మృతుని బంధువులతో మాట్లాడుతున్న రూరల్ ఎస్‌ఐ ఆదినారాయణరెడ్డి
విశాఖపట్నం, అనకాపల్లిటౌన్: స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయంలో ఇంజక్షన్ వికటించి ఓ యువకుడు మృతి చెందా డు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతుని బంధువులు వైద్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేశారు.మృతుని కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సిరసపల్లి గ్రామానికి చెందిన డి.గోవింద్ (27) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కూలి పనుల్లో భాగంగా గొర్లివానిపాలెంలో గత నెల 27న మట్టి పని చేస్తుండగా పెద్ద బండరాయి వచ్చి కాలుపై పడడంతో తీవ్ర గాయమైంది. బంధువుల సాయంతో అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో చేరాడు. ఈనెల 31న వైద్యులు గోవిం ద్ కాలుకి ఆపరేషన్ చేశారు.
మంగళవారం ఉదయం కాలు నొప్పిగా ఉంద ని చెప్పడంతో వైద్యులు ఇంజక్షన్ చేశా రు. ఇంజక్షన్ ఇచ్చిన పదినిమిషాలకు మృతి చెందినట్టు బంధువులు తెలిపా రు. మే 19న గోవింద్‌కు వివాహం చే యాలనినిశ్చియించామని, ఈలోగానే ఇంత ఘోరం జరిగిపోయిందని మృతుని బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ వైద్యాలయం ముందు ఆందోళన చేశారు. ఈవిషయం తెలు సుకున్న రూరల్ పోలీసులు రంగంలోకి దిగారు. అనంతరం పోలీసుల సమక్షంలో కుటుంబసభ్యులు, వైద్యుల మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో సమస్య కొలిక్కివచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment