internal tests
-
వందల మంది ఉద్యోగుల తొలగింపుపై స్పందించిన విప్రో!
సాక్షి, ముంబై: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో వందలమంది ఫ్రెషర్లకు షాకిచ్చింది. పేలవమైన పనితీరు కారణంగా ఫ్రెషర్స్‌ను విధుల నుంచి తొలగించినట్లు బిజినెస్ టుడే రిపోర్ట్ చేసింది. (ఇదీ చదవండి: మరో బాంబు, వేలమందికి షాకివ్వనున్న టెక్ దిగ్గజం) ఈ తరుణంలో ఉద్యోగుల తొలగింపుపై విప్రో స్పందించింది. ‘విప్రోలో, మేం అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉన్నందుకు గర్వపడుతున్నాం. సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా, ప్రతి ఎంట్రీ - లెవల్ ఉద్యోగి వారి నియమించబడిన వర్క్ ప్లేస్‌లో నిర్దిష్టమైన నైపుణ్యాన్ని కలిగి ఉండాలని మేము ఆశిస్తున్నాము. వ్యాపార లక్ష్యాలు, క్లయింట్ల అవసరాలు ఉద్యోగుల పనితీరుపై ఆధారపడి ఉంటాయి. మానిటరింగ్, రీట్రైనింగ్ వంటి ప్రక్రియల్లో భాగంగా కంపెనీ నుండి కొంతమంది ఉద్యోగుల విభజన చేయాల్సి ఉంటుంది. కాబట్టే ట్రైనింగ్ తర్వాత పేలవంగా రాణిస్తున్న ఫ్రెషర్స్‌ను విధుల నుంచి తొలగించాల్సి వచ్చిందని తెలిపింది. (స్విగ్గీ ఉద్యోగాల ఊచకోత: 380 మందిపై వేటు) -
విద్యార్థులపై ఫీ‘జులుం’
శాతవాహన యూనివర్సిటీ: డిగ్రీ విద్యార్థుల నుంచి ఇంటర్నల్ పరీక్షల పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ. 200 వసూలు చేస్తున్నారని.. దానిని వెంటనే నిలిపి వేయాలని, గతంలో విద్యార్థుల నుంచి తీసుకున్న ఫీజులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నగర సంటన్ కార్యదర్శి సందీప్, జిల్లా కో కన్వీనర్ జగదీశ్వర్ ఆధ్వర్యంలో కరీంన గర్ శాణినికేతన్ కళాశాలలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీ పరిధిలో దాదాపు 125 డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంచి మార్కులు వేయాలంటే ఒక్కో విద్యార్థి కచ్చితంగా రూ. 200 చెల్లించాలని వాణినికేతన్ డిగ్రీ కళాశాల యాజమాన్యం నిబంధనలు పెట్టింది. అంతేకాదు కళాశాల వార్షిక ఫీజు విషయమై కళాశాల యాజమాన్యం ఓ నిర్ణీత నమూన లెటర్‌పై రెవెన్యూ స్టాంప్ అతికించి మరీ విద్యార్థులతో బప్పంద పత్రాలు రాయించింది. విషయం ఏబీవీపీ నాయకులకు తెలియడంతో రుసుం వసూలు చేయడం సరికాదని ఆందోళన చేపట్టారు. అన్ని కళాశాలల్లో ఇదే తీరు.. శాతవాహన పరిధిలో అన్ని డిగ్రీ కళాశాలలో ఇదే తతంగం నడుస్తోందని వాణినికేతన్ కళాశాల ఏవో సరోజ మీడియా ఎదుట బేషరుతుగా వెల్లడించారు. రుసుం వసూలుకు నిబంధనలు ఉన్నాయా? అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ ఇంటర్నల్స్‌కు ఖర్చులుంటాయని వివరించారు. విద్యార్థుల నుంచి కొంత ఫీజు తీసుకోవాలని వర్సిటీ అధికారులు మౌఖికంగా ఆదేశాలిచ్చారన్నారు. కావాలంటే దానిని నాలుగైదు గంటల్లో నిరూపిస్తానన్నాని చెప్పారు. జిల్లాలోని దాదాపు 125 కళాశాలలో ఏలాంటి ఆధారాలు లేకుండా వసూలు జరుగుతుంటే మేం మాత్రమే తీసుకున్న దానికి ర శీదులాగా పేపర్స్ ఇచ్చామని అన్నారు. ఫీజు తిరిగి చెల్లిస్తాం.. విద్యార్థుల నుంచి తీసుకున్న రూ. 200 తిరిగి చెల్లిస్తాం. అందరిని పరీక్షలకు హాజరుకు అనుమతిస్తాం. వార్షిక ఫీజు విషయంలో విద్యార్థులకు భయం ఉండాలన్న కోణంలో రెవెన్యూ స్టాంప్‌పై సంతకాలు చేయించాం. దాంతో మేము ఏమీ చేయం. విద్యార్థులు గమనించాలి - సరోజ, ఏవో, వాణినికేతన్ డిగ్రీ కళాశాల, కరీంనగర్ ఫీజులు తీసుకోవాలని చెప్పలేదు ఇంటర్నల్స్ పరీక్షల గురించి ఫీజు తీసుకోవాలని ఏ కళాశాలకు చెప్పలేదు. కళాశాలలో పరిస్థితి తిరగబడితే వర్సిటీపై నెట్టడం సరికాదు. ప్రమాణాలు మెరుగు పర్చే క్రమంలో ఇంటర్నల్స్ పరీక్షలకు సంబంధించిన పేపర్స్ వర్సిటీకి ఇవ్వాలన్న నిబంధన తెచ్చాం. ఫీజు విషయంలో వర్సిటీ ప్రమేయం లేదు. - దాస్యం సేనాధిపతి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి -
8 కిలోల నగల రికవరీ
సాక్షి, సిటీబ్యూరో: వారం క్రితం ఏపీ డీజీపీ కార్యాలయం ఎదురుగా ముంబై వర్తకుల నుంచి తస్కరించిన ఎనిమిది కిలోల బంగారు ఆభరణాలను నగర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులమంటూ చోరీకి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. దోపిడీ జరిగింది ఇలా.... ముంబైలోని ఎంవీఎస్ జ్యుయలర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సేల్స్మన్లు జతిన్ ప్రతాప్సిన్ కపాడియా, దేవేంద్ర త్రివేది, హితేష్, సచిన్‌లు బంగారు ఆభరణాలు విక్రయించడానికి ఈనెల 8న హైదరాబాద్‌కు వచ్చారు. లక్డీకపూల్‌లోని ఓ లాడ్జీలో బస చేశారు. వీరు మూడు రోజుల నగరంలో ఉండి, అనంతరం బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. ఆదివారం రాత్రి లక్డీకపూల్‌లోని హెచ్‌కేబీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో జతిన్ ప్రతాప్సిన్ కపాడియా నగల బ్యాగ్ పట్టుకుని రోడ్డుపై నిలబడ్డాడు. ముగ్గురు వ్యక్తులు వచ్చి పోలీసులమని చెప్పి బ్యాగును లాక్కున్నారు. వెంటనే అక్కడే బైక్‌పై ఉన్న వ్యక్తి బ్యాగ్‌తో పారిపోయాడు. ఈ ముగ్గురు కూడా మెల్లగా జారుకున్నారు. నగల షాపు ఉద్యోగే సూత్రధారి.. ఖైరతాబాద్‌కు చెందిన దాసరి రాహుల్ (22) అబిడ్స్‌లోని సూరజ్‌భాను జ్యుయలరీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. నగల దుకాణానికి వచ్చిన సేల్స్మన్లను పసిగట్టి, అతడి స్నేహితులు జగద్గీరిగుట్టకు చెందిన స్టేట్ హ్యుమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కన్వినర్ మహ్మద్ అజహర్ మోహినుద్దీన్ (27), ఘట్కేసర్కు చెందిన బీటెక్ విద్యార్థి రాథోడ్ ప్రతాప్ సింగ్ (22), కూకట్‌పల్లికి చెందిన పెయింటర్ కట్ట సాయి కిరణ్ (21), మూసాపేట్‌కు చెందిన షేక్ ఫెరోజ్ (23)లతో కలిసి పథకం రచించాడు. వీరు రెండు ద్విచక్రవాహనాలపై వర్తకుల కదలికలపై మూడు రోజులు రెక్కీ నిర్వహించారు. ఆదివారం రాత్రి అవకాశం లభించడంతో నగల బ్యాగ్‌ను తస్కరించారు. పట్టించిన సీసీ కెమెరా.. సైఫాబాద్ ఏసీపీ పి.నారాయణ, టాస్క్‌ఫోర్స్ డీసీపీ బి.లింబారెడ్డిలు ఈ కేసు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. బ్యాగ్ లాక్కుని పోతున్న దృశ్యాలు ఘటనాస్థలానికి సమీపంలోని పెట్రోల్‌బంక్‌లో ఉన్న రెండు సీసీ కెమెరాల ఫుటేజ్‌ల్లో లభించాయి. వీటి ఆధారంగా నిందితులను గుర్తించారు. సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు ఎ.భాస్కర్, ఏపీ ఆనంద్‌కుమార్ తమ సిబ్బందితో రంగంలోకి దిగి పరారీలో ఉన్న నిందితులను మూడు రోజుల పాటు గాలించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించారు. ఎనిమిది కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో అదనపు పోలీసు కమిషనర్ అంజనీకుమార్, జాయింట్ పోలీసు కమిషనర్ బి.మల్లారెడ్డి, సెంట్రల్‌జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, అదనపు డీసీపీ రామ్మోహన్రావు, టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, ఏసీపీ పి.నారాయణ పాల్గొన్నారు.