Injection reaction
-
సూది వేయగానే స్పృహ కోల్పోయి కోమాలోకి
సాక్షి, బెంగళూరు: ముద్దులొలికే పసిపాపకు అప్పుడే నూరేళ్లు నిండాయా? అని తల్లిదండ్రులు తీవ్రంగా విలపించారు. నర్స్ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి మూడు నెలల చిన్నారి కన్నుమూసినట్లు తెలిసింది. ఈ ఘటన బెళగావి జిల్లా గోకాక్ తాలూకా హుణశ్యాళ పీజీ గ్రామంలో శనివారం జరిగింది. చిన్నారికి జ్వరం వస్తే చూపిద్దామని అంగన్వాడీ సెంటర్‌కు తీసుకొచ్చారు. అక్కడి నర్స్ పెంటాపెస్ట్ అనే ఇంజెక్షన్‌ను పాపకు ఇచ్చింది. సూది వేసిన వెంటనే చిన్నారి స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లిపోయిందని, తర్వాత కొంత సేపటికి మరణించిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. సాధారణంగా అంటువ్యాధులు వచ్చినప్పుడు మాత్రమే పెంటాపెస్ట్ ఇంజెక్షన్ ఇస్తారని, జ్వరం వచ్చినప్పుడు ఉపయోగించరని, కానీ ఈ నర్స్ చేసిన పనికి తమ చిన్నారిని పోగొట్టుకున్నట్లు వారు ఆరోపించారు. గోకాక్‌లోని ఆస్పత్రిలో చిన్నారి మృతదేహాన్ని తీసుకొచ్చి ఆందోళన చేశారు. నర్స్ నిర్లక్ష్యం వల్లే తమ శిశువు మరణించిందని విలపించారు. చదవండి: టీచర్‌కు అయిదేళ్ల జైలు తనకు దక్కదని.. మరెవరికీ దక్కొద్దని.. -
నెల రోజుల్లో పెళ్లి ఉందనగా ఘోరం..
విశాఖపట్నం, అనకాపల్లిటౌన్: స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయంలో ఇంజక్షన్ వికటించి ఓ యువకుడు మృతి చెందా డు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతుని బంధువులు వైద్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేశారు.మృతుని కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సిరసపల్లి గ్రామానికి చెందిన డి.గోవింద్ (27) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కూలి పనుల్లో భాగంగా గొర్లివానిపాలెంలో గత నెల 27న మట్టి పని చేస్తుండగా పెద్ద బండరాయి వచ్చి కాలుపై పడడంతో తీవ్ర గాయమైంది. బంధువుల సాయంతో అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో చేరాడు. ఈనెల 31న వైద్యులు గోవిం ద్ కాలుకి ఆపరేషన్ చేశారు. మంగళవారం ఉదయం కాలు నొప్పిగా ఉంద ని చెప్పడంతో వైద్యులు ఇంజక్షన్ చేశా రు. ఇంజక్షన్ ఇచ్చిన పదినిమిషాలకు మృతి చెందినట్టు బంధువులు తెలిపా రు. మే 19న గోవింద్‌కు వివాహం చే యాలనినిశ్చియించామని, ఈలోగానే ఇంత ఘోరం జరిగిపోయిందని మృతుని బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ వైద్యాలయం ముందు ఆందోళన చేశారు. ఈవిషయం తెలు సుకున్న రూరల్ పోలీసులు రంగంలోకి దిగారు. అనంతరం పోలీసుల సమక్షంలో కుటుంబసభ్యులు, వైద్యుల మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో సమస్య కొలిక్కివచ్చింది. -
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందజేయాలి
కొత్తూరు : రిమ్స్ ఆస్పత్రిలో రోగులకు వేసిన ఇంజెక్షన్ వికటించి మృతి చెందిన ముగ్గురువి ప్రభుత్వ హత్యలేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి అన్నారు. కొత్తూరులో ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పేదలకు కార్పోరేట్ వైద్యం అందుబాటులో అందించేందుకు దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జిల్లా కేంద్రంలో రిమ్స్‌ను ఏర్పాటు చేశారన్నారు. అయితే దివంగత నేత ఏ లక్ష్యంతో రిమ్స్ ఏర్పాటు చేశారో ఆందుకు భిన్నంగా నేటి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. వైద్యాన్ని ప్రభుత్వం కేవలం వ్యాపారంగా మార్చిందని రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కరువు మందుల కంపెనీలతో పాలక పక్షం నేతలు కుమ్ముక్కైనందున వలనే కల్తీ మందులు, నాసిరకం మందులు ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా అవుతున్నాయన్నారు. రిమ్స్‌లో సరైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించడం లేదని చెప్పారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేక పోవడం వలనే ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు. నాణ్యతలేని మందులు సరఫరా వలనే ప్రాణాలు పోవడంతో ప్రభుత్వ ఆస్పత్రిలు అంటే ప్రజల్లో భయపడే విధంగా ప్రభుత్వం తయారు చేసిందన్నారు. ఇంజెక్షన్ వికంటించి మృతి చెందిన వారిలో పాతపట్నం నియోజవర్గం పరిధి కొత్తూరు మండలం కాశీపురానికి చెందిన ఇస్సై శైలు మృతి చెందినట్టు చెప్పారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ.20 లక్షలు ఎక్స్ గ్రేషియో చెల్లించాలని రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. అదే విధంగా అస్వస్థతకు గురైన వారికి లక్ష రూపాయలు చెల్లించాలన్నారు. కల్తీ మందులు వలనే ముగ్గురు మృతి చెందా రన్నారు. ప్రభుత్వం బాధ్యత వహించి మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని రెడ్డి శాంతి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. వైద్యాన్ని ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్‌పరం చేసి సర్కార్ వైద్యాన్ని పట్టించుకోకపోవడం వల్లే పేదలు ప్రాణాలు పిట్టలు రాలిపోతున్నా, పాలకులకు పట్టడం లేదని రెడ్డి శాంతి అన్నారు. మృతి చెందిన మూడు రోజులు గడుస్తున్నా మృత దేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. మూడు రోజులుగా మృత దేహాల కోసం ఆస్పత్రి చుట్టూ కుటుంబ సభ్యులు తిరుతున్నా అప్పగించక పోవడం దారుణమన్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. -
పసిపాపను బలిగొన్న ఇంజక్షన్
నిండా రెండు నెలలు కూడా లేని ఓ ముద్దులొలికే చిన్నారిని ఇంజక్షన్ కాటేసింది. మొదటి సంతానంగా ఆ తల్లిదండ్రులకు కూతురు జన్మించగా.. సరస్వతి మాత పుట్టిందనుకున్నారు. రెండో సంతానంగా కూడా పాపే జన్మించడంతో లక్ష్మీదేవి వచ్చిందనుకున్నారు. కానీ వారి ఆశలు ఆవిరయ్యాయి. 45 రోజుల వారి చిన్నారి ఇంజక్షన్ వికటించి మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం. పెద్దపల్లి, ఇల్లందకుంట(హుజూరాబాద్): ఇల్లందకుంట మండలకేంద్రంలో నివాసముంటున్న అప్పాల విజయ్–హారిక దంపతులు. వీరికి ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కుతూరు రియా. చిన్నమ్మాయి నెల క్రితం అమావాస్య రోజున జన్మించింది. ప్రతిరోజు అంగన్వాడీ సెంటర్లో సరుకులు తీసుకునేందుకు తల్లి హారిక వెళ్తుంది. ఈక్రమంలో బుధవారం ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పని చేసే ఆశ కార్యకర్త చిన్నారికి ఇంజక్షన్ ఇప్పించాలని, తీసుకురావాలని తెలిపింది. దీంతో తల్లి హారిక తన మరిది వినయ్‌ను తీసుకొని ఆసుపత్రికి వెళ్లింది. మొదట సులోచన అనే ఆశ కార్యకర్త పోలియో చుక్కలను వేసింది. తర్వాత రెండో ఏఎన్ఎంలు సునీత, అరుణ పెంటావ్యాక్సినేషన్ చేశారు. అప్పటికి పాప ఏడుస్తుండడంతో ఏమి కాదంటూ ఇంజక్షన్ చేశారు. ఇంటికి తీసుకెళ్లి పడుకోబెట్టారు. కొద్ది సమయం తరువాత పాప తలకు నూనె పెట్టేందుకు ఎత్తుకోగా.. చలనం లేకపోవడంతో వెంటనే జమ్మికుంట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చలనం లేదని, ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. తన పాప మృతికి కారణం వైద్య సిబ్బందే అంటూ కుటుంబసభ్యులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది అక్కడినుంచి పరారయ్యారు. రెండు గంటలపాటు.. చిన్నారి మృతికి కారణమైన వైద్య సిబ్బందిని తొలగించాలంటూ ఇల్లందకుంట ప్రధాన దారిపై గ్రామస్తులు దాదాపు రెండు గంటలపాటు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఎస్సై నరేష్, తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి విషమించడంతో ఆర్డీఓతోపాటు జిల్లా వైద్యాధికారికి సమాచారం అందించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జమ్మికుంట సీఐ ప్రశాంత్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గతంలోనూ.. 3సంవత్సరాల క్రితం తన పెద్ద కుతూరు లక్కీ(రియా)కి కూడా ఈ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించిందని, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాప్రాయం తప్పిందని తండ్రి విజయ్ తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది సరిగా ఉండడం లేదని, ఇష్టారాజ్యంగా.. దురుసుగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. -
ఇంజక్షన్లు వికటించాయా!
గాంధీలో ఇద్దరు రోగుల మృతి ⇒ ఇంజక్షన్ వికటించడం వల్లే చనిపోయారంటున్న బంధువులు ⇒ ఆస్పత్రి ప్రాంగణంలో ఆందోళన.. లిఖితపూర్వకంగా ఫిర్యాదు ⇒ కార్డియాక్ అరెస్ట్ వల్లే వారు చనిపోయారని వైద్యుల వివరణ ⇒ ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపిస్తా..: సూపరింటెండెంట్ హైదరాబాద్: ఇంజక్షన్ వికటించడంతో ప్లాస్టిక్ సర్జరీ వార్డులో చికిత్స పొందుతున్న తమవారు చనిపోయారంటూ బుధవారం గాంధీ ఆస్పత్రి వద్ద మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. అయితే, కార్డి యాక్ అరెస్ట్ వల్లే వారిద్దరూ చనిపోయి నట్లు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థ లో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తు న్న వనపర్తికి చెందిన కోక నరేశ్(17) జనవరి 17న ప్రమాద వశాత్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రగాయాలతో బాధపడుతున్న అతనిని చికిత్స కోసం గాంధీలో చేర్చారు. అతని శరీరంలో 15 శాతం కాలిపోయినట్లు గుర్తించిన వైద్యులు.. ఆ మేరకు బర్నింగ్ వార్డులో చేర్చుకుని పలు దఫాలుగా చికిత్సలు అందించారు. నరేశ్ కోలుకోవడంతో నాలుగు రోజుల్లో అతనిని డిశ్చార్జి చేయాల్సి ఉంది. బుధవారం ఉదయం తొమ్మిదిన్నరకు నరేశ్‌కు ఇంజక్షన్ ఇవ్వగా.. ఆ తర్వాత అర గంటకే అతను చనిపోయాడు. ఇదిలా ఉంటే 60 శాతం కాలిన గాయాలతో బాధపడుతూ మూడు రోజుల నుంచి ఇదే వార్డులో చికిత్స పొందుతున్న కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన భారతి కూడా చనిపోయింది. నర్సింగ్ సిబ్బంది వచ్చి మూడు ఇంజక్షన్లు ఇచ్చారని, ఆయా ఇంజక్షన్లు వికటిం చడం వల్లే నరేశ్, భారతి మృతిచెందారని ఆరోపిస్తూ వారి బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. ఇన్చార్జి సూపరిం టెండెంట్ డాక్టర్ బీవీఎస్ మంజులను కలసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. గాంధీ ఆస్పత్రిలో పురుగు అవశే షాలు ఉన్న సెలైన్ ఎక్కించడంతో ఇటీవల ఓ చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందిన విషయం తెలిసిందే. కార్డియాక్ అరెస్ట్ వల్లే..: వైద్యులు గాంధీలో ఇద్దరు రోగుల మృతి ఘటనలో వైద్యపరమైన నిర్లక్ష్యం ఏమీ లేదని ఆస్పత్రి ఇంచార్జీ సూపరింటెండెంట్ డాక్టర్ మంజుల స్పష్టం చేశారు. ఎలక్ట్రికల్ షాక్ తగిలినవారికి గుండె సంబంధ సమస్యలు ఉత్పన్నమవు తాయని, దీన్నే వైద్య పరిభాషలో ఎరిథిమియా అంటారని, నరేశ్ కార్డియాక్ అరెస్ట్(గుండె ఆగిపోవడం)తోనే మృతిచెందినట్లు ప్రాథమిక పరిశీలనలో తేలిందని వివరించారు. 60 శాతం కాలిన గాయాలతో చికిత్సపొందుతున్న భారతి యాస్ప్రేషన్ నిమోనియాతో మృతిచెం దిందని, కాలిన గాయాలు త్వరితగతిన మానేందుకు అవసరమైన యాంటీ బయోటిక్స్ అందించేందుకు పెంటా ప్రోజోల్, రాన్ట్యాక్ వంటి ఇంజక్షన్లు ఇస్తుంటామని, ప్రతిరోజు మాదిరిగానే బుధవారం కూడా ఇవే ఇంజక్షన్లు ఇచ్చారని చెప్పారు. ఒకవేళ ఇంజక్షన్లు వికటిస్తే వార్డులో చికిత్స పొందుతున్న మిగిలిన రోగులు కూడా మృతి చెందాలి కాదా? అని ప్రశ్నించారు. ఇంజక్షన్ వికటించిందనే ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ అంశంపై సమగ్ర విచారణ చేసి, ఒకవేళ వైద్యపరమైన నిర్లక్ష్యం, ఇంజక్షన్లలో లోపం ఉన్నట్లైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె ప్రకటించారు. -
వైద్య విద్వంసం