగ్ (68) కాగా ఇండియానాపొలిస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఫెడెక్స్ గిడ్డంగి వద్ద గురువారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఎనిమిది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని బ్రాండన్ స్కాట్‌గా పోలీసులు గుర్తించారు. గత ఏడాది వరకు ఫెడెక్స్ లో పనిచేసిన బ్రాండన్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపి, తర్వాత ఆత్మహత్యకు పాలడ్పాడని అక్కడి పోలీసు అధికారి క్రెయిగ్ మెక్ కార్ట్ చెప్పారు. అతడు గత ఏడాది వరకు పనిచేశాడని చెప్పారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. Deeply shocked by shooting at FedEx facility in Indianapolis. Victims include persons of Indian American Sikh community. Our Consulate General in Chicago in touch with Mayor & local authorities in Indianapolis as well as community leaders. Will render all possible assistance: EAM pic.twitter.com/ONhvrdLQHD — ANI (@ANI) April 17, 2021 -
కాల్పుల కలకలం : గర్భిణీ సహా ఆరుగురు మృతి
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పల కలకలం చెలరేగింది. ఇండియానా పోలీస్‌లో ఆదివారం తెల్లవారుజామున దుండగులు కాల్పులకు తెగబడ్డారు.ఈ ఘటనలో గర్భిణీతో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా పుట్టబోయే బిడ్డతో సహా గర్భిణీ స్త్రీ చనిపోవడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది.తీవ్రంగా గాయపడిన మరో చిన్నారిని ఆసుపత్రికి తరలించామని, పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.మరోవైపు ఈ కాల్పులను ఇండియానాపోలిస్ మేయర్ జో హాగ్‌సెట్ తీవ్రంగా ఖండించారు. ఇది చాలా దారుణమైన ఘటన అని పేర్కొన్నారు .దీనిపై స్థానిక పోలీసులు, ఇతర అధికారులు దర్యాప్తు చేపట్టారని చెప్పారు. అటు గత దశాబ్దకాలంలో ఇంతటి ఘోరమైన కాల్పులు చూడలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు. -
మైనర్‌తో శృంగారం కోసం 565 కి.మీ నడిచాడు
విస్కాన్సిన్(యూఎస్) : చెడుగా ఆలోచించి చేసే పనులు తప్పకుండా ఇబ్బందుల పాలు చేస్తాయి. తాజాగా ఇండియానాకు చెందిన టామీ లీ జెంకిన్స్ కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. తనకు ఫేస్బుక్లో పరిచయమైన 14 ఏళ్ల మైనర్ బాలికతో శృంగారం కోసం ఏకంగా ఇండియానా నుంచి విస్కాన్సిన్ వరకు 565 కి.మీ నడిచాడు. కానీ ఆ తర్వాత తాను చాట్ చేసింది.. ఓ పోలీసు అధికారితో అని తెలుసుకుని ఖంగుతిన్నాడు. చివరకు చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడిన కేసులో అరెస్టు అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. యూఎస్‌లో చిన్నారులపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులను ఆరికట్టడానికి అక్కడి అధికారులు పలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఒక అధికారి కైలీ అనే పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాను క్రియేట్ చేశారు. కైలీ వయసు 14 ఏళ్లు అని, విస్కాన్సిన్లోని నిన్హా ప్రాంతంలో ఉంటుందని పేర్కొన్నారు. కైలీ అకౌంట్ నుంచి పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను జెంకిన్స్ యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత జెంకిన్స్.. లైంగిక పరమైన అంశాలు చర్చించడం మొదలుపెట్టాడు. అలాగే నగ్న ఫొటోలు పంపిచాల్సిందిగా కోరేవాడు. ఇటీవల కైలీని తనను కలవాల్సిందిగా కోరాడు. దానికి ఆమె అంగీకరించడంతో.. అతను ఇండియానా నుంచి విస్కాన్సిన్కు నడక ప్రారంభించాడు. ఈ క్రమంలోని తన వివిధ ప్రాంతాల్లో దిగిన ఫొటోలను కైలీకి పంపించాడు. ఇదంతా గమనిస్తున్న అధికారులు జెంకిన్స్ నిన్హా చేరుకోగానే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కంప్యూటర్ ద్వారా మైనర్ బాలికను ప్రేరేపించడం లేదా ప్రలోభపెట్టినందుకు గాను అతనిపై కేసు నమోదు చేశారు. జెంకిన్స్‌పై నమోదైన కేసు ఫెడరల్ కోర్టులో అక్టోబర్ 23వ తేదీ విచారణకు రానుంది. ఇలా మైనర్‌తో శృంగారం కోసం జెంకిన్స్ 565 కి.మీ నడిచి.. చివరకు చిక్కుల్లో పడ్డాడు. అతను దోషిగా తెలితే.. కోర్టు 10 ఏళ్లు జైలు శిక్ష విధించనుంది. ఈ ఘటనపై యూఎస్ అటార్నీ మాథ్యూ క్రూగర్ మాట్లాడుతూ.. ‘ఇటీవలి కాలంలో తమ ప్రాంతంలో బాలికలపై లైంగిక వేధింపులు పెరిపోయాయి. మైనర్ బాలికలపై వేధింపులకు పాల్పడేవారికి ఇంటర్నెట్ ద్వారా వారి పని సులభం అయిపోతుంది. అయితే అలాంటి వారిని శిక్షించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామ’ని తెలిపారు. -
అమెరికాలో కారు ప్రమాదం : ఇద్దరు సిక్కుల మృతి
వాషింగ్టన్: కారు ప్రమాదంలో ఇద్దరు సిక్కు యువకులు మృతిచెందారు. మృతులను ఇండియానా రాష్ట్రానికి చెందిన ధవ్‌నీత్ సింగ్ చల్లా, వరుణ్‌దీప్ సింగ్‌గా గుర్తించారు. ఈ ఘటన బుధవారం రాత్రి 2.30 గంటలకు చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తిని తప్పించబోయి పక్కనే ఉన్న చెట్టుకు కారును ఢీకొట్టారు. వెనక సీటులో ఉన్న మరో వ్యక్తి గుర్జిత్ సింగ్ సంధూ (20)గా గుర్తించారు. -
అలరించిన అంకరాజు అలేఖ్య అరంగేట్రం
గతవారం ఇండియానా పొలిస్ లో చి.సౌ అంకరాజు అలేఖ్య కర్ణాటక శాస్త్రీయసంగీత రంగప్రవేశం దిగ్విజయంగా జరిగింది. దీనికి గాను మృదంగ విద్వాన్ త్రివేండ్రం బాలాజీ, వాయులీన విదూషి కుమారి రంజనీ రామకృష్ణలు వాయిద్య సహకారమందించారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న అలేఖ్య, నాలుగుసంవత్సరాల చిరుప్రాయంలొనే తన తల్లిగారివద్ద శాస్త్రీయసంగీతంలో తొలిపాఠాలు నేర్చుకుంది. శ్రీమతి వసంత శ్రీనివాసన్, శ్రీమతి లక్ష్మివారణాసిల వద్ద శిష్యరికంచేసి, గతనాలుగుసంవత్సరాలుగా కళారత్న శ్రీ డి శేషాచారి(హైదరాబాద్ బ్రదర్స్) గారి వద్ద స్కైప్ (అంతర్జాల దృశ్యశ్రవణ) మాధ్యమం ద్వారా శిక్షణ తీసుకుంటోంది. గాత్రంలోనే కాక, కర్నాటక మరియు పశ్చిమ శాస్త్రీయ సాంప్రదాయపద్ధతుల్లో వాయులీనవాద్యమందుకూడా సుశిక్షితురాలు. కచేరినందు, శృతి శుద్ధమైన గాత్రం, సాధికారికమైన ఉఛ్చారణ, భావగాంభీర్యత తనప్రత్యేకతలని వివిధ రాగమాలికాలాపనలద్వారా ప్రకటితముచేయడములో సఫలీకృతురాలయ్యింది శ్రీమతి లలిత, శ్రీ కృష్ణ అంకరాజుల జ్యేష్ట పుత్రికయైన అలేఖ్య. రాగతాళరీతులందు తన ప్రావీణ్యత, మనోధర్మానుసార రాగవిస్తారణాకౌశలము, జతిగతిగమన నియంత్రణాపటిమలను సభాసదులు సదృశముగా తిలకించి, సకర్ణముగా ఆలకించారు. సంగీత సాధనతోపాటూ, విద్యాభ్యాసన, సేవా సంబంధిత వ్యాసంగములందేగాక, జాతీయస్థాయి స్పెల్లింగ్ బీ పోటీలందుకూడా జయకేతనమెగురవేస్తున్న చిన్నారిని ఆహుతులందరూ ప్రశంసించారు. తన సాధన వెనుక వెన్నుదన్నుగానిల్చిన తల్లిదండ్రులను, గురువులను, శ్రేయొభిలాషులను వినమ్రశీలియైన అలేఖ్య సభాముఖముగా ప్రస్తుతించడం, రసజ్ఞుల హృదయాలను ఆర్ద్రపరచింది. విద్వాన్ కచేరి అనంతరం కమ్మని విందుభోజనముతో సంపూర్ణనందభరితులైన అతిధులందరూ చిన్నారిని మరెన్నో ఉన్నత శిఖరాలనధిరోహించాలని ఆశీర్వదించడముతో రంగప్రవేశమహోత్సవము పరిసమాప్తియైనది.