ఉపగ్రహంతో మంటలను గుర్తించొచ్చు!
న్యూఢిల్లీ: పొలాల్లో పంట వ్యర్థాలను దగ్ధం చేస్తున్నప్పుడు వచ్చే మంటలను ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించే సామర్థ్యం భారత్కు సమకూరనుంది. ఇన్ శాట్–3డీఆర్ ఉపగ్రహంతో ఇది సాధ్యం కానుంది. మేఘాలు, పొగమంచ తదితరాలను రాత్రుళ్లు కూడా గమనించడానికి ప్రస్తుతం ఇది ఉపయోగపడుతోంది. పంట వ్యర్థాలను కాలుస్తున్న చిత్రాలను తీసే పరిజ్ఞానాన్ని దీనికి జోడించనున్నారు. ఢిల్లీలో అక్టోబర్, నవంబర్లలో వాయు కాలుష్యం పెరిగిపోతుంది. పంజాబ్, హరియాణా రైతులు పంట వ్యర్థాలను కాల్చడమే ఇందుకు కారణమని కొందరు వాదిస్తున్నారు. కాలుష్యానికి అసలు కారణం నిర్ధారించడానికి ఈ ఉపగ్రహం దోహదపడనుంది.