Interest charge
-
హెచ్డీఎఫ్సీ షాక్.. హోంలోన్లు ఇకపై భారం
దేశంలో హౌసింగ్ ఫైనాన్స్‌లో అతి పెద్ద బ్యాంకుగా ఉన్న హెచ్డీఎఫ్సీ హోంలోన్స్‌పై వడ్డీ రేట్లు పెంచింది. ఇటీవల రెపోరేటును రిజర్వ్‌బ్యాంకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా తాజాగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్పీఎల్ఆర్)ను 30 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి తగ్గట్టుగా వివిధ స్లాబుల్లో హోంలోన్లపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ఈ పెంపు 2022 మే 9 నుంచి అమల్లోకి రానుంది. హెచ్డీఎఫ్సీ తాజా నిర్ణయంతో కొత్త రుణాలతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న రుణాలపై కూడా వడ్డీరేట్లు పెరగనున్నాయి. ఆర్బీఐ రెపోరేటు పెంచడానాకి ముందు పలు బ్యాంకులు ఎంసీఎల్ఆర్ బేసిక్ పాయింట్లను పెంచడం ద్వారా పరోక్ష పద్దతిలో ఇప్పటికే వడ్డీరేట్లు పెంచాయి. హెచ్డీఎఫ్సీ నిర్ణయంతో మిగిలిన బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. దీని ప్రభావం రియాల్టీ రంగంపై పడనుంది. HDFC increases its Retail Prime Lending Rate on Housing Loans, on which its Adjustable Rate Home Loans are benchmarked by 30 basis points with effect from May 09, 2022. pic.twitter.com/cOoBoIM1Q8 — ANI (@ANI) May 7, 2022 చదవండి: నాలుగేళ్ల తర్వాత..సామాన్యులకు ఆర్బీఐ భారీ షాక్! -
మారటోరియం : భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఆరు నెలల రుణ మారటోరియం కాలానికి వడ్డీని మాఫీ చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై 'వడ్డీపై వడ్డీని' మాఫీ చేస్తామని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. బ్యాంకులపై ప్రభావం చూపుతుందంటూ వడ్డీ మాఫీ చేయడానికి నిరాకరించిన కేంద్రం, తాజా నిర్ణయంతో పలు రుణ గ్రహీతలకు భారీ ఊరట కల్పించనుంది. దీనిపై తదుపరి వాదనలు సోమవారం జరగనున్నాయి. ఆరు నెలల మారటోరియం కాలం (మార్చి1- ఆగస్టు 31)లో వడ్డీని వదులుకునే భారాన్ని ప్రభుత్వం భరించడమే ఏకైక పరిష్కారం అని కేంద్రం సుప్రీంకోర్టుకు శుక్రవారం సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. దీంతో సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ)లతో పాటు, వ్యక్తిగత, విద్య, గృహ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, క్రెడిట్ కార్డ్ బకాయిలు, ఆటో మొదలైన చిన్నరుణగ్రహీతలకు ఈ మినహాయింపు భారీ ఉపశమనం లభించనుంది. తాత్కాలిక నిషేధాన్ని పొందారా అనే దానితో సంబంధం లేకుండా వడ్డీపై మాఫీ అమలు కానుంది. ఈ మేరకు, మాజీ కంట్రోలర్ ఆండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మహర్షి కమిటీ ఇచ్చిన సూచనలను కేంద్రం ఆమోదించింది. దేశం ఎదుర్కొంటున్న సంక్షోభ స్థితిలో రుణగ్రహీతలకు సహాయం చేసేందుకు మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని వదులుకోవడం వల్ల కలిగే భారాన్ని భరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వడ్డీని మాఫీ చేస్తే బ్యాంకులపై 6 లక్షల కోట్ల భారం పడుతుందని పేర్కొంది. కాగా కరోనా మహమ్మారి సంక్షోభం, లాక్డౌన్ కారణంగా అన్ని రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరు నెలల తాత్కాలిక నిషేధాన్ని విధించింది. అయితే వడ్డీ మీదవడ్డీ వసూళ్లపై సుప్రీం దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. ఆర్బీఐ వెనక దాక్కుంటారా, వ్యాపారమే ముఖ్యం కాదు, ప్రజలకు ఊరట కలిగించడం ప్రధానమే అంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సంగతి తెలిసిందే. -
రైతుల నుంచి వడ్డీ గుంజొద్దు
* ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లకు సర్కారు ఆదేశాలు * లక్ష లోపు రుణాలకు వడ్డీ లేదని స్పష్టీకరణ * ఆ మేరకు బ్యాంకుల ఎదుట బ్యానర్లు కట్టాలని సూచన * వడ్డీ వసూలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై గందరగోళానికి తెర దింపాలని బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతుల నుంచి వడ్డీ వసూలు చేయొద్దని స్పష్టంచేసింది. వడ్డీ వసూలు చేసినట్టు ఫిర్యాదులు అందితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అన్ని బ్యాంకులు.. బ్రాంచీల వారీగా రుణమాఫీలో లబ్ధి పొందిన రైతుల పంట రుణాల ఖాతా(స్టేట్మెంట్) వివరాలను ప్రభుత్వానికి పంపాలని ఆదేశించింది. శుక్రవారమిక్కడ ఎస్బీహెచ్ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి సాయిప్రసాద్, వ్యవసాయ శాఖ డెరైక్టర్ ప్రియదర్శిని ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ కన్వీనర్ శివశ్రీతో పాటు అన్ని బ్యాంకుల అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. ప్రభుత్వం మాఫీ చేసిన పంట రుణాలకు వడ్డీ మాఫీ కూడా వర్తిస్తుంది. కానీ ఈ డబ్బును రైతుల ఖాతాలో జమ కట్టే విషయంలో కొన్ని బ్యాంకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు ప్రభుత్వానికి, ఆర్థిక శాఖకు, గవర్నర్‌కు ఫిర్యాదులు అందాయి. ఇదే విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం సర్కారుకు నివేదిక అందించాయి. దీంతో అదే ప్రధాన అజెండాగా సమావేశంలో చర్చ జరిగింది. మాఫీపై ప్రచారం కల్పించండి.. రైతుల నుంచి వడ్డీ వసూలు చేయటం లేదని, రుణమాఫీ చేసిన రైతులకు సంబంధించిన ఖాతాల్లో ప్రభుత్వం ఇచ్చిన రెండు విడతల నిధులు జమ చేసినట్లుగా బ్యాంకర్లు వివరణ ఇచ్చారు. అయినా వరుసగా ఫిర్యాదులు అందుతున్నందున రుణమాఫీకి సంబంధించి రైతులకు మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకర్లకు సూచించారు. రైతుల నుంచి వడ్డీ వసూలు చేసినట్లుగా ఫిర్యాదులు అందితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడేది లేదని హెచ్చరించారు. రైతుల నుంచి వడ్డీ వసూలు చేయటం లేదని, లక్ష లోపు పంట రుణాలకు వడ్డీమాఫీ వర్తిస్తుందనే అంశానికి తగినంత ప్రచారం కల్పించాలని సమావేశంలో తీర్మానించారు. ప్రజలందరికీ ఈ విషయం తెలిసేలా అన్ని బ్యాంకులు బ్రాంచీల ఎదుట బ్యానర్లను కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. లక్ష లోపు పంట రుణాలకు వడ్డీ మాఫీ పథకం వర్తిస్తుందని, ప్రభుత్వం మాఫీ చేసిన రుణాలపై వడ్డీని వసూలు చేయటం లేదని అందరికీ అర్థమయ్యేలా ఈ బ్యానర్లు ఉండాలని సూచిం చారు. దీంతో పాటు రైతులకు ఎంత రుణం మాఫీ అయింది.. ఇప్పటివరకు ప్రభుత్వం ఎం త చెల్లించింది.. ఖాతాలో మిగిలిన రుణమెంత? అన్న వివరాలన్నీ ప్రచురించాలని పేర్కొన్నారు. వారంలోగా ఈ నిర్ణయాలు అమలు చేయాలని సమావేశం తీర్మానించింది.