inter state permits
-
గతిశక్తి పోర్టల్‌తో విద్యుత్ పంపిణీ లైన్ల అనుసంధానం
న్యూఢిల్లీ: దేశీయంగా మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చే దిశగా ప్రస్తుతం ఉన్న అన్ని అంతర్రాష్ట్ర పంపిణీ వ్యవస్థ లైన్లను (ఐఎస్టీఎస్) పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ (ఎన్ఎంపీ) పోర్టల్‌కు అనుసంధానం చేసినట్లు కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది. అలాగే, నిర్మాణంలో ఉన్న లైన్లలో 90 శాతం లైన్లను కూడా అనుసంధానించినట్లు వివరించింది. రూట్ సర్వే తర్వాత మిగతా వాటిపై కూడా దృష్టి పెట్టనున్నట్లు విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో లైన్ల ప్లానింగ్, టెండరింగ్, అమలు, అనుమతుల ప్రక్రియలు సులభతరం అవుతాయని వివరించింది. హైవేలు, రైల్వేలు, ఏవియేషన్, గ్యాస్, విద్యుత్ పంపిణీ, పునరుత్పాదక విద్యుత్ తదితర రంగాలను అనుసంధానం చేయడం ద్వారా మౌలిక సదుపాయాల కల్పనను మరింత మెరుగుపర్చే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది ఆక్టోబర్‌లో పీఎం గతిశక్తి ఎన్ఎంపీని ఆవిష్కరించారు. -
అంతర్రాష్ట్ర పర్మిట్లపై చర్చలు నేటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: అంతరాష్ట్ర పర్మిట్లపై ఏపీ, తెలంగాణల మధ్య చర్చలు బుధవారానికి వాయిదా పడ్డాయి. పర్మిట్ల గడువు ఈ నెల 31తో ముగుస్తుండటంతో లారీ యజమానులు, స్టేజి కారియర్లుగా తిరిగే బస్సుల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించి, సింగిల్ పర్మిట్ విధానం కొనసాగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపధ్యంలో మంగళవారం అసెం బ్లీలో ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కోరారు. అయితే ఇరు రాష్ట్రాల అధికారులు, లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో కలిసి బుధవారం తెలంగాణ సచివాలయంలోని రవాణా మంత్రి చాంబర్లో భేటీ అవ్వాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి శిద్ధా రాఘవరావు రవాణా అధికారులతో సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వ వాదనలతో కూడిన నోట్స్, సంబంధిత పత్రాలన్నింటినీ సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. తెలంగాణ వాహనాలు కూడా కాకినాడ పోర్టుకు, నల్లగొండ జిల్లా నుంచి సిమెంటు లోడు లారీలు ఏపీకి వస్తాయని రవాణా అధికారులు మంత్రికి వివరించినట్లు సమాచారం.