‘ఇన్‌సైడర్’ను పాఠ్యాంశంగా పెట్టాలి : ప్రొఫెసర్ జి.హరగోపాల్ | insider keep as the subject | Sakshi
Sakshi News home page

‘ఇన్‌సైడర్’ను పాఠ్యాంశంగా పెట్టాలి : ప్రొఫెసర్ జి.హరగోపాల్

Published Wed, Dec 17 2014 4:41 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

‘ఇన్‌సైడర్’ను పాఠ్యాంశంగా పెట్టాలి : ప్రొఫెసర్ జి.హరగోపాల్

‘ఇన్‌సైడర్’ను పాఠ్యాంశంగా పెట్టాలి : ప్రొఫెసర్ జి.హరగోపాల్

వరంగల్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఇన్‌సైడర్  పుస్తకంలో ఆయన అంతరాత్మను ఆవిష్కరించారని ప్రొఫెసర్ జి.హరగోపాల్ తెలిపారు. నవలగా రాసినప్పటికీ అందులో తన గురించి, తాను చేయలేని వాటి గురించి, తాను ఎదుర్కొన్న పలు అంశాలను పాత్రల రూపంలో వివరించారన్నారు. దీన్ని రాజనీతిశాస్త్ర విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టాలని కోరారు. పీవీ నర్సింహారావు నాలుగో ఎండోమెంట్ లెక్చర్ వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో మంగళవారం జరిగింది. ‘నాలెడ్జ్, పాలిటిక్స్, ప్లాటోస్ ఫిలాసఫర్ కింగ్’ అంశంపై ఆయన ప్రసంగించారు.భూపంపిణీ, భూసంబంధాలతో మానవ సంబంధాలు మారుతాయని నాడు సీఎంగా ఉన్న పీవీ విశ్వసించారన్నారు.

ఈ మేరకు రాష్ట్రంలో భూ సంస్కరణలకు ఉపక్రమించగా వ్యతిరేక శక్తులు జై ఆంధ్ర ఉద్యమాన్ని లేవదీశాయన్నారు. చివరకు పీవీని సీఎం పదవి నుంచి నాటి ప్రధాని ఇందిరాగాంధీ తొలగించారన్నారు. కేంద్ర విద్యాశాఖమంత్రిగా నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టేందుకు యత్నిస్తుండగా అప్పటి ప్రధాని రాజీవ్ ఆయనను విద్యాశాఖ నుంచి విదేశీ వ్యవహారాల శాఖకు మార్చారని పేర్కొన్నారు. దీంతో పీవీ తాను అనుకున్న మార్పులు చేయలేకపోయారన్నారు.

ఆ రోజుల్లో ఆయన రాజీవ్ తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీని ఇటీవల సీఎం కేసీఆర్ సందర్శించడం, ఈ కట్టడం అద్భుతంగా ఉందని కితాబు ఇవ్వడాన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నారు. ఒకప్పుడు నాగళ్లతో దున్నిస్తామన్న వారే ఇలా చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. పీవీ ఎండోమెంట్ ట్రస్టు చైర్‌పర్సన్, పీవీ కుమార్తె సురభీ వాణి మాట్లాడుతూ తన తండ్రికి ఎంతో ఇష్టమైన విద్యారంగంలో తమ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement