అర్ధరాత్రి వరకు ప్రవేశాలు
ఇంటర్ వొకేషనల్ విద్యార్థుల పాలిటెక్నిక్ కష్టాలు
ఒక్కరోజే గడువిచ్చిన ప్రభుత్వం
కౌన్సెలింగ్ ప్రక్రియ కష్టతరం కావడంతో ఆలస్యం
రాత్రి రెండు గంటల వరకు కొనసాగిన ప్రక్రియ
ఇచ్చిన గడువు ఒకేరోజు.. కేటాయించిన కేంద్రం ఒక్కటే.. అభ్యర్థులేమో ఎనిమిది జిల్లాలకు చెందిన 420 మంది. ఫలితంగా ఇంటర్ వొకేషనల్ విద్యార్థులు పాలిటెక్నిక్‌లలో ప్రవేశానికి ఉద్దేశించిన కౌన్సెలింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. అర్ధరాత్రి రెండు గంటల వరకు నిర్వహించి పూర్తి చేశారు. దీనివల్ల ఇటు విద్యార్థులు, తల్లిదండ్రులు.. అటు అధికారులు రాత్రంతా తిండి, నిద్ర లేకుండా ఇబ్బంది పడ్డారు.
- మురళీనగర్