Industrial Pollution
-
బాబోయ్.. మేం భరించలేం..ఊపిరాడట్లే!
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 51 కాలనీల్లో రాత్రివేళల్లో శివారు పరిశ్రమలు వెదజల్లుతున్న విష వాయువులతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రిపూట ఊపిరి తీసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఆయా పరిశ్రమల ఆగడాలపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తక్షణం సదరు పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులను వేడుకుంటున్నారు. ప్రధానంగా బాచుపల్లి, నిజాంపేట్, మియాపూర్, హఫీజ్‌పేట్, కొండాపూర్, మదీనాగూడ, లింగంపల్లి, గచ్చిబౌలి, బీహెచ్ఈఎల్, అమీన్పూర్ ప్రాంతాలవాసుల అవస్థలు అన్నీఇన్నీ కావు. కొంత కాలంగా కేవలం రాత్రి వేళల్లోనే ఇలాంటి విషవాయువుల వాసనతో తలనొప్పి, వాంతులు, శ్వాసకోశ సమస్యలతో అవస్థలు పడుతున్నట్లు పీసీబీ దృష్టికి తీసుకురావడం గమనార్హం. చదవండి: Huzurabad Bypoll: ఈ ఎన్నిక చాలా ఖరీదు గురూ! పారిశ్రామిక వాడలకు సమీప ప్రాంతాల్లోనే.. గ్రేటర్‌తో పాటు శివార్లలోని పలు ప్రాంతాలు వాయు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ప్రధానంగా కాటేదాన్, జీడిమెట్ల, పటాన్చెరు, కుత్బుల్లాపూర్, మల్లాపూర్, బాలానగర్, భోలక్‌పూర్ తదితర ప్రాంతాల్లో బల్క్‌డ్రగ్, ఫార్మా, ప్లాస్టిక్, ఆయిల్, లెడ్, బ్యాటరీ, ట్యానింగ్, బ్లీచింగ్ అండ్ డైయింగ్, పొగాకు, పెయింట్స్, మీట్ ప్రాసెసింగ్, పెస్టిసైడ్స్, క్రాఫ్ట్ పేపర్ తదితర పరిశ్రమలున్నాయి. ఆయా పారిశ్రామిక వాడల నుంచి రాత్రివేళల్లో విష వాయువులను వెదజల్లుతుండడంతో ఈ ప్రాంతాలకు దగ్గరున్న కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నగరానికి ఆనుకొని ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డుకు ఆవల 30 కి.మీ దూరం తరలించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఒక్క అడుగూ ముందుకు పడకపోవడంతో పీసీబీకి ఫిర్యాదులు తరచూ వెల్లువెత్తుతున్నాయి. చదవండి: డెలివరీ బాయ్ నిర్వాకం.. ప్రేమించడం లేదని ఇంట్లో ఎవరూ లేని టైంలో పరిశ్రమల ఆగడాలిలా.. ఆయా పరిశ్రమల్లో ఉత్పత్తులను తయారు చేసే క్రమంలో ప్రమాదకరమైన ఘన, ద్రవ, రసాయన వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఇందులో తక్కువ గాఢత కలిగిన జల వ్యర్థాలను మల్టిపుల్ ఎఫెక్టివ్ ఎవాపరేటర్లు (ఎంఈఈ), ఆర్ఓలతో శుద్ధి చేసి బయటకు వదలాలి. కానీ పలు పరిశ్రమల్లో ఇలాంటి ఏర్పాట్లు మృగ్యం. గాఢత అధికంగా ఉన్న వ్యర్థ జలాలను జీడిమెట్ల, పటాన్‌చెరులోని శుద్ధి కేంద్రాలకు తరలించాలని నిబంధనలు స్పష్టంచేస్తున్నా..పలు పరిశ్రమలకు ఈ ఊసే పట్టడంలేదు. ఆయా పరిశ్రమల్లో వెలువడే ఘన వ్యర్థాలను దుండిగల్‌లోని డంపింగ్ యార్డుకు తరలించాల్సిన విషయాన్ని పలు పరిశ్రమల యాజమాన్యాలు గాలికొదిలేశాయి. ఘన,ద్రవ వ్యర్థాలను శుద్ధికేంద్రాలకు తరలించేందుకు భారీగా వ్యయం చేయాల్సి రావడంతో అక్రమార్కులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. -
నదీజలాల్లో ఆక్సిజన్ అదృశ్యం
సాక్షి, అమరావతి: మన దేశ నదీ జలాల్లోని ఆక్సిజన్ లభ్యతలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయా? కాలుష్యం, పారిశ్రామిక వ్యర్థాలు, అధిక ఉష్ణోగ్రతల వల్ల నదుల్లోని ఆక్సిజన్ శాతం తగ్గి అందులోని జలచరాల ఉనికికి ముప్పు ఏర్పడుతుందా? కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తాజా నివేదికల ప్రకారం ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యం, మురుగునీటిని నదుల్లోకి యథేచ్ఛగా వదిలేయడం.. ఇష్టారాజ్యంగా గనులు తవ్వకం, గ్లోబల్ వారి్మంగ్ వల్ల అవి కాలుష్య కాసారాలుగా మారాయని.. దాంతో నదీజలాల్లో ఆక్సిజన్ లభ్యత తగ్గిపోతుందని వెల్లడైంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే దేశ ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని సీడబ్ల్యూసీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 13 నదుల్లో ఆక్సిజన్ లభ్యతపై పరీక్షలు దేశంలోని నదీ జలాల్లో రోజురోజుకు మత్స్యసంపద తగ్గిపోవడానికి గల కారణాలు అన్వేషించాలని జీవశాస్త్రవేత్తలు చేసిన సూచన మేరకు సీడబ్ల్యూసీ ఈ అధ్యయనం నిర్వహించింది. ఇందులో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. కాలుష్యం, భూతాపం వల్ల నదుల్లో ఆక్సిజన్ తగ్గిపోతుందని, తక్షణం కాలుష్యానికి అడ్డుకట్ట వేసి జీవావరణ (ఎకాలజీ) సమతుల్యతను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు కలిపి మొత్తం 13 నదుల్లోని 19 ప్రాంతాల్లో మూడు కాలాల్లో రోజూ మూడు గంటలకోసారి నీటిని సేకరించి డీఓ(నీటిలో కరిగిన ఆక్సిజన్) శాతాన్ని సీడబ్ల్యూసీ లెక్కగట్టింది. డీఓ తగ్గినా.. పెరిగినా ముప్పే డీఓ పరిమాణం 1 నుంచి 2 మిల్లీగ్రాముల మధ్య ఉంటే చేపలు చనిపోతాయి. 7 మిల్లీగ్రాములు అంతకంటే ఎక్కువ డీఓ ఉంటే ఆ నదుల్లో చేపల పునరుత్పత్తి్త గణనీయంగా తగ్గిపోతుంది. నదీజలాల్లో డీఓ శాతం 1 మిల్లీగ్రాము కంటే తగ్గితే బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. నాచు(ఆల్గే), గుర్రపుడెక్క వంటి నీటి మొక్కలు ఎక్కువగా పెరిగి నది జీవావరణం దెబ్బతింటుంది. దీంతోచేపల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. సీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైన అంశాలు ►హిమాలయాల్లో జన్మించి ఉత్తరాది రాష్ట్రాల్ని సస్యశ్యామలం చేసే గంగ, యమునా, బ్రహ్మపుత్ర తదితర నదులు కాలుష్య కాసారాలుగా మారాయి. ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద యమునా జలాల్లో ఆక్సిజన్ లభ్యత దాదాపుగా లేదు. అన్ని కాలాల్లో ఏ రోజూ కూడా అక్కడ ఆక్సిజన్ ఉనికి కని్పంచలేదు. యమునలో ఒకటీ అరా చేపలు కూడా కానరాలేదు. ►గంగా నదిలో వారణాసి వద్ద లీటర్ నీటిలో కనిష్టంగా 6.12 మిల్లీ గ్రాములు.. గరిష్ఠంగా 9.14 మిల్లీగ్రాముల డీఓ ఉంది. గాం«దీఘాట్ వద్ద గంగలో లీటర్ నీటిలో కనిష్టంగా 5.24 మి.గ్రా., గరిష్టంగా 7.95 మి.గ్రా.ల డీఓ ఉంది. నమామి గంగలో భాగంగా నది ప్రక్షాళనతో కాలుష్య ప్రభావం క్రమేణా తగ్గుతుంది. ►తుంగభద్ర నదిలో మంత్రాలయం వద్ద లీటర్ నీటిలో కనిష్టం 5.20, గరిష్టం 9.60 మిల్లీగ్రాముల ఆక్సిజన్ లభిస్తోంది. మహారాష్ట్రలోని పుల్గావ్ వద్ద భీమా నదిలో కనిష్టంగా 6.20 మి.గ్రా., గరిష్టంగా 10.90 మి.గ్రాముల డీఓ ఉంది. ►హిమాలయ నదుల కంటే మధ్య, దక్షిణ భారతదేశంలోని నదుల్లో ఆక్సిజన్ లభ్యత మెరుగ్గా ఉంది. ద్వీపకల్ప నదుల్లోనూ ఆక్సిజన్ లభ్యతలో ఎప్పటికప్పుడు మార్పుల వల్ల మత్స్యసంపద వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ►కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం లీటర్ నీటిని శుద్ధి చేయక ముందు.. డీఓ ఆరు మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటేనే వాటిని తాగునీటి కోసం వినియోగించవచ్చు. ఐదు మిల్లీగ్రాముల కంటే డీఓ ఎక్కువ ఉంటే వాటిని స్నానానికి వాడొచ్చు. శుద్ధి చేసిన తర్వాత డీఓ శాతం నాలుగుగా ఉంటే ఆ నీటిని తాగొచ్చు. -
‘కాలుష్యం’పై సర్కార్ నిఘా!
సిద్దిపేట జోన్: శాబ్ధ కాలం క్రితం వంద పరిశ్రమలతో పారిశ్రామిక వైభవాన్ని సంతరించుకున్న సిద్దిపేట పరిశ్రమల ప్రతినిధులకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఇటీవల పట్టణానికి చెందిన శంకర్‌నగర్ కాలనీ వాసులు సమీప పరిశ్రమల కాలుష్యం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామనే ఫిర్యాదుపై డివిజన్ అధికారులు స్పందించారు. ఒక దశలో సిద్దిపేట మున్సిపల్ ప్రత్యేకాధికారి, ఆర్డీఓ ముత్యంరెడ్డి ఇటీవల మున్సిపల్ అధికారులకు సంబంధిత పరిశ్రమల సమగ్ర వివరాలపై, కాలుష్య స్థితి గతులపై పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఓ ఆదేశాలకు అనుగుణంగా సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఈ నెల 12న పట్టణంలోని 33 పరిశ్రమలకు అధికారికంగా నోటీసులు జారీ చేశారు. సుమారు పది అంశాలతో కూడిన సమగ్ర వివరాలపై మున్సిపల్ అధికారులు ఆయా పరిశ్రమల నుంచి నివేదికలు సేకరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు నిర్ణీత గడువు ముగియనున్న దశలో రెండు మూడు రోజుల్లో సంబంధిత కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులతో కలిసి అకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే... వ్యాపార, వాణిజ్య రంగంలో వెలుగువెలిగిన సిద్దిపేటలో ఒకప్పుడు వంద పరిశ్రమలు ఉండేవి. కాలక్రమేణా పారిశ్రామికికరంగా సంబంధించిన మార్పులు, విద్యుత్ కోతలు, ప్రభుత్వ విధానాలు, ప్రత్యామ్నాయ మార్గాల నేపథ్యంలో కొన్ని పరిశ్రమలు మూలపడగా ప్రస్తుతం స్వల్ప సంఖ్యలో రైసు మిల్లులు, ఆయిల్, కుంకుమ, దాల్ మిల్లులతో పాటు ఇతర పరిశ్రమలు ఉన్నాయి. గతంలో పట్టణ శివారులో నిర్మించిన ఫ్యాక్టరీలు గత కొంత కాలంగా పెరుగుతున్న పట్టణీకరణతో జనావాసాల్లో కలిసి పోయాయి. ఈ క్రమంలో ఇటీవల శంకర్‌నగర్‌కు చెందిన కాలనీ వాసులు సంబంధిత సమీప పరిశ్రమల ద్వారా వెదజల్లే కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిబంధనలను ఉల్లంఘించారంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు సిద్దిపేట ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో స్పందించిన ఆర్డీఓ ముత్యంరెడ్డి సంబంధిత ఫిర్యాదుపై తక్షణం స్పందించి సమగ్ర వివరాలతో కూడిన నివేదికను అందజేయాలని ఈ నెల 10న మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ ప్రత్యేకాధికారి ఆదేశాలతో స్పందించిన మున్సిపాల్టీ తక్షణ చర్యలో భాగంగా పట్టణ శివారులోని 33 పరిశ్రమలకు నోటీసులు జారీ చేశారు. సంబంధిత పరిశ్రమకు కాలుష్య నియంత్రణ మండలి అనుమతి, పరిశ్రమల శాఖ, అగ్ని మాపక శాఖ అనుమతులతో పాటు ఫ్యాక్టరీలో యంత్రాల సామర్థ్యం, పని చేస్తున్న కూలీల, కార్మికుల వివరాలు, ఫ్యాక్టరీ ఫొటో గ్రఫీతో కూడిన ప్లాన్ వివరాలు, మున్సిపల్‌కు వారు చెల్లిస్తున్న ఆస్తి పన్ను వివరాలు, విద్యుత్ బిల్లు వివరాలను తెలియజేసే ధ్రువీకరణ పత్రాలతో సమగ్ర వివరాలను అందజేయాలని ఈ నెల 12న ఎల్ఆర్ నం.ఎఫ్1/1316/2014 ప్రకారం నోటీసులు జారీ చేశారు. గతంలో లేని విధంగా మున్సిపల్ అధికారులు ఒక్క సారిగా పరిశ్రమకు సంబంధించిన నివేదికను అందజేయాలని ఆదేశించడంతో గత వారం రోజులుగా సిద్దిపేటలోని పరిశ్రమల ప్రతినిధులు మున్సిపల్ కార్యాలయం బాట పట్టారు.సంబంధిత వివరాలకు అనుగుణంగా మరో రెండు రోజుల్లో సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం పరిశ్రమల్లో కాలుష్యం స్థితి గతులను అకస్మికంగా తనిఖీ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
ముందే తాకిన సెగ
నిన్నటి వరకు చలితో గజగజ వణికిపోయిన నగరవాసులపై సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మధ్యాహ్నం వేళ బయటకి వెళ్లాలం టే భయపడే పరిస్థితి వచ్చేసింది. గతేడాది ఫిబ్రవరి మొదటి వారంలో రోజుకు సగటున 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే.. ఈసారి ఏకంగా 32-33 డిగ్రీల మేర నమోదవుతుండటంపై నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే మార్చి తర్వాత మరెలా ఉంటుందోనని భయపడుతున్నారు. గ్రేటర్లో రోజు రోజుకు పెరుగుతున్న వాహన, పారిశ్రామిక కాలుష్యం వల్ల వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంతో పోలిస్తే ఈ సారి రెండు వారాల ముందే గ్రేటర్‌కు ఎండసెగ తగిలింది. సాక్షి, సిటీబ్యూరో: తెల్లవారుజామున చలి.. తెల్లవారుతుండగానే సెగ.. ఇప్పుడు నగరంలో నెలకొన్న వాతావరణం ఇది. వేసవికి ముందే ఎండలు ముదురుతున్నాయి. మధ్యాహ్నం వేళ ఉక్కపోస్తోంది. క్రమంగా వాతావరణం వేడెక్కుతోంది. ఎండ తీవ్రతకు చిన్నారులు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు వడదెబ్బ బారిన పడటంతో పాటు టూవీలర్స్‌పై ప్రయాణించే మార్కెటింగ్ ఉద్యోగులు, యువ తీ యువకులు చర్మ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. తెల్లవారుజామున చలి, మధ్యాహ్నం ఎండ వల్ల చర్మం పొడిబారుతోంది. ఉక్కపోత వల్ల మెడ, కాళ్లు, చేతులపై పొక్కులు వస్తున్నాయి. బయటికి వెళ్తే నీళ్ల బాటిల్, గొడుగు విధిగా వెంట తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. చల్లని గాలి కోసం తేలికైన తెల్లని కాటన్ దుస్తులు ధరించాలి. టైట్ జీన్స్, బిగుతైన దుస్తులకు దూరంగా ఉంటే మేలు. చెమట పొక్కులు రాకుండా శరీరానికి చల్లదనాన్ని పంచే కూల్ పౌడర్లు వాడాలి. చన్నీటితో రోజుకు రెండుసార్లు (ఉదయం, సాయంత్రం) స్నానం చేయాలి. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకూడదు. పనులుంటే ఉదయమే పూర్తి చేసుకుని ఎండ ముదిరే సమయానికి ఇంటికి చేరుకోవాలి. బయటికి వెళ్లే ముందు చర్మానికి సన్‌లోషన్స్ తప్పనిసరి. మసాలా ఆహారానికి బదులు, సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. పానీయాలకు బదులు పండ్ల రసాలు, పండ్లు, కొబ్బరి బొండాలు తాగాలి. -
ఉత్తర ధ్రువంపై రగులుతున్న చిచ్చు
వనరులను దుర్వినియోగపరచే జీవన శైలిని వ్యసనంగా మార్చుకున్న సంపన్న దేశాలన్నీ ఇంధన నిక్షేపాల కోసం బరితెగిస్తున్నాయి. అతి సున్నితమైన ఆర్కిటిక్ ప్రాంతంలో చమురు తెట్టులు, పారిశ్రామిక కాలుష్యం మరింతగా భూతాపాన్ని పెంచుతాయని, ఓజోన్ పొరకు తీవ్ర హానిని కలిగిస్తాయని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనిషిలోని స్వీయ విధ్యంసక శక్తి ఉత్తర ధ్రువ ప్రాంతంలో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోం ది. మంచు ఖండంగా భ్రమింపజేసే ఆర్కిటిక్ సముద్రం అతి వేగంగా కరిగిపోతున్నా, పెను ఉపద్రవాలు ముంచుకొస్తున్నా పట్టింపు లేకుండా లాభాల వేటలో మునిగిపోవడం ‘మనిషి’కే చెల్లింది. ఐదు మహా సముద్రాల్లోకెల్లా అతి చిన్న సముద్రమైన ఆర్కిటిక్ విస్తీ ర్ణం 54.27 లక్షల చదరపు మైళ్లు. ఏటి పొడవునా గడ్డకట్టి పోయి ఉండే ఏకైక హిమ సము ద్రంలో 2020 నాటికి వేసవిలో మంచన్నదే కనిపించకుండా పోతుంది. 2040 నాటికి సాధారణ జల సముద్రంగా మారిపోతుందని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞుల అంచనా. ఆర్కిటిక్ కరిగిపోవడం వల్ల సంభవించే ప్రకృ తి వైపరీత్యాల గురించి, అంతరించిపోతున్న జీవరాశి గురించి ఆందోళనే లేకుండా ప్రధాన ప్రపంచ శక్తులన్నీ ఆర్కిటిక్ కరిగి బయటపడే భూభాగాలపై ఆధిపత్యం కోసం పరుగులు తీస్తున్నాయి. అక్కడ ఉన్న అపారమైన ఖనిజ నిక్షేపాల కోసం పోటీకి దిగుతున్నాయి. ఆర్కిటిక్ మరింత వేగంగా కరిగిపోయేలా విధ్వం సాన్ని సృష్టిస్త్నునాయి. తీవ్ర ఇంధన వనరుల కొరతను ఎదుర్కొంటున్న కారణంగా ప్రపంచ దేశాలు, బహుళజాతి చమురు కంపెనీలు ఆర్కిటిక్పైకి దృష్టిని సారించాయి. మిగతా ప్రపంచం అం తటా ఉన్న ఇంకా గుర్తించని మొత్తం చము రు, సహజవాయు నిక్షేపాల కంటే 25 శాతం ఎక్కువ నిక్షేపాలు ఆ ప్రాంతంలో ఉన్నాయని శాస్త్రజ్ఞుల అంచనా. రష్యా, కెనడా, అమెరికా, ఐస్‌ల్యాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్‌లు ఆర్కిటిక్ తీర దేశాలు. అయితే రష్యా ప్రధానంగా ఈ ప్రాంతంపై ఆధిపత్యం వహిస్తోంది. 2007లో రష్యా శాస్త్రజ్ఞుల బృందం తూర్పు ఆర్కిటిక్ సముద్ర ఆంతర్భాగంలోని ‘లామొనొసోవ్ రిడ్జి’ను కనుగొంది. అది రష్యా భూభాగంతో అనుసంధానమై ఉంది. నేటి అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం దానిపై హక్కులు రష్యాకే దఖలు పడాల్సి ఉంటుంది. దీంతో రష్యా ఆ హక్కుల కోసం ఐస్‌ల్యాండ్, కెనడాలతో కయ్యానికి దిగుతోంది. లామొనొసోవ్ రిడ్జిలో ఉన్న సహజవాయువు, చమురు నిక్షేపాలు కనీసం 10,000 కోట్ల టన్నులు! దీంతో రష్యా ప్రిచోరాలో ఎంతటి హిమపాతాలనైనా తట్టుకొనే ఆయిల్ రిగ్ ప్లాట్‌ఫాం ‘ప్రిరాజ్లొమన్య’ను 2012లో నిర్మించడం ప్రారంభించింది. ప్రపంచంలోనే అది అలాంటి మొట్టమొదటి రిగ్ అవుతుంది. ఆర్కిటిక్ అలాస్కా, అమెరాసియా బేసిన్, తూర్పు గ్రీన్‌ల్యాండ్, రిఫ్టీ బేసిన్లలోని 25 భారీ చమురు, సహజవాయు క్షేత్రాలను అమెరికా భూగర్భ సర్వే కనుగొంది. అమెరికా, బ్రిటన్ల చమురు గుత్త సంస్థ ‘షెల్’ ఆర్కిటిక్ హిమసముద్రానికి తూట్లు పొడ వటాన్ని నిరసిస్తూ ‘గ్రీన్ పీస్’ పర్యావరణ కార్యకర్తలు ఆం దోళన సాగిస్తున్నారు. కాలిఫోర్నియా న్యాయస్థానంలో వారి కేసు పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో షెల్‌కు అనుకూలంగా తీర్పు రావడమే తర్వాయి, ఇతర చమురు కార్పొరేషన్లు కూడా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాయి. అత్యంత సున్నితమైన జీవ పర్యావరణ వ్యవస్థలకు నిలయమైన అర్కిటిక్ ప్రాంతం లో చమురు వెలికితీత కార్యకలాపాలు ఇప్పటికే విషమించిన అక్కడి వాతావరణాన్ని మరింతగా పాడు చేస్తాయని పర్యావరణ వేత్తలు గగ్గోలు పెడుతున్నారు. అమెరికా నుంచి నైజీరియా వరకు ప్రతి దేశంలోనూ చమురు, వాయు క్షేత్రాలలో తరచుగా ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. భారీ ఎత్తున పచ్చటి పంట చేలు, హరితారణ్యాలు నాశమమైపోతున్నాయి, సముద్రజలాలు కలుషితమై జీవ, పర్యావరణ వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే ఆర్కిటిక్ తిమింగ లం వంటి జీవరాశి ముప్పను ఎదుర్కొం టోంది. ఇక ధ్రువ ప్రాంతపు ఎలుగుబంటి కూడా అంతరించిపోతుందని భావిస్తున్నారు. వనరుల దుర్వినియోగ జీవన శైలిని వ్యసనం గా మార్చుకున్న సంపన్న దేశాలన్నీ ఇంధన నిక్షేపాల కోసం ఎంతకైనా బరితెగిస్తున్నాయి. అతి సున్నితమైన ఆర్కిటిక్ ప్రాంతంలో చమురు తెట్టులు, పారిశ్రామిక కాలుష్యం మరింతగా భూతాపాన్ని పెంచుతాయని, ఓజోన్ పొరకు తీవ్ర హాని కలిగిస్తాయని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్కిటిక్ ఆధిపత్యపు పోరులో తలమునకలై ఉన్న అమెరికా, రష్యా, కెనడా, నార్వే, డెన్మా ర్క్ తదితర దేశాలు విచ్చలవిడిగా చమురు, వాయు బావుల తవ్వకానికి దిగుతున్నాయి. భవిష్యత్ తరాలకు వారసత్వంగా సంక్రమిం చాల్సిన వనరులను కూడా కొల్లగొడుతున్నా యి. పైగా భావి తరాల మనుగడకే ముప్పును కలుగజేస్తున్నాయి. అన్నిటికీ మించి ఆర్కిటిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలను రేకెత్తిస్తున్నాయి. నవనాగరిక సమాజం ఆర్కిటిక్ ఇంధన వనరులపై, ఖనిజసంపదపై ఆధారపడటం తప్పనిసరే అయినా అందుకు మార్గం ఆధిపత్యవా దం, యుద్ధం కారాదు. సమానత్వం, సామరస్యాలపై ఆధారపడిన ఒప్పందాలపై ఆధారపడి శాంతియుతంగా వనరుల పంపకానికి కృషి చేయడం ఉత్తమం. - జయసూర్య సీనియర్ జర్నలిస్టు