Intensive checks
-
నేడు తిరుమలకు రాష్ట్రపతి
2300 మందితో పటిష్ట భద్రత తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు ముందస్తుగా ముమ్మర తనిఖీలు తిరుపతి క్రైం: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బుధవారం తిరుమలకు రానున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 11.25గంటలకు తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. 11.55గంటలకు తిరుమలకు బయలుదేరుతారు. 12.30గంటలకు తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.35గంటలకు శ్రీవరాహస్వామి దేవాలయానికి వెళ్తారు. 1.55గంటలకు మహాద్వారం గుండా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశిస్తారు. తిరుమలేశుని దర్శనానంతరం తిరిగి పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. సాయంత్రం 4.10గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు పయనమవుతారని అధికార వర్గాల భోగట్టా. రాష్ట్రపతి పర్యటనను దృష్టిలో పెట్టుకుని 2,300 మందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. రాష్ట్రపతి వాహన శ్రేణి వెళ్లే మార్గంలో ముమ్మర తనిఖీ లు చేపట్టారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. లాడ్జీల్లోకూడా సోదాలు చేస్తున్నారు. బందోబస్తులో ముగ్గురు ఏఎస్పీలు, 9మంది డీఎస్పీలు, 25మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 240 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 1,470 మంది పీసీలు, 35 మంది ఉమెన్పీసీలు, 173మంది హోంగార్డులు, స్పెషల్ పార్టీలు, డాగ్‌స్క్వాడ్‌లు, బాంబ్స్క్వాడ్లు, రోప్ పార్టీలు మొత్తం 2,300మంది పాల్గొంటున్నారు. మరోపక్క బాంబ్ స్క్వాడ్ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో మంగళవారం కాన్వాయ్ ట్రైల్రన్ను నిర్వహించారు. ఇందులోమిగతా 2వ పేజీలో u జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్, అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి, తిరుపతి సబ్‌కలెక్టర్ నిషాంత్‌కుమార్, సెక్యూరిటి సిబ్బంది పాల్గొన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా.. ► పుత్తూరు, నెల్లూరు వైపు నుంచి వచ్చి వెళ్లే బస్సులు రేణిగుంట మీదగా రామానుజసర్కిల్, పూర్ణకుంభం సర్కిల్ మీదగా ఆర్టీసీ బస్టాండ్‌కు అనుమతిస్తారు. ►చిత్తూరు, బెంగళూరు, మదనపల్లి నుంచి వచ్చే వెళ్లే బస్సులు పూర్ణకుంభం, టీఎంఆర్ జంక్షన్, లీలామహల్ సర్కిల్, నంది జంక్షన్, గరుడా సర్కిల్, ఎస్వీ జూపార్క్ మీదగా చెర్లోపల్లి నుంచి అనుమతిస్తారు. ►చంద్రగిరి, రంగంపేట వైపునకు వెళ్లే తిరుపతి షేర్ ఆటోలు చెర్లోపల్లి జంక్షన్ నుంచి తుమ్మలగుంట ఉప్పరపల్లి క్రాస్, వైకుంఠపురం ఆర్చ్ నుంచి అనుమతిస్తారు. -
కర్నూలులో హై అలర్ట్
►దొంగల కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ► నగర పోలీసుల పనితీరుపై ఎస్పీ సీరియస్ ►ఐదు స్టేషన్ల పరిధిలో ముమ్మర తనిఖీలు ►బాధితులను కలసి వివరాలు తెలుసుకున్న ఎస్పీ కర్నూలు: వరుస దొంగతనాల నేపథ్యంలో ఎస్పీ ఆకె రవికృష్ణ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. గొలుసు దొంగలు చెలరేగిపోతున్నా పట్టుకోలేకపోతున్నారంటూ నగర పోలీసుల పనితీరుపై ఎస్పీ సీరియస్ అయ్యారు. ఆయన ఆదేశాల మేరకు శివారు కాలనీలపై క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. గురువారం నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్ జరగడంతో ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపారు. 12 టీములను ఏర్పాటు చేసి ఐదుగురు ఎస్ఐలు, ఒక ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో గొలుసు దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. ఇన్చార్జి డీఎస్పీ మనోహర్‌రావు తన ఛాంబర్లో నగర సీఐలతో ప్రత్యేకంగా సమావేశమై నేరాల నియంత్రణపై చర్చించారు. నగర పరిధిలోని మొత్తం 5 పోలీస్స్టేషన్లు ఉండగా, ఒక్కొక్క స్టేషన్ పరిధిలో మూడు టీమ్‌లను నియమించారు. ఎస్ఐల ఆధ్వర్యంలో వాహనాలు, నగరంలోని లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించారు. ఉదయం 5:30 నుంచి 9:30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని సిబ్బంది మొత్తం రోడ్లపైనే ఉండి గస్తీ విధులు నిర్వహించే విధంగా ఎస్పీ ఆదేశించడంతో అధికారులు రోజంతా కాలనీల్లో పర్యటించారు. అర్బన్ తాలుకా సీఐ మధుసూధన్‌రావు బాలాజీనగర్, సంతోష్‌నగర్, నాల్గవ పట్టణ సీఐ రంగనాయకులు ఆధ్వర్యంలో క్రిష్ణానగర్ ప్రాంతంలోను, మూడవ పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్ నంద్యాల చెక్‌పోస్టు నుంచి సీక్యాంప్ సెంటర్ వరకు తన సిబ్బందితో ఇరువైపుల కాలనీల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేసి అనుమానం ఉన్న ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. నెంబర్లు లేని వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. మహిళల మెడలో బంగారు గొలుసులు లాక్కుని వెళ్లే దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటూ ముద్రించిన కరపత్రాలను కాలనీల్లో పర్యటిస్తూ పంపిణీ చేశారు. ఎస్పీ ఆకె రవికృష్ణ, ఓఎస్డీ మనోహర్‌రావు రాత్రి బి.క్యాంప్‌లోని రిటైర్డ్ ఎస్ఐ ఆంజనేయులు, మణెమ్మ దంపతుల ఇంటికి వెళ్లి చైన్ స్నాచింగ్ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా రికవరీ చేయాలంటూ బాధితుడు ఆంజనేయులు ఈ సందర్భంగా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. దొంగలను పట్టుకుని సొమ్ము రికవరీ చేయిస్తానని వారికి ఎస్పీ హామీ ఇచ్చారు.