నేడు విద్యా సంస్థల బంద్
నల్లగొండ టూ టౌన్ : ప్రసుత్త పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణకు చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మారపాక నరేందర్మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుతాల నాగయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల యాజమాన్యాలు బంద్కు సహకరించాలని కోరారు.