Infectious disease control
-
క్వారంటైన్ ఎన్నాళ్లు..?
వాషింగ్టన్: కరోనా వైరస్ గురించి మాట్లాడకుండా ఎవరికీ ఒక గంట కూడా గడవడం లేదు. ఒకప్పుడు కరోనా సోకిన వారు 14 రోజులు ఐసోలేషన్‌లో ఉన్నా సరిపోయేది కాదు. వారికి పరీక్ష చేసినా పాజిటివ్ వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు. అంతగా లక్షణాలు కనిపించడం లేదు. మూడు రోజులకే నెగెటివ్ వస్తోంది. వైరస్ బలహీన పడుతోందనడానికి ఇదో నిలువెత్తు నిదర్శనం. అలాంటప్పుడు ఎన్నాళ్లు క్వారంటైన్లో ఉండాలన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలాంటి రోగ లక్షణాలు లేకుండా ఇంటికే పరిమితం కావడం చాలా మందికి దుర్భరంగా మారింది. మరోవైపు లక్షణాలున్న వారు తాము బయటకి వస్తే, మిగిలిన వారికి ఎక్కడ వైరస్ వ్యాప్తి చెందుతుందేమోనన్న ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్స్(సీడీసీ) తాను గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను సవరించింది. (వాడిన మాస్క్‌లను ఎలా పడేయాలంటే..) లక్షణాలు లేకపోయినా పాజిటివ్ వచ్చినవారు వారికి పరీక్ష నిర్వహించిన దగ్గర్నుంచి 10 రోజులు ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుంది. అంతకు ముందు వరకు రెండు సార్లు నెగెటివ్ వచ్చాక కోవిడ్ రోగులకి స్వేచ్ఛ లభించేది. అయితే ప్రపంచ దేశాల్లో జరిగిన అధ్యయనాల్లో ఎవరి శరీరంలోనూ తొమ్మిది నుంచి 11 రోజులకు మించి వైరస్ జీవించి ఉండదని తేలింది. దీంతో సీడీసీ తన నిబంధనల్ని మార్చి 10 రోజులు ఇంటిపట్టున ఉంటే సరిపోతుందని పేర్కొంది. ఎవరు ఏం చెప్పారంటే... ► డబ్ల్యూహెచ్ఓ జూన్‌లో సిఫారసు చేసిన మార్గదర్శకాల ప్రకారం.. లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్ వస్తే 10 రోజులు, స్వల్ప లక్షణాలుంటే 13 రోజులు, తీవ్రత ఎక్కువగా ఉండి ఆస్పత్రి పాలైతే డిశ్చార్జ్ అయిన దగ్గర్నుంచి రెండు వారాలు ఐసోలేషన్‌లో ఉండాలి. ► యూకేలో లిసెస్టర్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ జూలియాన్ తాంగ్ కరోనా రోగులు 10 రోజుల ఐసలేషన్‌లో ఉంటే సరిపోతుందన్నారు. పది రోజుల తర్వాత వారి శరీరంలో వైరస్ ఉన్నప్పటికీ అది బలహీనపడిపోయి వ్యాప్తి చెందదని తాము నిర్వహించిన క్లినికల్ పరీక్షల్లో తేలిందన్నారు. ► నేచర్ పత్రిక చేసిన అధ్యయనంలో కరోనా శరీరంలోకి ప్రవేశించాక ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీలు అయిదో రోజు నుంచి వైరస్‌ను నిర్వీర్యం చేయడం మొదలు పెడతాయని తేలింది. ఎనిమిది లేదా తొమ్మిదో రోజూ ఎవరి శరీరంలోనూ వైరస్ జీవించి ఉండదు. మరొకరికి సంక్రమించే అవకాశం లేదని ఆ పత్రిక వెల్లడించింది. ► సింగపూర్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షసియల్ వేయబుల్ నిర్వహించిన అధ్యయనంలో 11 రోజుల తర్వాత వైరస్ బలహీనపడుతుందని తేలింది. ► మన దేశంలో నిబంధనల ప్రకారం వరుసగా మూడు రోజుల పాటు జ్వరం రాకుండా ఉంటే కోవిడ్ రోగుల్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు. ఆ తర్వాత 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలి. అది ముగిశాక ఇంట్లో వారితో కలిసిమెలిసి ఉండొచ్చు కానీ మరో ఏడు రోజులు ఇంటికే పరిమితం కావాలి. మొత్తంగా 17 రోజుల తర్వాత వారు బయటకి రావచ్చు. ► కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న రష్యాలో కరోనా రోగులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలి. ఆ తర్వాత పరీక్షలో నెగిటివ్ వచ్చాక ఇల్లు దాటి బయటకి అడుగుపెట్టొచ్చు. -
డెంగీ నియంత్రణకు చర్యలు తీసుకోండి
- పడకలు, పరికరాలు సిద్ధంగా ఉంచాలి - ట్యాంకులకు మరమ్మతులు చేయాలి - ఆస్పత్రులకు ఎన్డీఎమ్సీ ఆదేశం న్యూఢిల్లీ: వర్షాకాలం సమీపిస్తున్నందున డెంగీ వంటి అంటువ్యాధుల నియంత్రణపై ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎమ్సీ) దృష్టి సారించింది. ఈ వ్యాధుల చికిత్సకు అవసరమైన అత్యవసర పడకలు, రక్తం యూనిట్లు, పరికరాలను సిద్ధం గా ఉంచుకోవాలని ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేషన్ గురువారం ఆదేశించింది. అంటువ్యాధుల నియంత్రణలో భాగంగా ఎన్డీఎమ్సీ కమిషనర్ ప్రవీణ్ గుప్తా సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో నిర్వహించిన భేటీలో పైఆదేశాలు జారీ చేశారు. వ్యాధుల నియంత్రణకు తమ విభాగాలు తీసుకునే చర్యలను అధికారులు ఈ సందర్భంగా వివరించారు. నీరు నిల్వకాకుండా, దోమలు వృద్ధి చెందకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని గుప్తా ఆదేశించారు. ఎన్డీఎమ్సీ అదనపు కమిషనర్ (ఆరోగ్య విభాగం), మున్సిపల్ వైద్యాధికారి, ఢిల్లీ జలబోర్డు ప్రతినిధులు, ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ), పీడబ్ల్యూడీ, ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ), ఢీల్లీ రవాణాసంస్థ (డీటీసీ) ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. వర్షాలు పడ్డప్పుడు నీరు నిల్వకాకుండా నిరోధించేం దుకు వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని గుప్తా పర్యావరణ నిర్వహణ సేవాసంస్థ (డీఈఎంఎస్)ను ఈ సందర్భంగా ఆదేశించారు. గత ఏడాది డెంగీ విజృంభించడంతో ఎన్డీఎమ్సీ ఈ చర్యలు తీసుకుంది. నిరుడు 5,500 మందికి ఈ వ్యాధి సోక గా, ఆరుగురు మరణించారు. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం 2010లో ఢిల్లీలో అత్యధికంగా 6,200 కేసులు నమోదయ్యా యి. 2009లో 1,153, 2008లో 1,300 కేసులు, 2011లో 1,131 కేసులు, 2012లో 2,093 కేసులు, గత ఏడాది 5,574 డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీ కారక దోమల వృద్ధి చెందకుండా నిరోధించడానికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, నివాస ప్రాంతాల్లోని ఓవర్‌హెడ్ ట్యాంకులకు మూతలు ఉండేలా చూడాలని ఎన్డీఎమ్సీ వాటి ఇంజనీరింగ్ విభాగాలను ఆదేశించింది. ట్యాంకులకు కూడా మరమ్మతులు నిర్వహిం చాలని సూచించింది. ఫౌంటెయిన్లు, కృత్రిమ జల పాతాల నుంచి నీటిని తోడివేయాలని కమిషనర్ ప్రవీణ్ గుప్తా ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. వ్యాధుల నియంత్రణ చర్యలపై చర్చించేందుకు సిబ్బందితో పక్షం రోజులకు ఒకసారి సమావేశాలు నిర్వహించాలని ఆయన జోనల్ డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.