అకస్మాత్తుగా సంభవించే ఆపద!
Civils Prelims
Paper - I
డిజాస్టర్ మేనేజ్మెంట్
విపత్తులు
తీవ్ర నష్టాన్ని కలుగజేస్తూ, ప్రజలను పూర్తిగా నిరాశ్రయులను చేసే ఆకస్మిక ఘటనలనే విపత్తులు అంటారు. ప్రకృతి వనరులు, మౌలిక వనరులు ధ్వంసం కావడం, సాధారణ జన జీవనానికి ఆటంకాలు కలగడం, సామాన్య ప్రజలు తమ జీవనోపాధిని పునరుద్ధరించుకోలేకపోవడం, ధన, ప్రాణ నష్టాలు ఈ విపత్తుల వల్ల సంభవిస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా క్రీ.పూ. 430 నుంచి విపత్తులకు సంబంధించిన వివరాల నమోదు ప్రారంభమైంది. అదే సంవత్సరంలో ఏథేన్స నగరంలో టైఫస్ మహమ్మారి సంభవించినట్లు నమోదు చేశారు. క్రీ.పూ. 1556 జనవరి 23న చైనాలోని షాంగ్జీ ప్రావిన్సలో సంభవించిన భూకంపంలో 8,30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తం గా అత్యధికంగా ప్రాణ నష్టానికి కారణమైన విపత్తు ఇదే.
గ్రీక్ భాషకు చెందిన ఈఠట(చెడ్డ), అఠట్ట్ఛట (నక్షత్రం) అనే పదాల కలయిక ద్వారా వచ్చిన ఈజీట్చట్ట్ఛట, మధ్యయుగాల నాటి ఫ్రెంచి పదం ఈ్ఛట్చట్టట్ఛ, ప్రాచీన ఇటలీ భాషకు చెందిన ఈజీట్చట్టటౌ పదాల నుంచి విపత్తు అనే పదం ఏర్పడింది. గ్రీక్, లాటిన్ భాషల్లో ఈజీట్చట్ట్ఛట అంటే ‘దుష్టనక్షత్రం’ (Bad Star) అని అర్థం. ప్రాచీన కాలంలోని ప్రజలు ఏదైనా విధ్వంసం లేదా విపత్తును ఏదో ఒక నక్షత్రానికి ఆపాదిస్తూ దాన్ని దుష్ట నక్షత్రంగా భావించేవారు.
విపత్తు సంభవించే ప్రాంతంలో వచ్చే మార్పులు
- ప్రజల దైనందిన కార్యక్రమాలు పూర్తిగా దెబ్బతింటాయి.
- మౌలిక వసతులు (రోడ్డు, రైల్వేమార్గాలు, వైద్యవసతులు, తాగునీరు మొదలైనవి) దెబ్బతింటాయి.
- సాధారణ ప్రజల జీవనోపాధి దెబ్బతిం టుంది. వారు నిరాశ్రయులవుతారు.
- ప్రకృతి వనరులు ధ్వంసమవుతాయి.
- ధన, ప్రాణ నష్టాలు సంభవిస్తాయి.
విపత్తుల లక్షణాలు
- ఆకస్మికంగా వస్తాయి. అందువల్ల వాటి రాకను ముందుగా గుర్తించలేం. అవి సంభవించిన తర్వాత వాటివల్ల జరిగే తీవ్రతను మాత్రమే ముందస్తు చర్యల ద్వారా తగ్గించవచ్చు.
- విపత్తులు అతివేగంగా వస్తాయి.
- తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి.
విపత్తు నిర్వచనాలు
2005 విపత్తు నిర్వహణ చట్టం ఇచ్చిన నిర్వచనం ప్రకారం విపత్తు అంటే ‘ఏదైనా ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా లేదా మానవ చర్యల వల్ల సంబంధిత ప్రాంతం తనంతట తాను కోలుకోలేని విధంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి, పర్యావరణ విధ్వంసానికి కారణమయ్యే ఉపద్రవం, ప్రమాదం లేదా దుర్ఘటననే’ విపత్తు అని పిలుస్తారు.ఐక్యరాజ్య సమితి (ూ్ఖై) ఇచ్చిన నిర్వచనం ప్రకారం... ‘ఒక సమాజపు సాధారణ నిర్మాణాన్ని, సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ అకస్మాత్తుగా లేదా తీవ్రంగా
సంభవించే ఆపదే విపత్తు’.
విపత్తుల స్వభావాన్ని పరిశీలిస్తే అవి రెండు రకాలు. ప్రకృతిలో మార్పుల వల్ల సంభవించేవి. ఉదా: భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు. మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం వల్ల సంభవించేవి. ఉదా: రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, ఆయిల్ లీకేజీ, పారిశ్రామిక దుర్ఘటనలు. ముఖ్యంగా ఈ విపత్తులు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి.
20వ శతాబ్దం రెండో అర్ధభాగంలో ప్రపంచవ్యాప్తంగా 200లకు పైగా తీవ్ర విపత్తులు సంభవించాయి. వీటి కారణంగా సుమారు 14 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. పారిశ్రామిక దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నష్ట తీవ్రత 20 రెట్లు అధికంగా ఉంది. ప్రాణ నష్టం అధికంగా జరిగిన దేశాల్లో ఆసియా దేశాలు అగ్రభాగాన ఉన్నాయి. 1995 నుంచి 2004 మధ్య ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన విపత్తుల తరచుదనం కిందివిధంగా ఉంది.
వరదలు - 30 %
తుఫాన్లు - 21 %
కరవు సంబంధిత విపత్తులు - 19 %
మహమ్మారి వ్యాధులు - 15 %
భూకంపాలు, సునామీలు - 8 %
భూపాతాలు - 4 %
అగ్నిపర్వత విస్ఫోటనాలు - 1 %
కీటక దాడులు - 1 %
హిమసంపాతాలు - 1 %
భారతదేశంలోని విశిష్టమైన భౌగోళిక, వాతావరణ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రకృతి, మానవ కారక విపత్తులు సంభ విస్తున్నాయి. గడిచిన 30 ఏళ్ల కాలంలో భారతదేశంలో 431 తీవ్ర విపత్తులు సంభవించాయి. వాటి వల్ల ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ్కట్ఛఠ్ఛ్టిజీౌ గ్ఛిఛ ్ట్చ్టజీట్టజీఛిట ప్రకారం గత 3 దశాబ్దాలలో సంభవించిన ముఖ్యమైన విపత్తుల కారణంగా 1,43,039 మంది ప్రాణాలు కోల్పోగా, 15 కోట్ల మందికిపైగా వీటి ప్రభావానికి గురయ్యారు. ఆస్తులు, ఇతర మౌలిక సౌకర్యాలకు 48
00 కోట్ల అమెరికన్ డాలర్ల నష్టం జరిగింది.
భారతదేశంలో ముఖ్యంగా వరదలు, తుఫాన్లు, భూకంపాలు, భూపాతాలు, హిమపాతాలు, కరవు అధికంగా సంభవిస్తున్నాయి. దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 27 విపత్తు భరితమై ఉన్నాయి. దాదాపు 58.6% భూభాగం భూకంప తాకిడికి, 68% కరవు, 12% భూభాగం (40 మిలియన్ల హెక్టార్లు) వరదలు, 8% భూభాగం (5,700 కి.మీ. తీర ప్రాంతం) తుఫాన్లకు లోనవుతున్నాయి.
భారతదేశంలో విపత్తుల స్వభావాలు
ప్రపంచంలో అత్యంత విపత్తు ముప్పు కలిగి ఉన్న మొదటి 10 దేశాల్లో భారతదేశం ఒకటి. ఇందుకు అనేక ప్రకృతి, మానవ చర్యలు కారణమవుతున్నాయి. ప్రతికూల భౌగోళిక, శీతోష్ణస్థితి పరిస్థితులు, స్థలాకృతి స్వభావాలు, పర్యావరణ నిమ్నీకరణ, జనాభావృద్ధి, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అశాస్త్రీయ అభివృద్ధి మొదలైన కారకాలు దేశంలో విపత్తులకు కారణమవుతున్నాయి. వీటివల్ల తీవ్రస్థాయిలో ధన, ప్రాణ నష్టాలు సంభవించడమే కాకుండా దేశంలోని జీవనాధార వ్యవస్థకు అంతరాయం ఏర్పడుతోంది. విపత్తులకు గురయ్యే స్వభావాన్ని బట్టి దేశంలో ఐదు ప్రత్యేక ప్రాంతాలు ఉన్నాయి. అవి...
1. భౌగోళిక విరూప కారకాల వల్ల (ఎౌ్ఛ ఖ్ఛీఛిౌ్టజీఛి ఊ్ఛ్చ్టఠట్ఛట) హిమాలయాలు, వాటిని ఆనుకొని ఉన్న ఒండ్రుమైదానాలు తరచూ భూకంపాలు, భూపాతాలు, జలక్షయం లాంటి విపత్తులకు గురవుతున్నాయి.
2. భారతదేశ ద్వీపకల్ప ప్రాంతం స్థిరమైన భూభాగం అయినప్పటికీ మానవ తప్పిదాల వల్ల అప్పుడప్పుడూ ఇక్కడ జరుగుతూ ఉన్నట్లు కనిపించే భౌగోళిక విరూపక చలనాల వల్ల ఈ ప్రాంతం కూడా ఇటీవల భూకంప ప్రభావానికి లోనవుతోంది.
3. గంగా - సింధూ - బ్రహ్మపుత్రా మైదాన ప్రాంతాలు హిమాలయాలను ఆనుకొని ఉన్నందు వల్ల భూకంపాలకు గురవు తున్నాయి. ఈ నదీ వ్యవస్థల్లో పాత ఒండ్రుమట్టి పేరుకు పోవడం వల్ల తరచూ వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ మైదాన ప్రాంతాలు ఎక్కువగా ఈ ప్రభావానికి లోనవుతున్నాయి.
4. రాజస్థాన్, గుజరాత్ లాంటి రాష్ట్రాలు ఎడారి శీతోష్ణస్థితి ప్రభావం కారణంగా తరచూ కరవుకు లోనవుతున్నాయి.
5. తూర్పు తీర రాష్ట్రాలన్నీ తరచూ వరదలు, తుఫాన్ల తాకిడికి లోనవుతున్నాయి.
6. మహాసముద్రాల భూతలంపై జరిగే భౌగోళిక విరూపకార చలనాల వల్ల తీర ప్రాంతాలను సునామీలు ముంచెత్తుతున్నాయి.
ప్రపంచ బ్యాంకు అధ్యయనం ప్రకారం భారతదేశంలో విపత్తుల కారణంగా ఏటా జీడీపీలో 2% ఆర్థిక నష్టం జరుగుతోంది. దేశంలో 1982 నుంచి 2001 మధ్య సంభవించిన సహజ విపత్తుల వల్ల 1,07,813 మంది ప్రాణా లు కోల్పోయారు. సగటున సంవత్సరానికి 5,390 మరణాలు సంభవించాయి. మానవుడు చేపట్టే అభివృద్ధి పోకడల తీవ్రత పరిమితికి మించి కొనసాగితే ‘ఎల్నినో’ లాంటి వా తావరణ మార్పుల తీవ్రత, తరచుదనం పెరిగి భారతదేశంపై కరవు ప్రభావం మరింత ఉధృతమవుతుందని ఐపీసీసీ నివేదిక తెలిపింది.
మాదిరి ప్రశ్నలు
1. విపత్తు పదాన్ని ఏ భాషా పదజాలాల నుంచి గ్రహించారు?
1) గ్రీక్ 2) ఫ్రెంచి
3) లాటిన్ 4) పైవన్నీ
2. విపత్తుల నమోదు కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభమైనట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి?
1) క్రీ.పూ. 450 2) క్రీ.పూ. 470
3) క్రీ.పూ. 430 4) క్రీ.పూ. 420
3. ఏదైనా భౌగోళిక ప్రాంతంలో విపత్తు సంభ వించినప్పుడు కలిగే మార్పు?
1) ప్రకృతి, సమాజ వనరులు
విధ్వంసానికి లోనవుతాయి
2) ధన, ప్రాణ నష్టాలు సంభవిస్తాయి
3) సామాన్య ప్రజల జీవనోపాధి
దెబ్బ తింటుంది
4) పైవన్నీ
4. {పపంచవ్యాప్తంగా తుఫాన్ల ప్రభావానికి ఎంతశాతం భూభాగం లోనవుతోంది?
1) 30 % 2) 21 %
3) 19 % 4) 12 %
5. కిందివాటిలో ప్రకృతి వైపరీత్యం ఏది?
1) కరవు 2) యుద్ధం
3) ఉగ్రవాదం 4) పైవన్నీ
6. {పపంచబ్యాంకు నివేదిక ప్రకారం భారతదేశంలో ఏటా విపత్తుల వల్ల సంభవించే నష్టతీవ్రత దేశ జాతీయ ఆదాయంలో ఎంతశాతం ఉంది?
1) 1 2) 2 3) 3 4) 4
7. భారతదేశంలో ఎంతశాతం భూభాగం భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉంది?
1) 58 2) 68
3) 48 4)12
8. విపత్తు అంటే ‘ఒక సమాజపు సాధారణ నిర్మాణానికి, కార్యకలాపాలకు అంత రాయం కలిగిస్తూ అకస్మాత్తుగా, తీవ్రంగా సంభవించే ఆపద’ అని నిర్వచించింది?
1) ూ్ఖై 2) గిఏై
3) ప్రపంచ బ్యాంక్ 4) ఏషియన్ బ్యాంక్
9. {పపంచవ్యాప్తంగా సంభవించే విపత్తుల వల్ల ఏ ప్రాంతాలు అధికంగా నష్టానికి లోనవుతున్నాయి?
1) లాటిన్ అమెరికా దేశాలు
2) ఆఫ్రికా దేశాలు 3) ఆసియా దేశాలు 4) దక్షిణ అమెరికా దేశాలు
10. 1995 నుంచి 2004 మధ్య ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువసార్లు సంభవించిన విపత్తు ఏది?
1) వరదలు 2) తుఫాన్లు
3) కరవు 4) భూకంపాలు
11. గడిచిన 30 ఏళ్లలో ్కట్ఛఠ్ఛ్టిజీౌ గ్ఛిఛ ్ట్చ్టజీట్టజీఛిట ఖ్ఛఞౌట్ట ప్రకారం విపత్తుల వల్ల భారత దేశంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య?
1) 3,20,000 2) 2,20,000
3) 1,90,039 4) 1,43,039
12. Prevention Web Statistics Report ప్రకారం గడిచిన 30 ఏళ్లలో దేశంలో సంభవించిన విపత్తుల వల్ల ఎన్ని కోట్ల అమెరికన్ డాలర్ల నష్టం జరిగింది?
1) 2800 2) 3800
3) 4800 4) 5800
13. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విపత్తు భరిత ప్రాంతంలో ఉన్నాయి?
1) 25, 2 2) 24, 3
3) 23, 4 4) 27, 2
14. భారతదేశంలో ఎంత భూభాగం తుఫాన్ల ప్రభావిత ప్రాంతంలో ఉంది?
1) 16 % 2) 12 %
3) 8 % 4) 2 %
15. హిమాలయా ప్రాంతాల్లో భూకంపాల తర చుదనం ఎక్కువగా ఉండటానికి కారణం?
1) జలక్రమక్షయం
2) భౌగోళిక విరూపకారక చలనాలు
3) నేల క్రమక్షయం 4) అధిక వర్షపాతం