గుహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో విజయం సాధించిన టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. తద్వారా స్వదేశంలో తొలి సారిగా దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో టీ20లో మంగళవారం ఇండోర్ వేదికగా ప్రోటీస్ జట్టుతో భారత్ తలపడనుంది.
టీ20 ప్రపంచకప్-2022కు ముందు టీమిండియా ఆడబోయే అఖరి టీ20 మ్యాచ్ ఇదే. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ తమ తుది జట్టులో పలు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ అఖరి మ్యాచ్‌కు విరాట్ కోహ్లితో పాటు సూర్యకుమార్ యాదవ్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విరాట్ స్థానంలో శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ స్థానంలో షబాజ్ ఆహ్మద్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
కాగా విరాట్ గహుతి నుంచి నేరుగా ముంబై వెళ్లినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. "మూడో టీ20కు కోహ్లికి విశ్రాంతి ఇచ్చాం. అతడు సోమవారం ముంబైకు చేరుకోనున్నాడు అని" అతడు న్యూస్ 18తో పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో పాల్గొనోందుకు భారత జట్టు ఆక్టోబర్6న ఆస్ట్రేలియాకు పయనం కానుంది. ఈ క్రమంలో విరాట్ తిరిగి గరువారం ముంబైలో మళ్లీ జట్టుతో కలవనున్నాడు. ఇక ఈమెగా ఈవెంట్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఆక్టోబర్ 23న తలపడనుంది.
చదవండి: Rohit Sharma: 'బౌలింగ్ లోపాలు సరిదిద్దుకుంటాం.. సూర్య నేరుగా అక్టోబర్ 23నే'
Comments
Please login to add a commentAdd a comment