Inter evaluation
-
లాక్డౌన్ ఎత్తేసిన మూడ్రోజుల్లో వ్యాల్యుయేషన్ షురూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తేసిన మూడ్రోజుల్లో ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏదైనా కారణాలతో ఆలస్యమైతే గరిష్టంగా ఏడు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి కొనసాగించాలని పేర్కొంది. ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, జిల్లాల ఇంటర్మీడియెట్ విద్యాధికారులు, ఇతర సీనియర్ అధికారులతో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ జవాబు పత్రాల మూల్యాంకనంపై సమీక్షించారు. మూల్యాంకనానికి 30 రోజుల వరకు సమయం పట్టనున్న నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తేయగానే వీలైనంత త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతమున్న 12 స్పాట్ కేంద్రాలతోపాటు వాటికి సమీపంలోని మరో 24 భవనాల్లో స్పాట్ వ్యాల్యుయేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రాల్లో తగిన శానిటైజేషన్ ఏర్పాట్లు చేయాలని, పేపరు వ్యాల్యుయేషన్ చేసే ఎగ్జామినర్లు భౌతిక దూరం పాటిస్తూ కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఆదేశించారు. అలాగే ఇతర ప్రాంతాలనుంచి వచ్చే ఎగ్జామినర్లు అక్కడే ఉండేలా వసతి ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఒక్కో భవనంలో ఉండే ఎగ్జామినర్లకు వంట చేసేందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఎంసెట్, జేఈఈ, నీట్ కోసం ఉచితంగా వీడియో పాఠాలను అందించేందుకు బోర్డు చేసిన ఏర్పాట్లను చిత్రా రామ చంద్రన్ అభినందించారు. ఈ పాఠాల కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ విద్యార్థులూ దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. చదవండి: కర్ఫ్యూ వేళలు పొడిగిద్దామా! -
ఇంటర్ స్పాట్ విధుల బహిష్కరణ
ప్రెవేటు కళాశాల యాజమాన్యాల నిరసన ఆదిలాబాద్ టౌన్ : ప్రైవేటు జూని యర్ కళాశాలల్లో ట్యూషన్ ఫీజుల ను పెంచాలని, పెండింగ్‌లో ఉ న్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తెలంగాణ ప్రైవేటు జూనియర్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియెషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేటు కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లు ఇంటర్ మూల్యాంకన విధులను బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి స్పాట్ కేంద్రం ఎదుట ధర్నా చేపట్టారు. సాయంత్రం వరకు నిరసన కొనసాగించారు. సమస్యల పరిష్కరానికి ప్రభుత్వం నుంచి హామీ రావడంతో ధర్నా విరమించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణకుమార్ మాట్లాడుతూ, 2014-15 విద్యా సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులకు గురువుతున్నాయని తెలిపారు. స్పాట్ విధులకు హాజరయ్యే ప్రైవేటు కళాశాలల లెక్చరర్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తి రుపతి, కార్యనిర్వహణ కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి భూమేశ్, ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, సంఘ బాధ్యులు పున్నారావు పాల్గొన్నారు. -
జూనియర్ అధ్యాపకులకు జరిమానా
మంచిర్యాల సిటీ: ‘మీరు ఇంటర్ మూల్యాంకనం సరిగా చేయలేదు. విద్యార్థుల జవాబు పత్రాలు సరిగా దిద్దలేదు. జవాబుకు తగిన మార్కులు వేయలేదు. మార్కులను సరిగా కూడకుండా తప్పు వేశారు. మీరు చేసిన తప్పులకు విద్యార్థులు నష్టపోయారు. విద్యార్థులు నష్టపోయినందు కు మీరు బోర్డుకు జరిమానా చెల్లించాలి’ అంటూ ఇంటర్ బోర్డు జూనియర్ అధ్యాపకులకు నోటీసులు జారీ చేసింది. 2015 ఏప్రిల్‌లో మూల్యాంకనానికి హాజరై తప్పు లు చేసిన అధ్యాపకులకు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చాయనే కారణంతో వందల సంఖ్యలో విద్యార్థులు రీవాల్యూయేషన్‌కు వెళ్లడంతో డొల్లతనం బట్టబయలైంది. నిర్లక్ష్యానికి తగిన మూల్యం చెల్లించాల్సిందేనంటూ ఇంటర్ బోర్డు అధికారులు రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు చెందిన(ఱ(ఖమ్మం జిల్లాకు సంబంధించి సమాచారం లభించలేదు) 2,387 మంది అధ్యాపకులకు నోటీసులు జారీ చేసింది. ఒక్కో అధ్యాపకుడికి వారు చేసిన తప్పుల అధారంగా రూ. వెయ్యి నుంచి 15,000 వరకు జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది.