Indigo company
-
ఇండిగో నిర్వహణ బాగోలేదు.. సొంత సంస్థపై ఉద్యోగుల షాకింగ్ ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రామాణిక నిర్వహణ విధానాలను ఇండిగో సరిగ్గా పాటించడం లేదని ఆ సంస్థలో పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు ఆరోపించారు. దీని వల్ల ప్రయాణికుల భద్రత రిస్క్‌లో పడుతోందని పేర్కొన్నారు. ఈమేరకు ఆల్ ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్స్ జులై 12న విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌కు లేఖ రాశారు. ఇండిగో విషయంలో వెంటనే జోక్యం చేసుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఎయిర్‌బస్‌కు వారు విజ్ఞప్తి చేశారు. 'మీరు విమానాలకు లీజుకు ఇచ్చిన ఆపరేటర్లు నిర్వహణ ప్రమాణాలను పాటించడం లేదు. గత నాలుగు రోజులుగా సాంకేతిక సిబ్బంది స్ట్రయిక్ చేస్తున్నారు. అయినా సరైన నిర్వహణ లేకుండానే విమానాలు నడుస్తున్నాయి. మీరు ఈ విషయంలో జోక్యం చేసుకుని గత ఏడు రోజులకు సంబంధించిన నిర్వహణ డాటాను ఆపరేటర్లను అడగండి. సరైన నిర్వహణ లేకపోతే ఆ సంస్థల వల్ల మార్కెట్లో మీ కంపెనీకి కూడా చెడ్డపేరు వస్తుంది. మీ విమానాల నిర్వహణ ప్రమాణాలను వారు దిగజార్చారు. ఈ విషయంపై మీరు వాళ్లని నేరుగా ప్రశ్నించండి.' అని సాంకేతిక నిపుణులు ఎయిర్‌బస్‌కు లేఖ రాశారు. అయితే, ఈ ఆరోపణలను ఇండిగో కొట్టిపారేసింది. విమాన నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నట్లు పేర్కొంది. అన్ని నిబంధనలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పింది. ఇవి నిరాధార ఆరోపణలని, కొందరు దురుద్దేశంతోనే ఈ ప్రచారం చేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఇండిగో సాంకేతిక నిపుణులు లేఖ రాసిన ఐదు రోజులకే ఆ సంస్థకు చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం గమనార్హం. ఆదివారం షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం సాంకేతిక కారణాలతో పాకిస్థాన్ కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. దీంతో ఈ లేఖ చర్చనీయాంశమైంది. చదవండి: కరాచీ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ -
ఇండిగో ఘటనపై స్పందించిన సీఈవో
CEO of IndiGo Ronojoy Dutta has expressed regret: దివ్యాంగ చిన్నారి విమానం ఎక్కేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిరాకరించడంతో ఆ సంస్థ సీఈవో రోనోజోయ్ దత్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటన పై విచారణ వ్యక్తం చేయడమే కాకుండా ఆ చిన్నారి కోసం ఎలక్ట్రిక్ వీల్ చైర్‌ని కొనుగోలు చేయాలనుకున్నట్లు తెలిపారు. శారీరక వికలాంగుల సంరక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసే తల్లిదండ్రులే మన సమాజానికి నిజమైన హీరోలు అని అన్నారు. ఆయన బాధిత కుటుంబానికి తన సానుభూతిని తెలియజేశారు. ఆ ఘటన గురించి దత్తా మాట్లాడుతూ..."మా కస్టమర్లకు మర్యాదపూర్వకంగా, దయతో కూడిన సేవను అందించడమే మాకు ముఖ్యం. ఐతే భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా విమానాశ్రయ సిబ్బంది విమానం ముందుకు సాగుతుందా లేదా అనే దానిపై క్లిష్టమైన పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయం తీసుకోవల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక సంస్థగా సాధ్యమైనంత వరకు సరైన నిర్ణయం తీసుకుందనే నేను భావిస్తున్నాను". అని అన్నారు. అంతేకాదు ఈ ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పైగా ఆయన తానే స్వయంగా దర్యాప్తు చేపడతానని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఆ ఘటన తాలుకా వీడియో సోషల్ మాధ్యమాల్లో తెగ హల్ చల్ చేస్తోంది. Here is the video of the incident that happened at Ranchi airport where @IndiGo6E airlines denies boarding to a special need child along with his child. Seems lack of empathy from Indigo staff, not the first time though. Indigo to issue a statement shortly. @JM_Scindia https://t.co/5ixUDZ009a pic.twitter.com/SyTNgAQIT6 — Dibyendu Mondal (@dibyendumondal) May 8, 2022 (చదవండి: ఇండిగో సిబ్బంది తీరుపై జ్యోతిరాదిత్య సింథియా ఆగ్రహం.. స్వయంగా దర్యాప్తు చేస్తానని ట్వీట్) -
నేడు కర్నూలు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం
-
నేడు కర్నూలు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం
కర్నూలు(సెంట్రల్): విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాలకు ఆదివారం కర్నూలు నుంచి విమాన రాకపోకలు మొదలు కానున్నాయి. ముందుగా కర్నూలు నుంచి విశాఖ వెళ్లే మొదటి విమానాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం తదితరులు జెండా ఊపి ప్రారంభిస్తారు. ఇక ఇండిగో సంస్థకు చెందిన విమానం(6ఈ7911) బెంగళూరు నుంచి ఆదివారం ఉదయం 09.05కి బయల్దేరి 10.10కి కర్నూలుకు చేరుకుంటుంది. కర్నూలు నుంచి 6ఈ7912 అనే నంబర్ కలిగిన విమానం ఉదయం 10.30కి బయల్దేరి మధ్యాహ్నం 12.40కి విశాఖ చేరుకుంటుంది. అలాగే 6ఈ7913 అనే నంబర్ కలిగిన మరో విమానం విశాఖ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయల్దేరి కర్నూలుకు 2.55కి చేరుకుంటుంది. 6ఈ7914 అనే నంబర్ కలిగిన విమానం కర్నూలు నుంచి మధ్యాహ్నం 3.15కి బయల్దేరి సాయంత్రం 4.25కి బెంగళూరు చేరుకుంటుంది. 6ఈ7915 అనే నంబర్ కలిగిన విమానం చెన్నై నుంచి మధ్యాహ్నం 2.50కి బయల్దేరి కర్నూలుకు 4.10కి, 6ఈ7916 అనే నంబర్ కలిగిన విమానం కర్నూలు నుంచి సాయంత్రం 4.30కి బయలుదేరి చెన్నైకి 5.50కి చేరుకుంటుంది. కాగా, ప్రయాణికుల నుంచి కూడా స్పందన బాగుంది. బెంగళూరు నుంచి కర్నూలుకు వచ్చేందుకు 52 మంది, కర్నూలు నుంచి విశాఖ వెళ్లేందుకు 66 మంది, విశాఖ నుంచి కర్నూలుకు 31 మంది, కర్నూలు నుంచి బెంగళూరుకు 63 మంది, చెన్నై నుంచి కర్నూలుకు 16 మంది, కర్నూలు నుంచి చెన్నైకి 32 మంది బుక్ చేసుకున్నారు. 27వ తేదీ మధ్యాహ్నం 3 వరకు విమాన ప్రయాణం చేసేందుకు బుక్ చేసుకున్న వారి వివరాలను ఇండిగో ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు. అలాగే విమాన టికెట్ల ధరలు ప్రస్తుతం కర్నూలు–బెంగళూరు మధ్య రూ.2,077, చెన్నైకి రూ.2,555, విశాఖకు రూ.3,077గా ఉన్నాయి. -
ఇండిగో ఐపీఓకు ఆమోదం
న్యూఢిల్లీ: చౌక ధరల్లో విమానయాన సర్వీసులందజేసే ఇండిగో సంస్థ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓ ద్వారా ఇండిగో రూ.2,500 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓలో భాగంగా రూ.1,272 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. మరోవైపు ప్రస్తుతమున్న వాటాదారుల వద్దనున్న 3 కోట్ల షేర్లను కూడా ఇంతే మొత్తానికి ఈ ఐపీఓ ద్వారా ఆఫర్ చేయాలని ఇండిగో భావిస్తోంది. ఈ ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను ఈ ఏడాది జూన్‌లోనే ఇండిగో సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓకు సిటీగ్రూప్, జేపీ మోర్గాన్ ఇండియా, మోర్గాన్ స్టాన్లీ, బార్క్లేస్, యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీలు మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. దేశంలో లాభాలార్జిస్తున్న రెండు విమాన యాన సంస్థల్లో ఇండిగో ఒకటి కాగా, రెండోది గో ఎయిర్.