వాలీబాల్ టోర్నీ విజేత ఇన్ఫోసిస్
జింఖానా, న్యూస్‌లైన్: ఏస్ కనెక్ట్ వాలీబాల్ టోర్నీ ఫైనల్స్‌లో ఇన్ఫోసిస్ జట్టు విజేతగా నిలిచింది. ఐఎంటీ హైదరాబాద్ నిర్వహించిన ఈ టోర్నీలో ఇన్ఫోసిస్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, క్వాల్కమ్, అమెజాన్ డాట్ కామ్ కంపెనీలు పాల్గొన్నాయి.
శనివారం జరిగిన ఫైనల్స్‌లో ఇన్ఫోసిస్ 25-22, 25-21తో ఆతిథ్య ఐఎంటీ జట్టుపై గెలుపు దక్కించుకుంది. తుది పోరులో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే చివరి నిమిషంలో ఇన్ఫోసిస్ జట్టు ఆటగాళ్లు చాకచక్యంగా వ్యవహరించి జట్టుకు విజయాన్ని అందించారు.