insider book
-
India vs England test: 18 నుంచి టికెట్ల విక్రయం
సాక్షి, హైదరాబాద్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఈనెల 25 నుంచి 29 వరకు ఉప్పల్ స్టేడియంలో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను ఈనెల 18 నుంచి ఆన్లైన్లో విక్రయిస్తారు. పేటీఎం ఇన్సైడర్ యాప్‌లో, www.insider.in వెబ్సైట్లో రాత్రి 7 గంటల నుంచి టికెట్లు లభిస్తాయని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ఆదివారం ప్రకటించారు. మిగిలిన టికెట్లను ఈనెల 22 నుంచి ఆఫ్‌లైన్‌లో సికింద్రాబాద్ జింఖానా మైదానంలో విక్రయిస్తామని ఆయన వివరించారు. టికెట్ల ధరలను ఒక్కో రోజుకు రూ. 200, రూ. 499, రూ. 750, రూ. 1250, రూ. 3000 (కార్పొరేట్ బాక్స్ నార్త్), రూ. 4000 (కార్పొరేట్ బాక్స్ సౌత్)గా నిర్ణయించారు. ఐదు రోజుల సీజన్ టికెట్ల ధరలను రూ. 600, రూ. 1500, రూ. 2250, రూ. 3750, రూ. 12000 (కార్పొరేట్ బాక్స్ నార్త్), రూ. 16000 (కార్పొరేట్ బాక్స్ సౌత్)లుగా నిర్ణయించారు. ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన వారు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి 22వ తేదీ నుంచి జింఖానా మైదానంలో టికెట్లను రీడీమ్ చేసుకోవాలి. -
‘ఇన్సైడర్’ను పాఠ్యాంశంగా పెట్టాలి : ప్రొఫెసర్ జి.హరగోపాల్
వరంగల్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఇన్సైడర్ పుస్తకంలో ఆయన అంతరాత్మను ఆవిష్కరించారని ప్రొఫెసర్ జి.హరగోపాల్ తెలిపారు. నవలగా రాసినప్పటికీ అందులో తన గురించి, తాను చేయలేని వాటి గురించి, తాను ఎదుర్కొన్న పలు అంశాలను పాత్రల రూపంలో వివరించారన్నారు. దీన్ని రాజనీతిశాస్త్ర విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టాలని కోరారు. పీవీ నర్సింహారావు నాలుగో ఎండోమెంట్ లెక్చర్ వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో మంగళవారం జరిగింది. ‘నాలెడ్జ్, పాలిటిక్స్, ప్లాటోస్ ఫిలాసఫర్ కింగ్’ అంశంపై ఆయన ప్రసంగించారు.భూపంపిణీ, భూసంబంధాలతో మానవ సంబంధాలు మారుతాయని నాడు సీఎంగా ఉన్న పీవీ విశ్వసించారన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో భూ సంస్కరణలకు ఉపక్రమించగా వ్యతిరేక శక్తులు జై ఆంధ్ర ఉద్యమాన్ని లేవదీశాయన్నారు. చివరకు పీవీని సీఎం పదవి నుంచి నాటి ప్రధాని ఇందిరాగాంధీ తొలగించారన్నారు. కేంద్ర విద్యాశాఖమంత్రిగా నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టేందుకు యత్నిస్తుండగా అప్పటి ప్రధాని రాజీవ్ ఆయనను విద్యాశాఖ నుంచి విదేశీ వ్యవహారాల శాఖకు మార్చారని పేర్కొన్నారు. దీంతో పీవీ తాను అనుకున్న మార్పులు చేయలేకపోయారన్నారు. ఆ రోజుల్లో ఆయన రాజీవ్ తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీని ఇటీవల సీఎం కేసీఆర్ సందర్శించడం, ఈ కట్టడం అద్భుతంగా ఉందని కితాబు ఇవ్వడాన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నారు. ఒకప్పుడు నాగళ్లతో దున్నిస్తామన్న వారే ఇలా చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. పీవీ ఎండోమెంట్ ట్రస్టు చైర్పర్సన్, పీవీ కుమార్తె సురభీ వాణి మాట్లాడుతూ తన తండ్రికి ఎంతో ఇష్టమైన విద్యారంగంలో తమ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.