రేవంత్.. ఖైదీ నెంబర్ మారింది
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఖైదీ నెంబర్ 4170 కేటాయించారు. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డిని మంగళవారం సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. అనంతరం ఆయనకు చర్లపల్లి జైలులో ఖైదీ నెంబర్ 4170 కేటాయించినట్టు జైలు అధికారులు పేర్కొన్నారు. అంతకు ముందు చంచల్‌గూడ జైలులో 14 రోజుల రిమాండులో ఉన్న రేవంత్‌కు 1779 కేటాయించారు.
అయితే చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్న ఆయనను చర్లపల్లి జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టులో అధికారులు రిక్విజిషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో చర్లపల్లి జైలుకు మార్చి.. అక్కడ కొత్త ఖైదీ నెంబరు ఇచ్చారు.