Insisted
-
ప్రకాశం జిల్లాలో కొండచిలువ కలకలం
-
చిత్తూరులో స్వైన్‌ఫ్లూ కలకలం
-
కరీంనగర్లో కిడ్నాప్ కలకలం
-
మళ్లీ చిరుత కలకలం
చిరుత దాడిలో దూడ మృతి దేవాలయ గుర్రంపైనా దాడిచేసి గాయపరచిన వైనం వజ్రకరూరు : గూళ్యపాళ్యంలో చిరుత సంచారం మళ్లీ కలకలం రేపింది. గ్రామానికి చెందిన కేశప్పకు చెందిన దూడను చిరుత చంపేసింది. శనివారం రాత్రి కూడా లాలుస్వామి దేవాలయానికి చెందిన గుర్రంపై చిరుత దాడిచేసి గాయపరచినట్లు గ్రామస్తులు తెలిపారు. ఏ సమయంలో చిరుత గ్రామంలోకి ప్రవేశిస్తుందోనన్న ఆందోళన నెలకొంది. పది రోజుల క్రితం కూడా చిరుత గ్రామ సమీపంలో ఉన్న కొండపై కూర్చుని అటు ఇటు తిరిగిన దృశ్యాలను గుర్తించారు. ఇప్పుడు మరోసారి దూడను చంపడం, గుర్రంపై దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. చిరుత సంచరిస్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డిలు అటవీ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. డీఎఫ్ఓ చంద్రశేఖర్, గుత్తి ఫారెస్టు రేంజర్ డేవిడ్ తదితరులకు చిరుత సంచారం గురించి వివరించారు. గ్రామస్తులకు భరోసా కల్పించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ సూచనలతో అసిస్టెంట్ ఫారెస్టు బీట్ అధికారి నాగ్యనాయక్, వెటర్నరీ అసిస్టెంట్ భద్రు నాయక్, వైల్డ్ ఫీల్డ్ వాచర్ రాజశేఖర్ నాయక్ గ్రామంలో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. పరిశీలిస్తామని వారు హామీ ఇచ్చారు. -
నకిలీ నోటు కలకలం
చిలుకూరు: చిలుకూరులో నకిలీ రూ. 500 నోట్లు మంగళవారం కలకలం సృష్టించింది. పెట్రోల్ బంక్‌లో ఈ నకిలీ నోట్లు వచ్చినట్లుగా పలువురు తెలిపారు. రూ. 500 నోట్లు చెల్లకపోడంతో బ్యాంక్‌కు తీసుకెళ్లారు. బ్యాంకు అధికారులు వాటిని న కిలీ నోట్లుగా గుర్తించినట్లుగా తెలిపారు. పోలీసులు ఈ విషయంపై విచారణ చేసి ఈ నకిలీ నోట్లు వ్యవహారం భయటపెట్టాలని పలువురు ప్రజలు కోరుతున్నారు. -
రేగులపల్లిలో చిరుత కలకలం
బెజ్జంకి : మండలంలోని రేగులపల్లిలో చిరుత కలకలం సృష్టిస్తోంది. పదిహేను రోజులుగా వ్యవ«ధిలో మూడు గొర్రెల చిరుత అపహరించుకుపోయింది. గ్రామంలోకి చిరుత వస్తున్నా ఫారెస్ట్ అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేగులపల్లి గుట్టకు గొర్రెలను మేత కోసం కాపారులు తీసుకువెళ్తారు. అక్కడే నివాసాలు ఏర్పాటుచేసిన కంచెలో గొర్రెల మందను ఉంచుతారు. రాత్రి సమయాల్లో చిరుత మందపై దాడి చేస్తూ గొర్రెలను ఎత్తుకుపోతోంది. పదిహేను రోజులుగా చిరుత సంచారం ఎక్కువగా కావడంతో స్థానికులు ఆందోళనకు గురువుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. -
స్వైన్‌ఫ్లూ కలకలం
► బోయగూడకు చెందిన నాలుగేళ్ల బాలికకు గాంధీలో చికిత్స ► అనుమానిత స్వైన్‌ఫ్లూ కేసుగా నమోదు.. ఐపీఎంకు నమూనాలు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. నిన్న,మొన్నటి వరకు కలరా, డెంగీ, మలేరియా వంటి జ్వరాలతో సతమతమైన సిటీజన్లు తాజాగా స్వైన్‌ఫ్లూతో బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా బోయగూడకు చెందిన రేవతి(4) తీవ్రమైన జ్వరం, తలనొప్పి, జలుబు వంటి సమస్యలతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు సోమవారం ఆమెను గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అనుమానిత స్వైన్‌ఫ్లూ కేసుగా నమోదు చేసుకుని చికిత్స అందిస్తున్నారు. బాలిక నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ కో సం ఐపీఎంకు పంపారు. ప్రస్తుతం వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల రుస్తున్న ఎడతెరపి లేని వర్షాలు, చలిగాలుల కారణంగా వాతావరణంలో హెచ్1ఎన్1 స్వైన్‌ఫ్లూ కారక వైరస్ బలపడుతోంది. ఇది ఒకరి నుంచి ఒకరికి సులభంగా విస్తరించే అవకాశం ఉండటంతో బస్తీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఎవరికి వారు వ్యక్తిగత శుభ్రత పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిజాలు.. నివారణలు.. ► తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్ గాలిలోకి ప్రవేశిస్తుంది. ► ఇలా ఒకసారి బయటికి వచ్చిన వైరస్ వాతావరణంలో రెండుగంటలకుపైగా జీవిస్తుంది. ► గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఊబకాయులకు వ్యాపించే అవకాశం ఉంది. ► సాధారణ ఫ్లూ జ్వరాలు వచ్చే వ్యక్తిలో కన్పించే లక్షణాలన్నీ స్వేన్‌ఫ్లూ బాధితుల్లో కనిపిస్తాయి. ► ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, తుమ్ములు, కళ్లవెంట నీరుకారడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. ► ముక్కుకు మాస్కు ధరించండంతో పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. ► వీలైనంత ఎక్కువ సార్లు నీళ్లు తాగాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. ► జన సముహ ప్రాంతాలకు వెళ్లక పోవడమే ఉత్తమం. తీర్ధయాత్రలు, ప్రయాణాలు రద్దు చేసుకోవాలి. ► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. ఇతరులకు షేక్‌హ్యాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవడం చేయరాదు. ► చిన్న పిల్లలతో సహా ఎవరినీ ముద్దు పెట్టుకోకూడదు. -
లంగర్ హౌజ్‌లో కిడ్నాప్ కలకలం