Inter-student
-
వరిలో కలుపు తీసే పరికరం
వరి సాగు చేస్తూ కలుపుతీతకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి ఇంటర్ విద్యార్థి సులభంగా కలుపుతీసే పరికరాన్ని అతి తక్కువ ఖర్చుతో రూపొందించి ఇంజనీర్లను సైతం అబ్బురపరుస్తోంది. కోల్‌కతాలోని విజ్ఞానభారతి సహకారంతో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్–2019’లో వ్యవసాయం విభాగంలో ఈ పరికరానికి ప్రధమ బహుమతి లభించింది. ప్రశంసాపత్రం, జ్ఞాపికతోపాటు రూ. 11 వేల నగదు బహుమతిని అందుకున్న అశోక్ రాష్ట్రపతి భవన్లో జరిగే ఆవిష్కరణల ఉత్సవానికి ఎంపికైన నలుగురిలో ఒక్కరుగా నిలవడం విశేషం. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే. తారకరామారావు తదితరుల ప్రశంసలను సైతం అశోక్ అందుకున్నాడు. సృజనాత్మక పరికరం ఆవిష్కరణతో పిన్న వయసులోనే తన ప్రత్యేకతను చాటుకున్న ఆ విద్యార్థి పేరు గొర్రె అశోక్. ఊరు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని అంజలిపురం. మూడెకరాల రైతు గొర్రె నాగరాజు, సావిత్రి దంపతుల కుమారుడైన అశోక్ దేవరకొం డ పట్టణంలో ఒకేషనల్ జూనియర్ కాలేజీలో వ్యవసాయం కోర్సు రెండో సంవత్సరం చదువుతున్నాడు. నాగరాజు తనకున్న మూడెకరాలతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నారు. వరి మాగాణుల్లో కలుపు తీసే వారికి నడుము నొప్పి సమస్యగా మారింది. నడుము వంచాల్సిన పని లేకుండా నిలబడే ముదురు కలుపును సమర్థవంతంగా తీయటం ఎలా? అని అశోక్ ఆలోచించాడు. దీనికి ఏదైనా పరికరం రూపొందించి తమ తల్లిదండ్రులతోపాటు ఇతర రైతులు, వ్యవసాయ కార్మికులు సులువుగా పనులు చేసుకునేందుకు తోడ్పడేలా ఏదైనా పరికరం తయారు చేయాలనుకున్నాడు. ‘నేను తప్ప అందరూ ఇంజినీర్లే’ కోల్‌కతాలో జరిగిన ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్–2019’లో వ్యవసాయం విభాగంలో 120కి పైగా ప్రాజెక్టులను ప్రదర్శించారు. అందులో అశోక్ రూపొందించిన కలుపు తీత పరికరానికి ప్రథమ బహుమతి లభించింది. ‘అక్కడికి వచ్చిన వారందరూ బీటెక్ చదివిన వారే. నేను ఒక్కడినే ఇంటర్ విద్యార్థిని. అయినా నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం, ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ప్రత్యేక ప్రశంసలు తనకు ఎంతో ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగించాయ’ని అన్నాడు అశోక్. తనతోపాటు సైన్స్ ఫెస్టివల్లో పాల్గొనవారు కొందరు సెన్సార్లు అమర్చిన యంత్రాలను తయారు చేశారని, 30–40 వేల రూపాయల ఖరీదైన యంత్ర పరికరాలు తయారు చేశారని అంటూ.. మన దేశంలో 65 శాతం మంది రైతులు చిన్న, సన్నకారు రైతులేనని, అంత ఖరీదైన యంత్ర పరికరాలను మన చిన్న రైతులు ఎలా ఉపయోగించగలరని అశోక్ ప్రశ్నిస్తున్నాడు. ఒంటి చేత్తో కలుపు తీయవచ్చు కూలీలు వరి నాట్లు వేసేటప్పుడు సాళ్లు సాఫీగా రావు, గజిబిజిగా వస్తాయి. అలాంటప్పుడు యంత్రాలతో కలుపు నిర్మూలన సాధ్యం కాదు. తాను తయారు చేసిన పరికరంతో సాళ్లు సరిగ్గా పాటించని వరి పొలంలో కూడా నిలబడి, ఒంటి చేత్తోనే సునాయాసంగా తీసేయవచ్చని, ముఖ్యంగా ముదురు కలుపు మొక్కలను సైతం సులువుగా నిర్మూలించవచ్చని అశోక్ తెలిపాడు. రూ. 250ల తోనే ఈ పరికరాన్ని సుమారు నెల రోజుల క్రితం తయారు చేశానన్నాడు. సైకిల్ బ్రేక్, ఐరన్ రాyŠ (చిన్నపాటి సీకు), ఇనుప కట్టర్లను ఉపయోగించి కలుపు తీత పరికరాన్ని రూపొందించాడు. ఇవన్నీ కూడా స్వల్ప ఖరీదైనవే కాకుండా, పాత ఇనుప సామాన్ల దుకాణాల్లో కూడా దొరుకుతాయన్నాడు. ఒక బ్లేడ్ కిందకు, మరో బ్లేడ్ పైకి ఉండేలా ఏర్పాటు చేయడం వల్ల.. ఈ బ్లేడ్ల మధ్యలో కలుపు మొక్కను ఉంచినప్పుడు కలుపు మొక్క తెగిపోకుండా వేర్లతో సహా పీకడానికి అవకాశం ఉంటుందన్నాడు. సాధారణంగా ముదురు కలుపు మొక్కలను చేతులతో పట్టుకొని పీకినప్పుడు వ్యవసాయ కూలీల చేతులు బొబ్బలు పొక్కుతుంటాయని, తాను రూపొందించిన పరికరంతో ఆ సమస్య ఉండబోదన్నారు. ఇది మూడో ఆవిష్కరణ అశోక్ ఇప్పటికి మూడు ఆవిష్కరణలు వెలువరించాడు. చెవిటి వారికి ఉపయోగపడే అలారాన్ని తయారు చేశాడు. అదేమాదిరిగా, చిన్న రైతులకు నాలుగు రకాలుగా ఉపయోగపడే యంత్ర పరికరాన్ని తయారు చేశాడు. ఇది పత్తి, మిరప పొలాల్లో కలుపు తీయడానికి, విత్తనాలు విత్తుకునే సమయంలో అచ్చు తీయడానికి, ఆరబోసిన ధాన్యాలను కుప్ప చేయడానికి, కళ్లాల్లో గడ్డిని పోగు చేయడానికి ఉపయోగపడుతుంది. దీని ధర రూ. 2 వేలు. అయితే, అప్పట్లో తన ఆవిష్కరణలను ఎవరికి చూపించాలో తెలియలేదన్నాడు. మూడో ఆవిష్కరణను వెలువరించడం, ప్రాచుర్యంలోకి తేవడానికి చాలా మంది తోడ్పడ్డారని అన్నాడు. నల్లగొండ జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి, సికింద్రాబాద్‌లోని స్వచ్ఛంద సంస్థ పల్లెసృజన సహకారంతోనే తన ఆలోచనలను ఆచరణలోకి తెచ్చి, ప్రదర్శనలకు తీసుకువెళ్లగలిగానని అశోక్ కృతజ్ఞతలు తెలిపాడు. వరిలో కలుపు తీసే పరికరం(ధర రూ. 250) కావాలని 16 ఆర్డర్లు వచ్చాయన్నాడు. సెలవు రోజుల్లో వీటిని తయారు చేసి వారికి అందిస్తానని అశోక్ (86885 33637 నంబరులో ఉ. 7–9 గం., సా. 5–9 గంటల మధ్య సంప్రదించవచ్చు) వివరించాడు. – కొలను రాము, సాక్షి, చందంపేట, నల్లగొండ జిల్లా -
పుస్తకం లేని చదువులు
కర్నూలు సిటీ: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ఫలితాలు సాధిస్తామనే అధికారుల మాటలకు.. చేతలకు పొంతన కుదరడం లేదు. ఇప్పటికే అరకొర సౌకర్యాల మధ్య చదువులు కొనసాగిస్తున్న విద్యార్థులకు కనీసం పాఠ్య పుస్తకాలు కూడా పంపిణీ చేయని పరిస్థితి నెలకొంది. కళాశాలలు తెరిచి ఐదు నెలలు గడుస్తున్నా విద్యార్థుల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందించేది. అయితే ఈ ఏడాది ఇంత వరకు కాలేజీల్లో పాఠ్యాంశాలు అధ్యాపకులు బోధిస్తున్నా ఇంటి దగ్గర చదువుకునేందుకు పుస్తకాలు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పుస్తకాలు లేని కారణంతో చాలా కాలేజీల్లో కర్నూలు సిటీ: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ఫలితాలు సాధిస్తామనే అధికారుల మాటలకు.. చేతలకు పొంతన కుదరడం లేదు. ఇప్పటికే అరకొర సౌకర్యాల మధ్య చదువులు కొనసాగిస్తున్న విద్యార్థులకు కనీసం పాఠ్య పుస్తకాలు కూడా పంపిణీ చేయని పరిస్థితి నెలకొంది. కళాశాలలు తెరిచి ఐదు నెలలు గడుస్తున్నా విద్యార్థుల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందించేది. అయితే ఈ ఏడాది ఇంత వరకు కాలేజీల్లో పాఠ్యాంశాలు అధ్యాపకులు బోధిస్తున్నా ఇంటి దగ్గర చదువుకునేందుకు పుస్తకాలు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పుస్తకాలు లేని కారణంతో చాలా కాలేజీల్లో అధ్యాపకులు కూడా తాము బోధించిన అంశాలకు నోట్స్ ఇవ్వకపోవడంతో స్లిప్ టెస్ట్‌లు రాసేందుకు సైతం విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయివేటు పబ్లిషర్స్ పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులున్న వారు వాటిని కొనుగోలు చేయలేక పరీక్షలకు సరిగా ప్రిపేర్ కాలేకపోతున్నారు. దీంతో తక్కువ మార్కులు రావడం, ఫెయిల్ అవుతుండడంతో కొందరు విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కొన్ని కళాశాలల్లో మాత్రమే సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేసిన వారి నుంచి తిరిగి ఇప్పించుకుని అందజేశారు. మొదటి ఏడాది విద్యార్థులకు గత ఏడాది మిగిలిన పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ రూపంలో 20 శాతం మంది విద్యార్థులకు మాత్రం పుస్తకాలు అందాయి. ప్రతిపాదనలు కోరని ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 42 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 10 వేల మంది పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరికి రెండేళ్లుగా ప్రభుత్వం సకాలంలో పుస్తకాలు పంపిణీ చేయడం లేదు. ఈ కారణంతోనే ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించే పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీలు వెనుకబడుతున్నాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరం మొదలై ఐదు నెలలవుతున్నా నేటికీ ఈ ఏడాది పాఠ్యపుస్తకాల కోసం విద్యాశాఖ ఇండెంట్ కోరలేదు. ఆర్ట్స్ విద్యార్థులు ఇతర పుస్తకాలను చదువుతూ కొంత మేరకు గడుపుతున్నా సైన్సు గ్రూప్‌ల వారు మాత్రం ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలపైనే ఆధారపడుతుండడం, ఇంత వరకు పుస్తకాలు అందకపోవడంతో ఉత్తీర్ణత శాతంపై తీవ్ర ప్రభావం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠ్య పుస్తకాల ముద్రణ నిలిపివేత! వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ మీడియట్ సిలబస్‌లో సమూలమైన మార్పులు చేయాలని గతేడాది ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగానే ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వం పుస్తకాల ముద్రణకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని సమాచారం. ఈ కారణంతో కొన్ని పబ్లిషర్స్ అడ్డగోలుగా పాఠ్యపుస్తకాల ధరలు పెంచి విద్యార్థులను దోచుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. పాత పుస్తకాలతో సర్దుబాటు చేశాం ఇంటర్ మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కావాలని ప్రభుత్వాన్ని అడిగాం. గతేడాది మిగిలిన పుస్తకాలతోపాటు ద్వితీయ సంవత్సరం విద్యార్థుల నుంచి సేకరించి మొదటి సంవత్సరం విద్యార్థులకు కొంత మేరకు సర్దుబాటు చేశాం. వచ్చే ఏడాది నుంచి సిలబస్ మార్పులు జరుగుతుండడంతోనే పాఠ్య పుస్తకాలను ఇవ్వలేదు. – సుబ్రమణ్యేశ్వరరావు, డీవీఈఓ -
కళాశాల కరస్పాండెంట్‌పై విద్యార్థిని బంధువుల దాడి
ఇంటర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు, కేసు నమోదు హుజూర్నగర్ పట్టణంలోని గాయత్రీ కళాశాల కరస్పాండెంట్ సుధాకర్‌రెడ్డిపై శనివారం అదే కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని బంధువులు దాడి చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరుకు చెందిన విద్యార్థిని పట్టణంలోని ఇందిరాసెంటర్‌లో గల గాయత్రీ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కొద్ది రోజులుగా కళాశాల కరస్పాండెంట్ సుధాకర్‌రెడ్డి సదరు విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో విద్యార్థిని పరీక్షల సమయం కావడంతో తల్లిదండ్రులకు విషయం చెప్పకుండా దాచిపెట్టింది. ఈనెల 20న కరస్పాండెంట్ వికృతచేష్టలను తల్లిదండ్రులకు, బంధువులకు వివరించింది. దీంతో ఉదయం విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు కళాశాలకు చేరుకుని అక్కడే ఉన్న సుధాకర్‌రెడ్డిపై దాడి చేశారు. కాగా సుధాకర్‌రెడ్డి వారి నుంచి తప్పించుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సుధాకర్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. సుధాకర్‌రెడ్డిపై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ అఖిల్‌జామా తెలిపారు.