international auto show
-
కోవిడ్-19 : స్విస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
కోవిడ్-19 (కరోనా వైరస్) ఆటో ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తోంది. చైనాలోని వూహాన్ విస్తరించిన ఈ ప్రాణాంతకమైన వైరస్ 6 ఖండాల్లో తన ఉనికిని చాటుకుని మరణ మృదంగం వాయిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలవిల్లాడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి అసాధారణమైన చర్యగా 1,000 మందికి పైగా ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలను నిషేధిస్తూ స్విట్జర్లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని, మార్చి 15 వతేదీ వరకు ఈ నిషేధం అమల్లో వుంటుందని తెలిపింది. దీంతో జెనీవాలో జరగనున్న అంతర్జాతీయ ఆటో షోను కూడా నిర్వాహకులు రద్దు చేశారు. ఆటో పరిశ్రమకు ప్రధానమైన జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో రద్దయిందని స్థానిక అధికారులు శుక్రవారం తెలిపారు. "90వ జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో-2020 జరగదు" అని జెనీవా ప్రాంతీయ కంటోనల్ ప్రభుత్వ అధినేత ఆంటోనియో హోడ్జర్స్ ట్విటర్లో వెల్లడించారు. మరోమూడు రోజుల్లో ఆటో షోలో ప్రధాన వేడుక ప్రారంభం కానుండగా తాజా నిర్ణయం వెలువడింది. ఈ పరిస్థితికి చింతిస్తున్నామనీ, కానీ ఆటో షో పాల్గొనే వారందరి ఆరోగ్యమే తమ ప్రధాన ప్రాధాన్యత అని ఫౌండేషన్ బోర్డు చైర్మన్ మారిస్ తురెట్టిని తెలిపారు. భారీగా పెట్టుబడులు పెట్టిన తయారీదారులకు ఈ నిర్ణయం విపరీతమైన నష్టమే అయినప్పటికీ, అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉందన్నారు. (కోవిడ్-19 షాక్‌నకు ఆర్థిక టానిక్ అదే!) ఈ కార్ షో వచ్చే వారం (మార్చి5 -15) ప్రారంభం కానుంది. కరోనా విజృంభిస్తున్న క్రమంలో ఇప్పటికే చాలా దేశాలు కార్ షోలో తాము పాల్గొడంలేదని ఇప్పటికే ప్రకటించాయి. అలాగే హై ప్రొఫైల్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా తన సందర్శనను రద్దు చేసుకున్నారు. ప్రయాణ ఆంక్షలు, కరోనావైరస్ వ్యాప్తి భయాలు బార్సిలోనాలోని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్, ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరగనున్న లైట్ , బిల్డింగ్ ఫెయిర్ , బీజింగ్ ఆటో షోతో సహాపలు ముఖ్యకార్యక్రమాలను వాయిదా లేదా రద్దుకు కారణమయ్యాయి. కాగా ప్రపంచాన్ని చుట్టేస్తున్న మహమ్మారి కరోనావైరస్కు సంబంధించి మూడు ఖండాల్లోని దేశాలు మొదటి కేసులను శుక్రవారం నివేదించాయి. స్విట్జర్లాండ్‌లో ధృవీకరించిన కరోనావైరస్ కేసుల సంఖ్య 15కి పెరిగిందని, 100 మందికి పైగా పరిశీలనలో ఉన్నారని ప్రభుత్వ మంత్రి అలైన్ బెర్సెట్ తెలిపారు. చదవండి : 5 నిమిషాల్లో రూ. 5 లక్షల కోట్లు హాంఫట్ ఏప్రిల్ నుంచి పెట్రోలు ధరల మోత? -
బీఎండబ్ల్యూ నుంచి బుగాటి వరకు
-
హైటెక్స్‌లో ఇంటర్నేషనల్ ఆటో షో
-
బీఎండబ్ల్యూ నుంచి బుగాటి వరకు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఇంటర్నేషనల్ ఆటో షో ఘనంగా ప్రారంభమైంది. హైటెక్స్‌లో మూడు రోజులపాటు జరగనున్న ఈ ఆటో షోను తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. డిసెంబర్ 2, 3, 4 తేదీల్లో జరుగుతున్న ఈ ఆటో ఎక్స్‌పోలో దేశీయ, అంతర్జాతీయ ఆటోమేజర్ల సూపర్‌బైక్స్, సూపర్ కార్లు, పలువింటేజ్ కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బీండబ్ల్యు నుంచి మొదలుపెడితే బుగాటి , వెరియాన్, లెక్సస్ వంటి దిగ్గజ బ్రాండ్ల కార్లకు వేదికైంది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆటో షో. విస్తా ఎంటర్టైన్మెంట్ ఈ ఎక్స్పోను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 4 వరకు ఈ షో అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అన్ని ప్రముఖ బ్రాండ్లకు చెందిన కార్లు, బైక్‌లు ఈ ఎక్స్‌పోలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది విస్తా ఎంటర్టైన్మెంట్స్. దేశంలో ఇది రెండో అతిపెద్ద ఆటో షో అని నిర్వాహకులు తెలిపారు. వీటితోపాటు హార్లే డే డ్సన్, డుకాటి, బీఎమ్‌డబ్ల్యూ, మోటారాడ్, ఇన్ఫీల్డ్, యమహా, బజాజ్ ఆటో, సుజుకీ మోటార్ సైకిల్స్ లాంటి దిగ్గజ కంపెనీలకు చెందిన సూపర్ బైక్‌లు ఇతర టూ వీలర్లు ఆకట్టుకోనున్నాయని తెలిపారు.. జాగ్వర్, ల్యాండ్ రోవర్, బెంట్లీ, ఆస్టన్ మార్టిన్, వోల్వో, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్, ఫోర్డ్, స్కోడా, టొయోటా, నిస్సాన్, బీఎండబ్ల్యూ, ఫోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్ వంటి అనేక ఆటోమొబైల్ కంపెనీల కార్లను ఈ ఫోలో ప్రదర్శనకు ఉంచారు. 2008 నుంచి ఈ ఎక్స్పో ను నిర్వహిస్తున్నారు. -
నడపక్కర్లేదు.. ఆదేశిస్తే చాలు
ఈ వాహనం డిజైన్ చూశారా? ఎంత వెరైటీగా ఉందో.. దీని రూపకర్త టొయోటా. చైనాలోని బీజింగ్‌తోపాటు న్యూయార్క్‌లో జరుగుతున్న అంతర్జాతీయ ఆటోషోలో ప్రదర్శిస్తున్న ఈ ఎఫ్‌వీ2(ఫన్ వెహికల్) వాహనం డిజైన్‌ను చూసినవారంతా ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలోని వాహనంలా కనిపిస్తోందని అంటున్నారు. దీని పూర్తి వివరాలను టొయోటా కంపెనీ వెల్లడించనప్పటికీ.. నిపుణులు చెబుతున్న సమాచారం ప్రకారం.. ఇది డ్రైవర్ రహిత వాహనం. ఒక్కరు మాత్రమే కూర్చునే అవకాశముంది. ముందొకటి.. మధ్యలో రెండు, చివ ర ఒక చక్రం కలిపి మొత్తం నాలుగు చక్రాలుంటాయి. ఏ ఇంజిన్ అన్న వివరాలు తెలియనప్పటికీ.. ఎలక్ట్రిక్ ఇంజిన్ అయి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఎఫ్‌వీ2 వాహనం ముందు ఉండే తెరపై మనకు ట్రాఫిక్‌కు సంబంధించిన సూచనలు వంటివి వస్తాయి. అంతేకాదు.. మన మూడ్ బట్టి తెర రంగు మారుతుంది. మీరు ఆగ్రహంగా ఉంటే.. ఎరుపు రంగులోకి తెర మారిపోతుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు పచ్చ రంగులోకి వస్తుంది. దిగులుగా ఉంటే.. మీకు నచ్చే ప్రదేశాల్లో ఒకదాన్ని సూచిస్తూ.. అక్కడికి వెళ్లమంటూ ఓ సందేశం తెరపై ప్రదర్శితమవుతుంది. ఇది డ్రైవర్ రహిత వాహనమైనప్పటికీ.. మనం నడపాలంటే.. దీన్ని నడపొచ్చు. డ్రైవర్ మోడ్‌లోకి మారిస్తే.. మన శరీర కదలికలు ఆధారంగా దీన్ని నియంత్రించవచ్చట. అంటే.. వాహనం ఎడమ వైపునకు తిరగాలంటే, మనం ఎడమ వైపునకు వంగితే అలా తిరుగుతుందన్నమాట. ఏ సైడు మన శరీరాన్ని వంచితే.. అటు వైపు వెళ్తుంది. భవిష్యత్తు వాహనంగా పేర్కొంటున్న ఎఫ్‌వీ2.. ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందన్న వివరాలను టొయోటా కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే, అంతవరకూ ఉత్సాహవంతుల కోసం టొయోటా ఎఫ్‌వీ2 పేరిట ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను విడుదల చేశారు. దీని ద్వారా మనం ఆ వాహనాన్ని నడిపిన అనుభూతిని పొందొచ్చట.