indira sagar
-
రైతు నోట మన్ను కొట్టారు
ఇందిరా సాగర్‌పై నోరెత్తని ప్రజాప్రతినిధులు రాష్ట్ర విభజన నుంచి నిలిచిపోయిన పనులు తుప్పుపడుతున్న విలువైన యంత్రాలు ప్రాజెక్టు ఊసెత్తని ఏపీ ప్రభుత్వం జిల్లాలో 46 వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్ధకం ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పెట్టిన నిధులు నిరుపయోగం లక్ష్యం: 2.50 లక్షల ఎకరాలు మన జిల్లాలో: 46 వేల ఎకరాలు నిధుల మంజూరు వైఎస్ హయాంలో : రూ. 1824 కోట్లు ఖర్చు పెట్టింది: రూ. 900 కోట్లు 2014 నుంచి నిధులు: 0 చేసిన ఖర్చు: 0 చింతలపూడి: ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలలో 2.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకం అంతర్ రాష్ట్ర జలవివాదానికి కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్ర విభజన తరువాత ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రాంతం ఆంధ్రాలోను, ప్రధాన కాల్వలు తెలంగాణలోను చేరడంతో పథకాన్ని పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందిరా సాగర్‌ను రీ డిజైనింగ్ చేసి తెలంగాణ అవసరాలకు వినియోగించుకునేలా మార్పులు చేయాలని ఆదేశించడంతో అక్కడి ఇరిగేషన్ అధికారులు ఆపనిలో మునిగి పోయారు. దీంతో మన రాష్ట్రానికి చెందిన పశ్చిమ, కృష్ణా జిల్లాల రైతుల పరిస్ధితి ఆగమ్య గోచరంగా మారింది. 2005లో చింతలపూడి విచ్చేసిన అప్పటి ముఖ్యమంతి డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దృష్టికి ఆనాటి ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ సాగునీటి సమస్యను తీసుకువెళ్లగా ఆయన ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను మళ్లించి తద్వారా చింతలపూడి నియోజకవర్గానికి సాగు నీరు అందించడానికి అంగీకరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి రు 1,824 కోట్ల నిధులు మంజూరు చేశారు. అదే ఏడాది డిసెంబర్ నెలలో ఎత్తిపోతలకు శంఖు స్థాపన చేశారు. అనంతరం వేలేరుపాడు మండలం రుద్రమకోటలో గోదావరి, శబరి నదులు కలిసే ప్రాంతంలో నిర్మాణ పనులు చేపట్టారు. ప్రాజెక్టు పనులకు విభజనకు ముందు వరకు సుమారు రూ.900 కోట్లు ఖర్చు పెట్టారు. రాష్ట్ర్ర విభజన తరువాత అసలు సమస్య ప్రారంభమయ్యింది. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన ప్రాంతం ఆంధ్రాలో విలీనం చేయడంతో ప్రాజెక్టు నిర్మాణానికి ఏ ప్రభుత్వం నిధులు విడుదల చేయాలన్న దానిపై సందిగ్ధత ఏర్పడింది. ప్రాజెక్టు రూపకల్పన: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా రైతులకు సాగు నీరు అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేశారు. ఖమ్మం జిల్లాలోని 9 మండలాల్లో సుమారు 1.80 లక్షల ఎకరాలకు, కృష్ణా జిల్లాలోని 2 మండలాలలో 24.500 ఎకరాలకు, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో 46 వేల ఎకరాలకు సాగునీరు అందు అందుతుంది. ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో మెగా కిర్లోస్కర్, ఏఎంఆర్ ఇంటర్నేషనల్ సంస్ధలకు అప్పగించారు. 2012 లోనే పూర్తి కావాల్సిన ఎత్తిపోతల పనులు 50 శాతం కూడా పూర్తి కాకుండానే నిలిచిపోయాయి. మొత్తం 47 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా, పనులు నిలిచిపోయే నాటికి 38 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి. ఎత్తిపోతలకు సంబంధించి మూడు చోట్ల పంప్ హౌస్‌లు నిర్మించడానికి భారీ కందకాలు తవ్వారు. వేలేరుపాడు మండలం అల్లూరినగర్, అశ్వారావుపేట మండలం ఆసుపాక, బండారుగూడెం ప్రాంతాల్లో పంప్‌హౌస్ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఇంత వరకు పంప్‌హౌస్ పనులు 20 శాతం కూడా పూర్తవ్వలేదు. ఈ పంప్ హౌస్‌ల కోసం జర్మనీ నుండి దిగుమతి చేసుకున్న భారీ మోటార్లు గత 10 ఏళ్లుగా నిరుపయోగంగా పడి ఉన్నాయి. కోట్లాది రూపాయల వ్యయంతో 6.8 వేల హెచ్‌పీ సామర్ధ్యం కలిగిన 18 మోటార్లు అవ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామం వద్ద నిరుపయోగంగా వదిలి వేశారు. నోరు మెదపని ఆంధ్రా ప్రజా ప్రతినిధులు విభజన సమయంలో ఆంధ్రాలోని నీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల గురించి అప్పటి ప్రజా ప్రతినిధులు కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లక పోవడంతో ప్రాజెకుల్ట పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేక సార్లు ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాల రైతుల మధ్య సాగు నీటి వివాదాలు తలెత్తి ఘర్షణలు చోటుచేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఆంధ్రా కాలువ ద్వాదా తమ్మిలేరుకు వచ్చే వరద నీరు రాకుండా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు ఎత్తును పెంచి అక్కడి ప్రజా ప్రతినిధులు అడ్డుకుంటున్నారు. గతంలో ప్రభుత్వం ఈ వివాదంపై ముగ్గురు రాష్ట్ర స్థాయి రిటైర్డ్ ఇంజినీర్లను నియమించినా ఫలితం లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో శాశ్వతంగా గోదావరి జలాలను రాకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటుందనడంలో సందేహం లేదు. ఈ పరిస్ధితుల్లో ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, ఇరిగేషన్ అధికారులు చర్చించుకుని ప్రాజెక్టు పనులు పూర్తి చేసినట్లుయితే తెలుగు రాష్ట్రాల రైతులకు మేలు జరుగుతుంది. చింతలపూడి ఎత్తిపోతల ద్వారా నీరు : రాష్ట్ర విభజన వల్ల ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకం ముందుకు సాగే అవకాశం లేదు, చింతలపూడి ఎత్తిపోతల పథకంలోనే తమ్మిలేరుకు గోదావరి జలాలను అందించే ప్రతిపాదన ఉంది. రైతులు అధైర్య పడాల్సిన పని లేదు. ఎం. అప్పారావు తమ్మిలేరు ఇరిగేషన్ డిఈ -
ఎత్తిపోతలు.. వట్టి మాటలు
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాపై ప్రత్యేక అభిమానం చూపిస్తానంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ.. ఆయన అభిమానం చూపించాలనుకుంటున్నది ప్రజలపై కాదు. తన అనుయాయులపై మాత్రమే. విషయంలోకి వెళితే... జిల్లాలో రైతులు సాగునీటి ఇబ్బందుల వల్ల ఏటా పంటలు నష్టపోతున్నారు. ఇందిరాసాగర్ (పోల వరం) ప్రాజెక్టు పూర్తయితే తప్ప వారి కష్టాలు తీరేలా లేవు. ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి ప్రభుత్వం నాలుగేళ్ల సమయం పడుతుందని చెబుతోంది. ఈలోగా పంటలకు సాగునీరు అందించేందుకు గోదావరిపై రెండు భారీ ఎత్తిపోతల పథకాలను నిర్మిం చాలని భావిస్తోంది. వాటిలో ఒక పథకం ద్వారా మన జిల్లాకు సాగునీరు అందిస్తారట. చాలా ప్రాజెక్టులు ఉన్నా... నిజానికి మన జిల్లాలో ప్రస్తుతం చాలా సాగునీటి ప్రాజెక్టులు ఉన్నా యి. వాటిలో కొన్ని ప్రతిపాదనల దశలోను, మరికొన్ని నిర్మాణ దశలోను ఉన్నాయి. వాటిని పూర్తి చేయడానికి కనీస స్థారుులో అరుునా ప్రభుత్వం నిధులు విదల్చడం లేదు. ఈ ప్రాజెక్టులు వినియోగంలోకి వస్తే జిల్లాలో సుమారు రెండున్నరల లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆ దిశగా చర్యలు చేపట్టని ప్రభుత్వం కొత్తగా భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాలనుకోవడం వెనుక కాంట్రాక్టర్ల ప్రయోజనాలు ఉన్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం భారీగా నిధులు సమకూర్చిన వారి రుణం తీర్చుకునేందుకే ఈ ప్రాజెక్టును తెరపైకి తెస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ప్రాజెక్టు కథ ఇదీ పోలవరం డ్యామ్‌కు దిగువన ధవళేశ్వరం ఆనకట్ట నుంచి 10 టీఎంసీల నీటిని పొలాలకు మళ్లించేందుకు ఎత్తిపోతల పథకం నిర్మించాలని ప్రతిపాదించారు. దీనిని పూర్తి చేయడానికి రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీని నిర్వహణకే ఏటా రూ.57 కోట్లు అవుతుందంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన కుడి కాలువ ద్వారా జిల్లాలో 2.58 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తేవాలనుకుంటున్నారు. పోలవరం పూర్తయితే తాడిపూడి ఎత్తిపోతల పథకం అందులో భాగమవుతుంది. దాని ద్వారా జిల్లాలో 2లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితే మిగిలిన 58వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. ఏళ్ల తరబడి వీటికి మోక్షం లభించడం లేదు. అయినా కొత్త ప్రాజెక్టు ప్రతిపాదించడం వెనుక కొందరి స్వప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లన్నీ పెండింగ్‌లోనే కొవ్వూరు, దేవరపల్లి, తాళ్లపూడి మండలాల పరిధిలోని 7 గ్రామాల్లో 5 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందిం చేందుకు 2006లో గోదావరి నదిపై రూ.15 కోట్లు వెచ్చించి నిర్మించిన ఆరికిరేవుల ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా ఉంది. 10శాతం పనులు నిలిచిపోవడంతో ఆయకట్టు రైతులకు చుక్కనీరు అందడం లేదు. దేవరపల్లి మండలం శివారు బందపురం వద్ద తాడిపూడి కాలువపై నిర్మాణంలో ఉన్న 5వ సబ్‌లిఫ్ట్ పనులు నిలిచిపోయాయి. దీనికోసం 2008లో సుమారు రూ.48 కోట్లను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారు. పంపుహౌస్ నిర్మాణం జరిగింది. కాలువ పనులు ప్రారంభం కాలేదు. ఇది పూర్తయితే సుమారు 12 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. జంగారెడ్డిగూడెం మండలంలోని తిరుమలాపురం వద్ద బైనేరు వాగుపై 2008లో రూ.3 కోట్లతో చేపట్టిన అక్విడెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయలేదు. ఇది పూర్తయితే మూడు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. నల్లజర్ల మండలంలో ఎర్రకాలువ నుంచి కుడికాలువ పనులు అసంపూర్తిగా మిగిలారుు. 1986లో కాలువ పనులకు నిధులు మంజూరయ్యా యి. ఇప్పటివరకు పూర్తికాలేదు. దీని వల్ల దిగువ ప్రాంతంలోని భూములకు నీరు అందటంలేదు. ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లి వద్ద గిరమ్మ ఎత్తిపోతల పథకం పూర్తిచేయూల్సి ఉంది. 2003లో దీనికి నిధులు మంజూరైనా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దీనిని పూర్తిచేస్తే 7 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఉండి కాలువపై అక్విడెక్ట్ నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో శంకుస్థాపన చేశారు. నిధులు కూడా కేటాయిం చారు. ఆయన మరణానంతరం పనులు పడకేశాయి ఈ అక్విడెక్ట్ శిథి లం కావడంతో సుమారు 65వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. పెనుగొండ మండలం దొంగరావి పాలెం వద్ద రూ.24కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులు శంకుస్థాపనకే పరిమితమయ్యూరుు. ఇక్కడ గోదావరి నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా బ్యాంకు కెనాల్ ద్వారా పొలాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. పథకం ప్రారంభమైతే పెనుగొండ, ఆచంట, పోడూరు, యల మంచిలి మండలాల్లో సుమారు 31,346 ఎకరాలకు దాళ్వాలో సాగు నీటిఎద్దడి తీరుతుంది. వీటి నిర్మాణాలను గాలికొదిలేసిన ప్రభుత్వం కొత్త పథకమంటూ ఆర్భాటం చేస్తోంది. -
తగ్గలేదు... పెరగలేదు
(సాక్షి ప్రతినిధి, ఖమ్మం): అవే అంకెలు.... అదే లెక్క...సంవత్సరం మారింది కానీ.... నిధులు మాత్రం మారలేదు. ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ‘ఓట్ ఆన్ అకౌంట్’ బడ్జెట్లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు జరిపిన కేటాయింపు ఇదీ. గత ఏడాది (2013-14) బడ్జెట్లో కేటాయించిన విధంగానే ఒక్క అంకె కూడా మార్పు లేకుండా అవే నిధులను ఈసారి (2014-15) బడ్జెట్లోనూ చూపెట్టారు. ఆరునెలలకే కదా... మళ్లీ సవరించాల్సిందే అనే ఉద్దేశంతో ఏ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం అదనపు కేటాయింపు చూపలేదు. జిల్లా ప్రజలకు ప్రధాన అవసరాలైన ఇందిరా సాగర్, రాజీవ్‌సాగర్, దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌తో పాటు సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు గత ఏడాది తరహాలోనే నిధుల కేటాయింపు చూపారు. ఇక చిన్న పథకాలైన మున్నేరు, పాలెంవాగు, మొడికుంట వాగు, గుండ్ల వాగులకు కూడా అత్తెసరుగానే విదిల్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లాలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు గాను రూ.25వేల కోట్లకు పైగానే అవసరం కాగా, కేవలం 254 కోట్లను మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. అంటే అవసరమైన నిధుల్లో ఒక్కశాతం మాత్రమే అంచనాల్లో చూపించారు. ఈ విధంగా అవసరమైన దాంట్లో ఒక్కశాతం బడ్జెట్లో పెట్టుకుంటూ పోతే మరో 100 సంవత్సరాలకు కూడా జిల్లా రైతాంగానికి అవసరమైన ఈ ప్రాజెక్టులు పూర్తికావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండేళ్ల కిందే పూర్తికావాల్సిన ‘ఇందిరాసాగర్’ వేలేరుపాడు మండలంలోని రుద్రంకోట వద్ద నిర్మిస్తున్న ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకం రెండేళ్ల క్రితమే పూర్తికావాల్సింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూపొందించిన జలయజ్ఞం షెడ్యూల్ ప్రకారం ఇది 2011-12 సంవత్సరంలోనే పూర్తి కావాల్సింది. దీని అంచనా వ్యయం రూ.1,824 కోట్లు కాగా వైఎస్ హయాంలో భారీగానే నిధులు మంజూరు చేశారు. ఇప్పటివరకు మొత్తం రూ.1,187 కోట్లు ఈ ప్రాజెక్టు కింద కేటాయింపబడ్డాయి. అంటే మరో రూ.700 కోట్లవరకు ఈ ప్రాజెక్టుకు కావాలన్నమాట. ఆ నిధులన్నీ ఇస్తేనే ప్రాజెక్టు లక్ష్యం కింద నిర్దేశించబడిన 1818 క్యూసెక్కుల గోదావరి జలాలు ఖమ్మంతోపాటు వరంగల్, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 2లక్షల ఎకరాలకు చేరుతాయి. కానీ ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు కూడా కేటాయించింది రూ.92 కోట్లే. పోయిన ఏడాదే పూర్తి కావాల్సిన ‘రాజీవ్ సాగర్’ ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లా ప్రజానీకానికి కూడా ఉపయోగపడే రాజీవ్‌సాగర్ ప్రాజెక్టు 2012-13 ఆర్థిక సంవత్సరం నాటికే పూర్తి కావాల్సి ఉంది. రెండు జిల్లాల్లోని 17 మండలాల్లో గల రెండు లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరందించే విధంగా డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,681 కోట్లు కాగా, ఇప్పటివరకు కేటాయించింది 650కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఇంకా మరో రూ.1000 కోట్లు కావాల్సి ఉండగా, ఇప్పుడు విదిల్చింది రూ.82 కోట్లే. సాగర్ ఆధునికీకరణా మారలేదు ఇక, జిల్లా ప్రజలకు మరో జీవనాధారమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు పనులకు కూడా అవే నిధులు చూపెట్టారు. గత ఏడాది ఇందుకోసం రూ.678 కోట్లు కేటాయించగా, ఇప్పుడు కూడా అవే నిధులు చూపించారు. అయితే, గత ఏడాది (2013-14 సంవత్సరంలో) సాగర్ ఆధునికీకరణ కింద కేటాయించిన నిధుల్లో రూ.174 కోట్లు మాత్రమే టేకులపల్లి సర్కిల్‌కు ఖర్చుపెట్టారు. వాగులకు విదిలించారు భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల పరిస్థితి అలా ఉంటే.... ఏజెన్సీ ప్రజానీకానికి ప్రయోజనం చేకూర్చే చిన్నతరహా ప్రాజెక్టులకు కూడా చాలా తక్కువ నిధులు బడ్జెట్లో చూపెట్టారు. వాజేడు మండలం కృష్ణాపురం గ్రామం వద్ద నిర్మించ తలపెట్టిన మోడికుంట వాగు ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.124 కోట్లు కాగా, గత ఏడాది వరకు కేవలం రూ.60 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈసారి ఆ ప్రాజెక్టు కింద చూపెట్టింది కేవలం రూ.4.5కోట్లు మాత్రమే. మొదట కేవలం రూ.3కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమయి రూ.27 కోట్ల వ్యయానికి చేరుకున్న గుండ్లవాగు ప్రాజెక్టుకు కేటాయించింది కేవలం రూ.80లక్షలే. ప్రధాన కాల్వ, మరమ్మతులకు కూడా ఈ నిధులు సరిపోని పరిస్థితి. ఇక, వెంకటాపురం మండలంలోని పాలెంవాగు ప్రాజెక్టుకు ఈసారి రూ.25 కోట్లు కేటాయించారు.అయితే, దీని అంచనా వ్యయం రూ.70.99 కోట్ల నుంచి రూ.150కోట్లకు పెరిగింది. ఇంతవరకు గేట్ల నిర్మాణం, కాల్వ పనులే పూర్తికాలేదు. మరి ఈ 4.5కోట్లతో ఏం చేస్తారో పాలకులకే తెలియాలి. కిన్నెరసానికి రూ.4కోట్లు, వైరా రిజర్వాయర్‌కు రూ.40లక్షలు కూడా కేటాయించారు. టెయిల్పాండ్పైనా అదే ‘చూపు’ ఇక, ఐదు జిల్లాల్లోని 14.12 లక్షల ఎకరాలకు నీరందించాలన్న లక్ష్యంతో తలపెట్టిన దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌కు ఈసారి బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.97 కోట్లే. గత ఏడాది కూడా ఇంతే అయినా, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగానే ఉంది. మొత్తం 19వేల కోట్లకు పైగా అంచనా వ్యయం ఉంటే ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకిచ్చింది కేవలం రూ.650 కోట్లే. అయితే, ఈ ప్రాజెక్టుపై జిల్లా ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నా ఐదారు జిల్లాలకు ఉపయోగపడే ప్రాజెక్టులకు కూడా ప్రాధాన్యత లేకుండా మొక్కుబడి కేటాయింపులు జరపడమేమిటని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. గిరిజనంపై ఎక్కువ మక్కువేది? జిల్లాలో దాదాపు 29 మండలాలు ఏజెన్సీలో ఉండగా, అక్కడ నివసించే లక్షలాది మంది గిరిజనుల అభివృద్ధి కోసం సర్కారు పాత లెక్కలే చూపెట్టింది. గత ఏడాది బడ్జెట్లో ఏ పథకానికి ఎంత చూపెట్టారో ఓట్ ఆన్అకౌంట్లోనూ అవే నిధులు చూపెట్టాల్సి వచ్చింది. ఇక, మారుమూల ప్రాంతాల సమీకృత అభివృద్ధి (రెయిడ్) కింద గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల నిర్మాణానికి, ఇతర ఐటీడీఏ అవసరాలకు కూడా 2013-14 బడ్జెట్లో కేటాయించిన నిధులనే ఈసారి కూడా పొల్లు పోకుండా బడ్జెట్లో చూపెట్టారు. అయితే, ఓట్‌ఆన్ అకౌంట్ కాబట్టి అంచనాలను పెంచి చూపించే అధికారం ఈ ప్రభుత్వానికి ఉండదని, కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వమే వాస్తవిక బడ్జెట్ పెడుతుందని ఆర్థిక నిపుణులంటున్నారు. ఇతర పథకాలూ లేవు ఇక జిల్లాకు చెందిన బడ్జెట్ లెక్కలను పరిశీలిస్తే సాగునీటి శాఖ మినహా ఎక్కడా ఖమ్మం పేరు కనిపించలేదు. ఒక్క అటవీశాఖలో మాత్రం ఇల్లెందు అటవీ పాఠశాలకు పది లక్షల రూపాయలు చూపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా క్రోడీకరించిన బడ్జెట్ లెక్కలను చూస్తే... అన్ని జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేక కాంప్లెక్స్‌ల నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఇంటెలిజెన్స్, రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు పురాతన భవనాల్లోని మండలపరిషత్, తహశీల్దార్ కార్యాలయాలకు నూతన భవనాల కోసం నిధులిచ్చారు. తహశీల్దార్ కార్యాలయాల కంప్యూటరీకరణకు నిధులు కేటాయించిన ప్రభుత్వం... ప్రభుత్వ భూముల పరిరక్షణకు మాత్రం ఎలాంటి కేటాయింపులు చూపెట్టకపోవడం గమనార్హం.