సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఇంటర్నేషనల్ ఆటో షో ఘనంగా ప్రారంభమైంది. హైటెక్స్‌లో మూడు రోజులపాటు జరగనున్న ఈ ఆటో షోను తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. డిసెంబర్ 2, 3, 4 తేదీల్లో జరుగుతున్న ఈ ఆటో ఎక్స్‌పోలో దేశీయ, అంతర్జాతీయ ఆటోమేజర్ల సూపర్‌బైక్స్, సూపర్ కార్లు, పలువింటేజ్ కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బీండబ్ల్యు నుంచి మొదలుపెడితే బుగాటి , వెరియాన్, లెక్సస్ వంటి దిగ్గజ బ్రాండ్ల కార్లకు వేదికైంది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆటో షో.
విస్తా ఎంటర్టైన్మెంట్ ఈ ఎక్స్‌పోను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 4 వరకు ఈ షో అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అన్ని ప్రముఖ బ్రాండ్లకు చెందిన కార్లు, బైక్లు ఈ ఎక్స్‌పోలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది విస్తా ఎంటర్టైన్మెంట్స్. దేశంలో ఇది రెండో అతిపెద్ద ఆటో షో అని నిర్వాహకులు తెలిపారు. వీటితోపాటు హార్లే డే డ్‌సన్, డుకాటి, బీఎమ్‌డబ్ల్యూ, మోటారాడ్, ఇన్‌ఫీల్డ్, యమహా, బజాజ్ ఆటో, సుజుకీ మోటార్ సైకిల్స్ లాంటి దిగ్గజ కంపెనీలకు చెందిన సూపర్ బైక్‌లు ఇతర టూ వీలర్లు ఆకట్టుకోనున్నాయని తెలిపారు.. జాగ్వర్, ల్యాండ్ రోవర్, బెంట్లీ, ఆస్టన్ మార్టిన్, వోల్వో, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్, ఫోర్డ్, స్కోడా, టొయోటా, నిస్సాన్, బీఎండబ్ల్యూ, ఫోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్ వంటి అనేక ఆటోమొబైల్ కంపెనీల కార్లను ఈ ఫోలో ప్రదర్శనకు ఉంచారు. 2008 నుంచి ఈ ఎక్స్‌పో ను నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment