నేడు తిరుమలకు రాష్ట్రపతి
2300 మందితో పటిష్ట భద్రత
తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు
ముందస్తుగా ముమ్మర తనిఖీలు
తిరుపతి క్రైం: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బుధవారం తిరుమలకు రానున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 11.25గంటలకు తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. 11.55గంటలకు తిరుమలకు బయలుదేరుతారు. 12.30గంటలకు తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.35గంటలకు శ్రీవరాహస్వామి దేవాలయానికి వెళ్తారు. 1.55గంటలకు మహాద్వారం గుండా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశిస్తారు. తిరుమలేశుని దర్శనానంతరం తిరిగి పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. సాయంత్రం 4.10గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు పయనమవుతారని అధికార వర్గాల భోగట్టా.
రాష్ట్రపతి పర్యటనను దృష్టిలో పెట్టుకుని 2,300 మందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. రాష్ట్రపతి వాహన శ్రేణి వెళ్లే మార్గంలో ముమ్మర తనిఖీ లు చేపట్టారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. లాడ్జీల్లోకూడా సోదాలు చేస్తున్నారు. బందోబస్తులో ముగ్గురు ఏఎస్పీలు, 9మంది డీఎస్పీలు, 25మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 240 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 1,470 మంది పీసీలు, 35 మంది ఉమెన్‌పీసీలు, 173మంది హోంగార్డులు, స్పెషల్ పార్టీలు, డాగ్‌స్క్వాడ్‌లు, బాంబ్‌స్క్వాడ్‌లు, రోప్ పార్టీలు మొత్తం 2,300మంది పాల్గొంటున్నారు. మరోపక్క బాంబ్ స్క్వాడ్ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో మంగళవారం కాన్వాయ్ ట్రైల్‌రన్‌ను నిర్వహించారు. ఇందులోమిగతా 2వ పేజీలో u జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్, అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి, తిరుపతి సబ్‌కలెక్టర్ నిషాంత్‌కుమార్, సెక్యూరిటి సిబ్బంది పాల్గొన్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
► పుత్తూరు, నెల్లూరు వైపు నుంచి వచ్చి వెళ్లే బస్సులు రేణిగుంట మీదగా రామానుజసర్కిల్, పూర్ణకుంభం సర్కిల్ మీదగా ఆర్టీసీ బస్టాండ్‌కు అనుమతిస్తారు.
►చిత్తూరు, బెంగళూరు, మదనపల్లి నుంచి వచ్చే వెళ్లే బస్సులు పూర్ణకుంభం, టీఎంఆర్ జంక్షన్, లీలామహల్ సర్కిల్, నంది జంక్షన్, గరుడా సర్కిల్, ఎస్వీ జూపార్క్ మీదగా చెర్లోపల్లి నుంచి అనుమతిస్తారు.
►చంద్రగిరి, రంగంపేట వైపునకు వెళ్లే తిరుపతి షేర్ ఆటోలు చెర్లోపల్లి జంక్షన్ నుంచి తుమ్మలగుంట ఉప్పరపల్లి క్రాస్, వైకుంఠపురం ఆర్చ్ నుంచి అనుమతిస్తారు.