Infosys results
-
మార్కెట్‌పై ‘బడ్జెట్’ ప్రభావం
న్యూఢిల్లీ: గత శుక్రవారం బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కీలక నిర్ణయాలు, ప్రతిపాదనల ప్రభావం ఈ వారం మార్కెట్‌పై ఉంటుందని, అలాగే ఐఐపీ(పారిశ్రామికోత్పత్తి), ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక గణాంకాలపైనా ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక జూన్ త్రైమాసికానికి సంబంధించి విడుదలయ్యే కంపెనీల ఫలితాలు కూడా మార్కెట్ ట్రెండ్‌ను నిర్ణయించొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 9న టీసీఎస్, 12న ఇన్ఫోసిస్ ఫలితాలు విడుదల కానున్నాయి. అలాగే, బడ్జెట్ నిర్ణయాల నేపథ్యంలో డాలర్‌తో రూపాయి కదలికలు, అంతర్జాతీయ అంశాల ప్రభావం సైతం ఉంటుందని భావిస్తున్నారు. గత శుక్రవారం బడ్జెట్ నిర్ణయాలు ఆశాజనకంగా లేకపోవడంతో సూచీలు నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా లిస్టెడ్ కంపెనీల్లో కనీస ప్రజల వాటాను ప్రస్తుత 25 శాతం నుంచి 35 శాతానికి పెంచడం, బైబ్యాక్‌పై 20 శాతం పన్ను వంటి అంశాలు మార్కెట్లకు రుచించలేదు. ‘‘ఎంతగానో వేచి చూసిన బడ్జెట్ కార్యక్రమం ముగిసింది. అయితే, దీని తాలూకూ ప్రభావం ఈ వారం కూడా మార్కెట్‌పై కొనసాగుతుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమీత్ మోదీ తెలిపారు. ‘‘బడ్జెట్ ప్రభావం సోమవారం నాటి మార్కెట్‌పైనా ఉంటుంది. సూచీల్లో భారీ క్షీణత మరింత నష్టాలు ఉంటాయన్న సంకేతాన్నిస్తోంది. 11,800ను నిఫ్టీ కోల్పోతే మరింత క్షీణతకు దారితీస్తుంది’’అని రెలిగేర్ బ్రోకింగ్ రిటైల్ డిస్ట్రిబ్యూషన్ ప్రెసిడెంట్ జయంత్ మంగ్లిక్ తెలిపారు. ఇక, పారిశ్రామిక ఉత్పత్తి, జూన్ నెల ద్రవ్యోల్బణం గణాంకాలు, చమురు ధరల కదలిక, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణి సైతం ఈ వారం మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయి. లిస్టెడ్ కంపెనీల్లో ప్రజల వాటాను పెంచే ప్రతిపాదన అవసరమైనదే కానీ, లార్జ్‌క్యాప్ కంపెనీల విషయంలో దీని అమలు సమస్యలతో కూడుకున్నదేనని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ అన్నారు. మార్కెట్లకు నిరుత్సాహం... ‘‘ప్రభుత్వం నుంచి మద్దతు చర్యలను మార్కెట్ ఆశించింది. కానీ, అది జరగలేదు. దేశీయంగా, అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులే ఇందుకు కారణం’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్‌హెడ్ వినోద్‌నాయర్ పేర్కొన్నారు. ఈక్విటీల్లో పెట్టుబడులపై ప్రోత్సాహకాల్లేమి మార్కెట్లను సమీప కాలంలో నిరుత్సాహంగా మార్చొచ్చన్నారు. ఈ స్థాయి నుంచి మార్కెట్ పనితీరు అన్నది 2020 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక పనితీరుపై ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయాన్ని వినిపించారు. ఈ వారంలో వచ్చే ఫలితాలు 8వ తేదీన డెల్టాకార్ప్, గోవా కార్బన్ , 9న టీసీఎస్, 10న సీసీఎల్, 12న ఇండస్ఇండ్ బ్యాంకు, ఇన్ఫోసిస్, కర్ణాటక బ్యాంకు, 13న డీహెచ్ఎఫ్ఎల్, డీమార్ట్ ఈ వారంలో ఫలితాలు విడుదల చేయనున్న ప్రముఖ కంపెనీల్లో కొన్ని. ‘‘బడ్జెట్లో అదనపు సాయం కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు కొనసాగుతాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం ఫలితాల్లో వీటి పాత్ర గణనీయంగా ఉంటుంది. 2019–20 ఫలితాల విషయంలో ఎన్ఎస్ఈ 500 కంపెనీల పన్ను అనంతరం లాభంలో 30 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నాం’’అని ఎడెల్వీజ్ ఇన్వెస్టర్ రీసెర్చ్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్కపూర్ తెలిపారు. తొలి వారంలో విదేశీ పెట్టుబడులు వెనక్కి న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు, బడ్జెట్ ప్రతిపాదనలపై అనిశ్చితి అంచనాల నేపథ్యంలో జూలై తొలి వారంలో విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ. 475 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అంతకు ముందు దాదాపు అయిదు నెలలుగా విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరుపుతూ వస్తున్నారు. ఈక్విటీ, డెట్ మార్కెట్లకు సంబంధించి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) నికరంగా ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లు, మార్చిలో రూ. 45,981 కోట్లు, ఏప్రిల్‌లో రూ. 16,093 కోట్లు, మే లో రూ. 9,031.15 కోట్లు, జూ¯Œ లో రూ. 10,385 కోట్ల మేర ఇన్వెస్ట్ చేశారు. -
ఐటీకి కరెన్సీ కుదుపులు!
క్యూ3లో ఆదాయాల వృద్ధి అంతంతే! * రేపు ఇన్ఫోసిస్ ఫలితాలతో బోణీ... * సీజనల్‌గానూ ఈ త్రైమాసికం ఐటీ కంపెనీలకు నిరుత్సాహకరం... * పరిశ్రమ విశ్లేషకుల అంచనా... ముంబై: దేశీ ఐటీ రంగానికి డిసెంబర్ క్వార్టర్ నిరుత్సాహకరంగానే ఉండొచ్చని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ కరెన్సీల మధ్య మారకపు విలువల్లో తీవ్ర హెచ్చుతగ్గులు... కంపెనీల పనితీరుపై ప్రభావం చూపనున్నాయనేది వారి అంచనా. దీనికితోడు సాధారణంగా ఈ త్రైమాసికంలో అమెరికా, యూరప్ ఇతరత్రా ప్రధాన మార్కెట్లలో అధిక సెలవులు ఇతరత్రా సీజనల్ అంశాలు కూడా తోడవుతాయని.. దీనివల్ల ఆదాయాలు మందగించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ నెల 9న(శుక్రవారం) ప్రకటించనున్న ఫలితాలతో ఈ ఏడాది మూడో త్రైమాసికం(2014-15, క్యూ3) ఫలితాల సీజన్ మొదలుకానుంది. 15న ఐటీ అగ్రగామి టీసీఎస్, 16న విప్రో క్యూ3 ఫలితాలను ప్రకటించనున్నాయి. డాలరుతో యూరో క్యూ3లో 6%, పౌండ్ 5%, ఆస్ట్రేలియా డాలరు 7.8% చొప్పున క్షీణించాయి. మన ఐటీ కంపెనీలకు అమెరికా(70%) తర్వాత యూరప్ అతిపెద్ద మార్కెట్‌గా(20%) నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా కరెన్సీ విలువలు పతనం కావడం ఐటీ కంపెనీల డాలరు ఆదాయాలను దెబ్బతీయనుంది. ఎందుకంటే.. ఇతర కరెన్సీల్లో వచ్చిన ఆదాయాన్ని భారతీయ కంపెనీలు డాలర్లలోకి మార్చుకొని ఫలితాల్లో చూపించడమే దీనికి ప్రధాన కారణమని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇతర కరెన్సీలు బాగా క్షీణించినందున, ఆ దేశాల నుంచి ఒనగూడే ఆదాయం డాలర్ల రూపంలో తగ్గుతుంది. అయితే, డాలరుతో రూపాయి మారకం విలువ క్షీణత నేపథ్యంలో ఐటీ కంపెనీల మార్జిన్లలో కాస్త మెరుగుదల కనబడొచ్చనేది వారి అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ డాలర్ల నుంచి మార్చడం వల్ల రూపాయిల్లో ఆదాయం పెరుగుతుంది. క్యూ3లో రూపాయి విలువ 2.7 శాతం తగ్గింది. ఇన్ఫీ గెడైన్స్ తగ్గిస్తుందా..? కరెన్సీ హెచ్చుతగ్గుల కారణంగా ఇన్ఫోసిస్ ఈ ఏడాది పూర్తి కాలానికి ఇచ్చిన ఆదాయ వృద్ధి అంచనా(గెడైన్స్)6.75-8.75 శాతానికి తగ్గించే అవకాశం ఉందని బ్రోకరేజి సంస్థ మోతీలాల్ ఓశ్వాల్ తాజా నోట్లో పేర్కొంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను ఇన్ఫీ 7-9% డాలరు ఆదాయ గెడైన్స్‌ను ఇదివరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, క్యూ3లో కంపెనీ డాలరు ఆదాయ వృద్ధి 1-3%కే(క్యూ2తో పోలిస్తే సీక్వెన్షియల్‌గా) పరిమితం కావచ్చనేది విశ్లేషకుల అంచనా. క్యూ2లో సీక్వెన్షియల్ ఆదాయ వృద్ధి అంచనాలను మించి 3.1 శాతంగా నమోదుకావడమే కాకుండా... ఒక షేరుకి మరో షేరు(1:1) బోనస్‌గా కూడా ప్రకటించడం విశేషం. కంపెనీ సీఈఓగా తొలిసారి ప్రమోటరేతర వ్యక్తి(విశాల్ సిక్కా) బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇన్ఫీ మళ్లీ పూర్వవైభవం దిశగా వెళ్తోందని పలువురు నిపుణులు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా, గడచిన రెండు క్వార్టర్లలో కరెన్సీ కుదుపుల కారణంగా ఇన్ఫీ ఆదాయ గెడైన్స్ 2014-15లో 7 శాతానికి పరిమితం కావొచ్చని క్రెడిట్ సూసీ పేర్కొంది. ఇతర దిగ్గజాల పరిస్థితేంటి... క్యూ3 సీజనల్‌గా బలహీన ధోరణి ఉంటుందని.. అధిక సెలవుల కారణంగా కీలక మార్కెట్లలోని కొన్ని ప్రధాన రంగాలకు చెందిన క్లయింట్ల నుంచి వచ్చే ఆదాయాలపై ప్రభావమే కారణమంటూ టీసీఎస్ ఇప్పటికే సంకేతాలిచ్చింది. దీనికితోడు కరెన్సీ కుదుపులు కూడా తోడవుతాయని డాయిష్ బ్యాంక్ విశ్లేషకుడు అనిరుద్ధ భోశాలే చెప్పారు. ఇన్ఫోసిస్, విప్రో కంటే టీసీఎస్‌పై ఈ అంశాలు అధిక ప్రభావం చూపొచ్చన్నారు. టీసీఎస్ డాలరు ఆదాయాల వృద్ధి క్యూ3లో 0.8%కే(సీక్వెన్షియల్‌గా) పరిమితం కావచ్చనేది డాయిష్ బ్యాంక్ అంచనా. అదేవిధంగా హెచ్‌సీఎల్ టెక్ మార్జిన్లపైనా కరెన్సీ ప్రతికూలతలు ప్రభావం చూపనున్నాయని.. కంపెనీ వేతన పెంపులు డిసెంబర్ క్వార్టర్లో ప్రతిబింభించడం కూడా దీనికి మరో కారణంగా పరిశీలకులు చెబుతున్నారు. ఇన్ఫోసిస్ ఆదాయ వృద్ధి సీక్వెన్షియల్‌గా డాలర్లలో 1.2 శాతంగా ఉంటుందని డాయిష్ బ్యాంక్ పేర్కొంది. అయితే, టెక్ మహీంద్రా మాత్రం కాస్త మెరుగైన పనితీరును నమోదు చేసే అవకాశం ఉందని.. త్రైమాసిక ప్రాతిపదికన క్యూ3లో డాలరు ఆదాయాల్లో వృద్ధి 3.8%గా అంచనా వేసింది. అయితే, స్థిర కరెన్సీ ప్రాతిపదికన దేశీ టాప్ కంపెనీల ఆదాయాల వృద్ధి 2.2-3.5% మేర ఉంటుందన్న అంచనాలున్నాయి.