indore sports stadium
-
ఈ చిత్ర ప్రదర్శన.. భళా!
మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఉమ్మడి జిల్లాకే తలమానికంగా నిలుస్తోంది. హైదరాబాద్‌లోని ఇండోర్ స్టేడియాలకు ధీటుగా పాలమూరులో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని తీర్చిదిద్దారు. ఈ స్టేడియంలో ఆరు షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటుచేశారు.ఆకట్టుకుంటున్న చిత్రాలు..మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం బయట గోడలపై వేసిన క్రీడాకారుల చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఔత్సాహిక క్రీడాకారులకు అవగాహన కలిగేలా ఆయా క్రీడల్లో రాణిస్తున్న ప్రముఖ క్రీడాకారుల చిత్రాలు ఇండోర్ స్టేడియానికి కొత్త శోభను తెచ్చిపెట్టాయి. జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ ఆర్టిస్ట్ మధు క్రీడాకారుల చిత్రాలు గీశారు. స్టేడియం ప్రధాన ద్వారం గోడపై ఓవైపు ప్రముఖ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ, మరోవైపు బాక్సర్ నిఖత్ జరీన్, మధ్యలో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, స్టేడియానికి మరోవైపు క్రికెటర్లు విరాట్ కొహ్లి, సిరాజ్, షటిల్ క్రీడాకారిణి గుత్తాజ్వాల, మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, జావెలిన్‌త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా, కబడ్డీ క్రీడాకారుడు రాహుల్ చౌదరితో పాటు ఇతర క్రీడాకారుల చిత్రాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి.అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది..మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో క్రీడాకారుల చిత్రాలు గీయడానికి అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. గతంలో జిల్లా కేంద్రంలోని స్టేడియం ప్రహరీపై 36 గంటల్లోనే 300 లకుపైగా క్రీడలకు సంబంధించిన చిత్రాలను గీశాను. అదే విధంగా వాలీబాల్ అకాడమీలో క్రీడల బొమ్మలను వేశాను. – మధు, ఆర్టిస్ట్, మహబూబ్నగర్ఇవి చదవండి: బోరు చుట్టూ.. ఇంకుడుగుంత నిర్మించడం ఎలా? -
దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. కోహ్లికి రెస్ట్! శ్రేయస్‌కు ఛాన్స్
గుహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో విజయం సాధించిన టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. తద్వారా స్వదేశంలో తొలి సారిగా దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో టీ20లో మంగళవారం ఇండోర్ వేదికగా ప్రోటీస్ జట్టుతో భారత్ తలపడనుంది. టీ20 ప్రపంచకప్-2022కు ముందు టీమిండియా ఆడబోయే అఖరి టీ20 మ్యాచ్ ఇదే. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ తమ తుది జట్టులో పలు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ అఖరి మ్యాచ్‌కు విరాట్ కోహ్లితో పాటు సూర్యకుమార్ యాదవ్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విరాట్ స్థానంలో శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ స్థానంలో షబాజ్ ఆహ్మద్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా విరాట్ గహుతి నుంచి నేరుగా ముంబై వెళ్లినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. "మూడో టీ20కు కోహ్లికి విశ్రాంతి ఇచ్చాం. అతడు సోమవారం ముంబైకు చేరుకోనున్నాడు అని" అతడు న్యూస్ 18తో పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో పాల్గొనోందుకు భారత జట్టు ఆక్టోబర్6న ఆస్ట్రేలియాకు పయనం కానుంది. ఈ క్రమంలో విరాట్ తిరిగి గరువారం ముంబైలో మళ్లీ జట్టుతో కలవనున్నాడు. ఇక ఈమెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఆక్టోబర్ 23న తలపడనుంది. చదవండి: Rohit Sharma: 'బౌలింగ్ లోపాలు సరిదిద్దుకుంటాం.. సూర్య నేరుగా అక్టోబర్ 23నే' -
కుమ్మరిపాలెంలో ఉద్రిక్తత
బందరు: కృష్ణాజిల్లా బందరు మండలం కుమ్మరిపాలెంలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణ నిమిత్తం భూసేకరణకు వచ్చిన ప్రభుత్వాధికారులను స్థానికులు అడ్డుకున్నారు. అక్రమంగా నిర్మించిన పేదల ఇళ్లను కూల్చివేయడానికి ప్రభుత్వ అధికారులు ప్రయత్నించడంతో స్థానికులు ప్రతిఘటించారు. దీనికి స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, వామపక్ష నేతలు కూడా మద్ధతు పలికారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్తలను , స్థానికులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ నేత పేర్ని నానిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.