ఎత్తిపోతలు.. వట్టి మాటలు
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాపై ప్రత్యేక అభిమానం చూపిస్తానంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ.. ఆయన అభిమానం చూపించాలనుకుంటున్నది ప్రజలపై కాదు. తన అనుయాయులపై మాత్రమే. విషయంలోకి వెళితే... జిల్లాలో రైతులు సాగునీటి ఇబ్బందుల వల్ల ఏటా పంటలు నష్టపోతున్నారు. ఇందిరాసాగర్ (పోల వరం) ప్రాజెక్టు పూర్తయితే తప్ప వారి కష్టాలు తీరేలా లేవు. ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి ప్రభుత్వం నాలుగేళ్ల సమయం పడుతుందని చెబుతోంది. ఈలోగా పంటలకు సాగునీరు అందించేందుకు గోదావరిపై రెండు భారీ ఎత్తిపోతల పథకాలను నిర్మిం చాలని భావిస్తోంది. వాటిలో ఒక పథకం ద్వారా మన జిల్లాకు సాగునీరు అందిస్తారట.
చాలా ప్రాజెక్టులు ఉన్నా...
నిజానికి మన జిల్లాలో ప్రస్తుతం చాలా సాగునీటి ప్రాజెక్టులు ఉన్నా యి. వాటిలో కొన్ని ప్రతిపాదనల దశలోను, మరికొన్ని నిర్మాణ దశలోను ఉన్నాయి. వాటిని పూర్తి చేయడానికి కనీస స్థారుులో అరుునా ప్రభుత్వం నిధులు విదల్చడం లేదు. ఈ ప్రాజెక్టులు వినియోగంలోకి వస్తే జిల్లాలో సుమారు రెండున్నరల లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆ దిశగా చర్యలు చేపట్టని ప్రభుత్వం కొత్తగా భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాలనుకోవడం వెనుక కాంట్రాక్టర్ల ప్రయోజనాలు ఉన్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం భారీగా నిధులు సమకూర్చిన వారి రుణం తీర్చుకునేందుకే ఈ ప్రాజెక్టును తెరపైకి తెస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొత్త ప్రాజెక్టు కథ ఇదీ
పోలవరం డ్యామ్‌కు దిగువన ధవళేశ్వరం ఆనకట్ట నుంచి 10 టీఎంసీల నీటిని పొలాలకు మళ్లించేందుకు ఎత్తిపోతల పథకం నిర్మించాలని ప్రతిపాదించారు. దీనిని పూర్తి చేయడానికి రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీని నిర్వహణకే ఏటా రూ.57 కోట్లు అవుతుందంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన కుడి కాలువ ద్వారా జిల్లాలో 2.58 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తేవాలనుకుంటున్నారు. పోలవరం పూర్తయితే తాడిపూడి ఎత్తిపోతల పథకం అందులో భాగమవుతుంది. దాని ద్వారా జిల్లాలో 2లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితే మిగిలిన 58వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. ఏళ్ల తరబడి వీటికి మోక్షం లభించడం లేదు. అయినా కొత్త ప్రాజెక్టు ప్రతిపాదించడం వెనుక కొందరి స్వప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌లన్నీ పెండింగ్‌లోనే
కొవ్వూరు, దేవరపల్లి, తాళ్లపూడి మండలాల పరిధిలోని 7 గ్రామాల్లో 5 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందిం చేందుకు 2006లో గోదావరి నదిపై రూ.15 కోట్లు వెచ్చించి నిర్మించిన ఆరికిరేవుల ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా ఉంది. 10శాతం పనులు నిలిచిపోవడంతో ఆయకట్టు రైతులకు చుక్కనీరు అందడం లేదు. దేవరపల్లి మండలం శివారు బందపురం వద్ద తాడిపూడి కాలువపై నిర్మాణంలో ఉన్న 5వ సబ్‌లిఫ్ట్ పనులు నిలిచిపోయాయి. దీనికోసం 2008లో సుమారు రూ.48 కోట్లను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారు. పంపుహౌస్ నిర్మాణం జరిగింది. కాలువ పనులు ప్రారంభం కాలేదు. ఇది పూర్తయితే సుమారు 12 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
జంగారెడ్డిగూడెం మండలంలోని తిరుమలాపురం వద్ద బైనేరు వాగుపై 2008లో రూ.3 కోట్లతో చేపట్టిన అక్విడెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయలేదు. ఇది పూర్తయితే మూడు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
నల్లజర్ల మండలంలో ఎర్రకాలువ నుంచి కుడికాలువ పనులు అసంపూర్తిగా మిగిలారుు. 1986లో కాలువ పనులకు నిధులు మంజూరయ్యా యి. ఇప్పటివరకు పూర్తికాలేదు. దీని వల్ల దిగువ ప్రాంతంలోని భూములకు నీరు అందటంలేదు. ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లి వద్ద గిరమ్మ ఎత్తిపోతల పథకం పూర్తిచేయూల్సి ఉంది. 2003లో దీనికి నిధులు మంజూరైనా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దీనిని పూర్తిచేస్తే 7 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
ఉండి కాలువపై అక్విడెక్ట్ నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో శంకుస్థాపన చేశారు. నిధులు కూడా కేటాయిం చారు. ఆయన మరణానంతరం పనులు పడకేశాయి ఈ అక్విడెక్ట్ శిథి లం కావడంతో సుమారు 65వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. పెనుగొండ మండలం దొంగరావి పాలెం వద్ద రూ.24కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులు శంకుస్థాపనకే పరిమితమయ్యూరుు. ఇక్కడ గోదావరి నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా బ్యాంకు కెనాల్ ద్వారా పొలాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. పథకం ప్రారంభమైతే పెనుగొండ, ఆచంట, పోడూరు, యల మంచిలి మండలాల్లో సుమారు 31,346 ఎకరాలకు దాళ్వాలో సాగు నీటిఎద్దడి తీరుతుంది. వీటి నిర్మాణాలను గాలికొదిలేసిన ప్రభుత్వం కొత్త పథకమంటూ ఆర్భాటం చేస్తోంది.