ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్ని ఇచ్చిన ఇన్ఫోసిస్
బెంగళూరు : ఇన్ఫోసిస్ వరుసగా రెండో త్రైమాసికంలో ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్ని ఇచ్చింది. సెప్టెంబరు క్వార్టర్లో కంపెనీ ఆర్థిక ఫలితాలు అనలిస్టుల అంచనాలకు అనుగుణంగా వచ్చాయి. ఆదాయం 12,965 కోట్ల రూపాయలుగా నమోదైంది. 2,410 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. మరోవైపు 20013-14 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాను కూడా పెంచింది. ఆదాయ వృద్ధి 6 నుంచి 10 శాతం ఉంటుందని గతంలో ఇన్ఫీ మేనేజ్మెంట్ అంచనా వేసింది. ఇప్పుడు ఆ అంచనాను 9 నుంచి 10 శాతానికి సవరించింది.
ఈ నేపథ్యంలో కంపెనీ షేరు ధర 160 రూపాయల దాకా లాభపడుతూ 3,300లకు చేరువలో ట్రేడవుతోంది. 6 నెలల కిందట షేరు ధర 2300ల కంటే తక్కువగా ఉండటం ఈ సందర్భంగా గమనించాల్సిన విషయం. ఇన్ఫోసిస్ 5 శాతం దాకా పెరుగుతుండటంతో సెన్సెక్స్ కూడా లాభపడుతోంది. 200 పాయింట్లకు పైగా పెరుగుతూ 20,500లకు సమీపంలో ట్రేడవుతోంది. నిఫ్టీ 60 పాయింట్ల దాకా పెరుగతూ 6,080 పాయింట్లకు సమీపంలో కొనసాగుతోంది.