Information revolution
-
ఏజెన్సీల్లో సమాచార 'విప్లవం'
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో సమాచార విప్లవం వచ్చింది. వీటివల్ల ఏ గిరిజన గూడెంలో ఏం జరిగినా వెంటనే తెలుసుకునే అవకాశం ఏర్పడింది. గిరిజన పంచాయతీల్లోని సచివాలయాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంవల్లే అక్కడి స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు రాష్ట్ర ప్రభుత్వానికి కలిగింది. అలాగే, అడవుల్లో సరైన రహదారులు లేని గ్రామాలకు ఐశాట్ ఫోన్లు ఇచ్చింది. వీటి ద్వారా కూడా అత్యవసర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం తెలుసుకుంటోంది. గ్రామ సచివాలయాలకు ఫైబర్‌నెట్ సేవలు గిరిజన పంచాయతీల్లోని ప్రతి గ్రామ సచివాలయానికి ఫైబర్‌నెట్ సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇటీవల రూ.3కోట్లను ఫైబర్‌నెట్ సంస్థకు గిరిజన సంక్షేమ శాఖ అందజేసింది. వీటికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు.. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న పలు సెల్టవర్ల పరిధిలో అప్పుడప్పుడు సిగ్నల్స్ సరిగ్గా ఉండని కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో.. త్వరలో ఫైబర్‌నెట్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుండడంతో ఆ సమస్యలకు చెక్ పడనుంది. గిరిజన గూడేల్లోని వారు తమ ఇళ్లకు కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందవచ్చు. అంతేకాక.. వివిధ టీవీ చానెల్స్ కూడా ఈ ఫైబర్‌నెట్ ద్వారా వీక్షించవచ్చు. అత్యవసర సమాచారానికి ఐశాట్ ఫోన్లు ఇక గిరిజన గూడేల్లో ఏవైనా సంఘటనలు జరిగినా, సరైన వసతులు లేకపోయినా, వైద్య సాయం కావాల్సి వచ్చినా వెంటనే తెలిపేందుకు ప్రభుత్వం ఆయా ఐటీడీఏలకు ఐశాట్ ఫోన్లను అందజేసింది. ఈ ఫోన్లు ఐటీడీఏ పీవోల పర్యవేక్షణలో ఉంచింది. ఇవి వాకీటాకీల్లా పనిచేస్తాయి. సీతంపేట, పాడేరు, పార్వతీపురం, ఆర్సీ వరం, కేఆర్ పురం, చింతూరు, శ్రీశైలం ఐటీడీఏల్లో మొత్తం 203 ఐశాట్ ఫోన్లు ఉన్నాయి. వలంటీర్లకు కూడా వీటిని ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మరోవైపు.. ఏజెన్సీలోని వైద్య వలంటీర్లకు ఫోన్లు ఇవ్వడం ద్వారా కూడా గిరిజనుల ఆరోగ్య సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలు కలిగింది. సమాచారం తెలుసుకోవడంలో ముందున్నాం గతంలో గిరిజన గూడేల్లో సమాచారం తెలుసుకునేందుకు సమయం పట్టేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వ సహకారంతో పలు కంపెనీలు ఇప్పటికే సెల్‌టవర్లను ఏర్పాటుచేశాయి. అలాగే, ప్రస్తుతం గ్రామ సచివాలయాలకు ఫైబర్‌నెట్ కనెక్షన్ల పనులు చురుగ్గా జరుగుతున్నాయి. కొన్నిచోట్ల పూర్తయ్యాయి. ఐశాట్ ఫోన్ల ద్వారా కూడా సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తోంది. – ఇ.రవీంద్రబాబు, అడిషనల్ డైరెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ -
సామాజిక వేడుక
సామాజిక మాధ్యమాలే వేదిక మువ్వన్నెలద్దుకున్న {పొఫైల్ పేజీలు ఏయూక్యాంపస్ : సమాచార విప్లవం నేడు మన ముందు దర్శనమిస్తోంది. స్వేచ్ఛ ప్రతి వ్యక్తికి చేరువయ్యింది. తమ ఆలోచనలు, భావాలను పంచుకునే అవకాశం చిక్కుతోంది. ప్రపంచం అవధులు చెరిపేసే విధంగా ఈ సామజిక మాధ్యమాలు నిలుస్తున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, మెసెంజర్ ఇలా నిత్యం సోషల్ నెట్వర్కింగ్ మాధ్యమాలు ప్రధానంగా యువత ఆలోచనలు పంచుకునే వేదికలుగా నిలుస్తున్నాయి. మనసులోని భావాలను నిర్భయంగా, ఇతరులతో పంచుకునే అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుంటోంది... రేపటి స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సామాజిక వేదిక’లపై పండగ చేసుకుంటోంది. అభిప్రాయాల వేదిక.... అభిప్రాయాలు పంచుకోవడానికి ఒక వేదిక కావాలి. భావాలను చేరవేసే వారధి అవసరం. వీటిని తీర్చే విధంగా సాగుతోంది సామాజిక మాధ్యమాల పయనం. స్వాతంత్య్ర దినోత్సవం, స్నేహితుల దినోత్సవం, మాతృదినోత్సవం ఇలా వేడుక ఏదయినా వేదిక మేమంటూ సాగుతున్నాయి. తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకుంటున్నాయి. ఒకరి అభిప్రాయంతో ఏకీభవించే వారు విబేధించే వారు సైతం మనకు దర్శనమిస్తుంటారు. ఏది ఏమయినా భావాల సంవాదం మాత్ర తధ్యమని తెలుస్తోంది. స్వాతంత్య్ర స్ఫూర్తి... దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు జరుపుకునే వేడుకలు స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం. వీటికి యువతరం ఎంతో ఆసక్తి చూపుతుంటారు. స్వాతంత్య్ర దినోత్సవం వస్తోందంటే సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ ప్రొఫైల్ పీజీలు రంగులను అద్దుకుంటున్నాయి. తమ భావాలకు అక్షర రూపం ఇవ్వడంతో పాటు, రంగులను అద్దుతుంటారు. వీటిని ఫేస్బుక్, వాట్సాప్‌ల్లో పోస్టింగ్ చేస్తారు. వేడుకకు వారం రోజుల ముందునుండే పోస్టింగ్‌లు వెల్లువెత్తుతుంటాయి. వీటిలో తమకు నచ్చినని, మనసుకు హత్తుకున్న వాటిని పదే పదే పంపడం సర్వసాధారణ విషయంగా మారుతోంది. వీటికి లైక్‌లు, షేరింగ్‌లకు లెక్కేలేదు. షేరింగ్ థాట్స్.... గతంలో వ్యక్తులు ఎంతో బిడియంతో వ్యవహరించేవారు. నేడు దీనికి భిన్నంగా ఎంతో స్వేచ్ఛగా భావాలు ప్రకటిస్తున్నారు. తమ ఆలోచనలు పంచుకునే వేదికగా సోషల్ నెట్వర్కింగ్ నిలుస్తోంది. మన ఆలోచనలను సులభంగా, తక్కువ సమయంలో ఇతరులతో పంచుకోవడానికి ఇవి వేదికగా నిలుస్తున్నాయి. - వి.మహేష్, సాఫ్ట్వేర్ నిపుణుడు పరిణతితో ప్రవర్తించాలి.... మన భావాలు ఇతరులను నొప్పించేవిగా ఉండకూడదు. వివాదాలు రేకెత్తించేవిగా, ఇతరుల మనసులను గాయపరిచేవిగా, వ్యక్తిగతమైనవిగా ఉండకుండా చూడాలి. సామాజిక మాధ్యమాలు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. వీటిని పరిధిని గుర్తించి, పరిణతితో కూడిన అభిప్రాయాలను మాత్రమే పంచుకోవడం శ్రేయస్కరం. - ఆర్.వి.ఆర్ శర్మ, పరిశోధక విద్యార్థి