ఇంటర్ స్పాట్ విధుల బహిష్కరణ
ప్రెవేటు కళాశాల యాజమాన్యాల నిరసన
ఆదిలాబాద్ టౌన్ : ప్రైవేటు జూని యర్ కళాశాలల్లో ట్యూషన్ ఫీజుల ను పెంచాలని, పెండింగ్‌లో ఉ న్న ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తెలంగాణ ప్రైవేటు జూనియర్ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియెషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేటు కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లు ఇంటర్ మూల్యాంకన విధులను బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి స్పాట్ కేంద్రం ఎదుట ధర్నా చేపట్టారు. సాయంత్రం వరకు నిరసన కొనసాగించారు.
సమస్యల పరిష్కరానికి ప్రభుత్వం నుంచి హామీ రావడంతో ధర్నా విరమించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణకుమార్ మాట్లాడుతూ, 2014-15 విద్యా సంవత్సరం ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులకు గురువుతున్నాయని తెలిపారు. స్పాట్ విధులకు హాజరయ్యే ప్రైవేటు కళాశాలల లెక్చరర్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తి రుపతి, కార్యనిర్వహణ కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి భూమేశ్, ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, సంఘ బాధ్యులు పున్నారావు పాల్గొన్నారు.