Innovate in India
-
'సహస్రనామం' సమ్మోహన విజయం!
‘ఎడారిలో రెయిన్ కోట్లు అమ్మకూడదు’ అనేది వ్యాపారానికి సంబంధించి అప్రకటిత ప్రాథమిక సూత్రం! ఎక్కడ ఏది అవసరమో అది అందుబాటులోకి తీసుకువచ్చినప్పుడే ఎంటర్ప్రెన్యూర్ గెలుపు జెండా ఎగరేయగలడు. సంప్రదాయ విధానాలకు భిన్నంగా సంస్థలకు సంబంధించిన డేటా–ఎనాలటిక్స్ ప్రాసెస్‌ను సులభతరం చేయడానికి, కాలాన్ని, ఖర్చును తగ్గించడానికి ఏఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో ఏఐ స్టార్టప్‌లకు ప్రాధాన్యత పెరిగింది. చెన్నైకి చెందిన అజిత్ సహస్రనామం ఏఐ స్టార్టప్ ‘ఆన్‌గిల్’తో విజయం సాధించాడు. ‘రైట్ మోడల్ అనేది ముఖ్యం’ అంటున్న అజిత్ స్టార్టప్ కలల యువతరం రోల్మోడల్స్లో ఒకరిగా నిలిచాడు. 'ప్రాసెసింగ్ ఆఫ్ డేటా’కు సంబంధించి వివిధ సంస్థలకు రకరకాల సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఐఏ) సాంకేతికత డేటా–డ్రైవెన్ మెథడాలజీలతో ఖర్చును తగ్గిస్తుంది. టైమ్ సేవ్ చేస్తోంది. రిపోర్ట్స్ తయారీని సులభతరం చేస్తోంది. అందుకే ఇప్పుడు ఏఐ స్టార్టప్‌లకు ప్రాధాన్యత పెరిగింది. ‘ఒకప్పుడు రోజుల్లో మాత్రమే పూర్తయ్యే పని ఇప్పుడు నిమిషాల వ్యవధిలో పూర్తవుతుంది’ అంటున్నాడు ఏఐ స్టార్టప్ ‘ఆన్‌గిల్’ ఫౌండర్, సీయీవో అజిత్. ఒక్క మాటలో చెప్పాలంటే డేటా ఆధారిత నిర్ణయాలకు సంబంధించి ఏఐ–డ్రైవెన్ సొల్యూషన్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయి. బిజినెస్ ప్రాసెస్‌కు డైనమిక్ లుక్ ఇస్తున్నాయి. కొన్ని నెలల క్రితం బెంగళూరులో జరిగిన ఎర్లీ–స్టేజ్ స్టారప్ ఫౌండర్స్ సమావేశంలో స్టారప్ ప్రయాణ ప్రారంభంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో వివరంగా చెప్పాడు అజిత్ సహస్రనామం. ‘రైట్ మోడల్ లేకుండా ఎలా ముందుకు వెళ్లగలం?’ అంటాడు అజిత్. రైట్ మోడల్ మాట ఎలా ఉన్నా స్టార్టప్ కలల యువతరం ‘రోల్ మోడల్స్’లో అజిత్ సహస్రనామం ఒకరు. ఏఐ స్టార్టప్ ‘ఆన్‌గిల్’ ఫౌండర్, సీయివోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అజిత్. ఇన్స్టంట్ మెసేజింగ్ ΄ప్లాట్‌ఫామ్ ‘ఆన్‌గిల్’ పరిశ్రమలకు సంబంధించి డేటా కలెక్షన్ నుంచి ఇన్సైట్స్ వరకు ఎనాలటిక్స్ టాస్క్‌లను వేగవంతం చేస్తుంది. ‘ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లు అందుబాటులో ఉన్న మోడల్స్‌పై ఆధారపడడం అనేది ఒక విధానం. రెండోది పబ్లిక్ సోర్స్ శాంపిల్స్ ద్వారా సొంత డేటా తయారుచేసుకోవడం. అన్నిటికంటే పెద్ద సవాలు యూజర్స్ ఓకే అనేలా ప్రొడక్ట్‌ను బిల్డ్ చేయడం’ అంటాడు అజిత్. ‘ఆన్‌గిల్’ సాధించిన విజయం ఏమిటి? 2017లో ప్రారంభమైన ‘ఆన్‌గిల్’ రియల్–టైమ్ విజువలైజేషన్, ప్రిడెక్టివ్ ఎనాలటిక్స్ ఫీచర్ల ద్వారా పరిశ్రమలకు సంబంధించి ఎనాలటిక్స్ టాస్క్‌లను వేగవంతం చేస్తోంది. 2025 నాటికి మన దేశంలో ఏఐ మార్కెట్ మరింతగా విస్తరించనుంది అని నిపుణులు చెబుతున్నారు. డొమెస్టిక్ ఏఐ మార్కెట్లోకి యువతరం సారథ్యంలో మరెన్నో స్టార్టప్‌లు అడుగు పెట్టనున్నాయి. ఔత్సాహికులకు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ల మాటలే పాఠాలు అవుతాయి. ‘ఆన్‌గిల్’తో విజయం సాధించిన అజిత్ సహస్రనామం నోటి మాటల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. -
స్టార్టప్స్ కోసం ఇన్ఫోసిస్ భారీ ఫండ్...
న్యూఢిల్లీ: స్టార్టప్ సంస్థలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు 250 మిలియన్ డాలర్లతో(సుమారు రూ. 1,550 కోట్లు) సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ‘ఇన్నోవేట్ ఇన్ ఇండియా’ ఫండ్ ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీతో బుధవారం భేటీ అయిన అనంతరం ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా ఈ విషయం తెలిపారు. కొత్త తరం టెక్నాలజీలు, నూతన ఆవిష్కరణలపై పనిచేసే చిన్న సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ ఫండ్‌ను ఉద్దేశించినట్లు ఆయన వివరించారు. ప్రధాని ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమానికి తమ వంతు తోడ్పాటు అందిస్తామన్నారు. మరోవైపు, స్మార్ట్ సిటీల నిర్మాణానికి అవసరమైన సహకారం కూడా పట్టణాభివృద్ధి శాఖకు అందిస్తామని సిక్కా చెప్పారు. తమ మైసూర్ క్యాంపస్‌ను మోడల్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని ఆయన వివరించారు. 350 ఎకరాల్లో విస్తరించిన క్యాంపస్‌ను ఏప్రిల్‌కల్లా స్మార్ట్‌గా మార్చి.. పట్టణాభివృద్ధిలో కొత్త పోకడలను ఆవిష్కరిస్తామన్నారు. నిర్మాణాల్లో అత్యాధునిక టెక్నాలజీని, ఐటీని ఉపయోగించడం ద్వారా విద్యుత్, ఇతర వనరుల వినియోగాన్ని, వ్యర్థాలను తగ్గించాలన్నది స్మార్ట్ సిటీల ఏర్పాటు ప్రధానోద్దేశమని సిక్కా పేర్కొన్నారు.