Indians money
-
ఏమైంది? స్విస్ బ్యాంకుల్లో భారీగా తగ్గిన భారతీయుల డబ్బు
న్యూఢిల్లీ/జ్యూరిక్: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, భారతీయ సంస్థల నిధులు గతేడాది గణనీయంగా తగ్గాయి. 2022తో పోలిస్తే 2023లో 70 శాతం క్షీణించి నాలుగేళ్ల కనిష్ట స్థాయి 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంకులకు (సుమారు రూ. 9,771 కోట్లు) పడిపోయాయి.2021లో 3.83 బిలియన్ ఫ్రాంక్ల గరిష్ట స్థాయిని చేరిన తర్వాత స్విస్ బ్యాంకుల్లో భారతీయ ఖాతాదారుల మొత్తం నిధులు వరుసగా రెండవ సంవత్సరం క్షీణించాయి. ఇది 14 సంవత్సరాలలో అత్యధికం. బాండ్లు, సెక్యూరిటీలు, వివిధ ఆర్థిక సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేసే నిధుల్లో భారీగా తగ్గుదల ఉండటమే 2023లో ఈ తగ్గుదలకు ప్రధాన కారణం.భారత్లోని ఇతర బ్యాంకు శాఖల ద్వారా ఖాతాదారుల డిపాజిట్ ఖాతాలు, నిధులలో గణనీయమైన తగ్గింపులు ఉన్నాయని డేటా వెల్లడించింది. స్విస్ బ్యాంకులు క్రోడీకరించి స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ)కి నివేదించిన ఈ గణాంకాలు స్విట్జర్లాండ్లో భారతీయులు ఎంత నల్లధనాన్ని కలిగి ఉన్నాయో పేర్కొనలేదు. స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, ఎన్ఆర్ఐలు లేదా ఇతరులు థర్డ్ కంట్రీ సంస్థల పేరిట ఉన్న డబ్బును కూడా ఈ గణాంకాల్లో చేర్చలేదు. -
స్విస్ ఖాతాల్లో సొమ్ము తగ్గింది!!
జ్యూరిక్/న్యూఢిల్లీ: స్విస్ ఖాతాల్లో భారతీయులు దాచుకునే నగదు పరిమాణం గణనీయంగా తగ్గుతోంది. 2018లో ఇది 955 మిలియన్ స్విస్ ఫ్రాంకులకు (దాదాపు రూ. 6,757 కోట్లు) పడిపోయింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 6 శాతం తగ్గుదల కాగా, దాదాపు రెండు దశాబ్దాల కనిష్ట స్థాయి కూడా కావడం గమనార్హం. స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అయితే, ఇలా దాచుకున్న డిపాజిట్లలో వివాదాస్పద నల్లధనం ఎంత? సక్రమమైన డిపాజిట్ల మొత్తమెంత? అనే వివరాలు ఇందులో లేవు. అలాగే, వివిధ దేశాల నుంచి వేర్వేరు సంస్థలు, వ్యక్తుల పేరిట భారతీయులు, ప్రవాస భారతీయులు చేసిన డిపాజిట్లకు సంబంధించిన వివరాలు కూడా ఈ డేటాలో లేవు. భారత్లోని స్విస్ బ్యాంకుల శాఖల్లో ఉన్న డిపాజిట్ల పరిమాణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఎస్ఎన్బీ ఈ డేటా రూపొందించింది. స్విస్ ఖాతాల్లో బ్లాక్మనీ దాచుకునే నల్ల కుబేరులపై కేంద్రం కొరడా ఝుళిపిస్తున్న నేపథ్యంలో తాజా గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎస్ఎన్బీ గణాంకాల ప్రకారం స్విస్ బ్యాంకు ఖాతాల్లో విదేశీ ఖాతాదారుల సొమ్ము దాదాపు 4 శాతం క్షీణించి 1.4 లక్షల కోట్ల స్విస్ ఫ్రాంకుల (దాదాపు రూ. 99 లక్షల కోట్లు) స్థాయికి తగ్గింది. -
స్విస్ బ్యాంకుల్లో.. తగ్గిన భారతీయుల సొమ్ము
2014లో 10 శాతం డౌన్ రూ. 12,615 కోట్లకు తగ్గుదల జ్యూరిక్ : స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిన డబ్బు గతేడాది దాదాపు 10 శాతం తగ్గింది. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ అయిన స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ) వెల్లడించిన గణాంకాల ప్రకారం 2014 ఆఖరు నాటికి ఈ మొత్తం 1.8 బిలియన్ స్విస్ ఫ్రాంకులుగా (సుమారు రూ. 12,615 కోట్లు) ఉంది. అంతక్రితం ఏడాది ఈ మొత్తం 2.03 బిలియన్ స్విస్ ఫ్రాంకులుగా ఉండేది. స్విస్ బ్యాంకుల్లో భారతీయ సంస్థలు, వ్యక్తులు దాచిన డబ్బు ఇంత తక్కువ స్థాయికి తగ్గిపోవడం ఇది రెండోసారి. 2012లో ఇది దాదాపు రూ. 8,530 కోట్లకు తగ్గింది. ఆ తర్వాత ఏడాది (2013లో) 40 శాతం పెరిగింది. నల్ల ధనాన్ని దాచుకున్న వారి పేర్లు వెల్లడించాలంటూ స్విస్ బ్యాంకులపై భారత్ సహా ప్రపంచ దేశాల ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, ఇతర దేశాల వారు స్విస్ బ్యాంకుల్లో దాచుకునే డబ్బు గణనీయంగా పెరిగింది. 2013లో రూ. 90 లక్షల కోట్లుగా ఉండగా.. 2014లో ఇది రూ. 103 లక్షల కోట్లకు చేరింది. అమెరికన్లు స్విస్ బ్యాంకుల్లో దాచిన సొమ్ము వరుసగా రెండో ఏడాది కూడా పెరిగి 244 బిలియన్ స్విస్ ఫ్రాంకుల స్థాయికి చేరింది. బ్రిటన్, జర్మనీ, ఇటలీ తదితర దేశాల వారి నిధులూ ఇదే కోవలో పెరిగాయి. ఎస్ఎన్బీ అధికారికంగా వెల్లడించిన గణాంకాల్లో నల్లధనం వివరాల గురించి ప్రస్తావన లేదు. పెరిగిన లాభాలు.. తగ్గిన ఉద్యోగులు.. 2014లో స్విస్ బ్యాంకుల స్థూల లాభాలు 6.4 బిలియన్ స్విస్ ఫ్రాంకుల మేర పెరిగాయి. స్విట్జర్లాండ్లోని 275 బ్యాంకుల్లో 246 బ్యాంకులు లాభాలార్జించాయి. అసాధారణ ఆదాయం నమోదు కావడం, ఇతరత్రా వ్యయాలు తగ్గడం ఇందుకు దోహదపడ్డాయి. మరోవైపు, బ్యాంకుల్లో ఉద్యోగుల సంఖ్య 1,844 మేర తగ్గి, 1,25,289కి చేరింది.