International Nurses Day May 12
-
నా అక్కచెల్లమ్మలైన నర్సులందరికీ కృతజ్ఞతలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: నేడు (బుధవారం) అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్ధంగా సేవ చేస్తూ ప్రతి వారిని తమ సొంతవారిలా చూసే నర్సులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఙతలు తెలియజేశారు. ఈమేరకు ట్విటర్ ద్వారా స్పందించారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా ఏపీలో కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ ఎంతోమందికి నిస్వార్ధంగా సేవలందిస్తున్నారు నా అక్క చెల్లమ్మలైన నర్సులు. వారందరికీ మనస్పూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.’’ అంటూ ట్వీట్ చేశారు. కరోనా అనగానే అల్లంత దూరం పారిపోయే కుటుంబ సభ్యులున్న నేటి రోజుల్లో కరోనా రక్కసి చేతిలో విలవిలలాడుతున్న వారికి నర్సులు అందిస్తున్న సేవలు ఎనలేనివి. మానవ సేవే మాధవ సేవ అంటారు. అలా మానవ సేవ ద్వారానే తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్న వారు నర్సులు. అయిన వారు కూడా ముట్టుకోవటానికి ఇబ్బంది పడినా, ఏ మాత్రం సంబంధం లేని నర్సులు రోగులకు సేవలు అందిస్తున్నారు. చదవండి: నర్సుల దినోత్సవం ఎలా మొదలైందో తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా ఏపీలో కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ ఎంతోమందికి నిస్వార్థంగా సేవలందిస్తున్నారు నా అక్కచెల్లెమ్మలైన నర్సులు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.#InternationalNursesDay — YS Jagan Mohan Reddy (@ysjagan) May 12, 2021 -
నర్సుల దినోత్సవం ఎలా మొదలైందో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో చేరిన వారికి సేవలు చేసే చేతులు ఏవైనా ఉంటే అవి సేవామయులైన నర్సుల చేతులే. మానవ సేవే మాధవ సేవ అంటారు. అలా మానవ సేవ ద్వారానే తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్న వారు నర్సులు. అయిన వారు కూడా ముట్టుకోవటానికి ఇబ్బంది పడినా, ఏ మాత్రం సంబంధం లేని నర్సులు సేవలు అందిస్తున్నారు. కరోనా అనగానే అల్లంత దూరం పారిపోయే కుటుంబ సభ్యులున్న నేటి రోజుల్లో కరోనా రక్కసి చేతిలో విలవిలలాడుతున్న వారికి నర్సులు అందిస్తున్న సేవలు ఎనలేనివి. పల్లె, పట్టణం తేడా లేకుండా అంతటా ఆయా ఆస్ప త్రులు, పీహెచ్‌సీల పరిధిలో పనిచేసే నర్సులు కరోనా బాధితులను గుర్తించడం నుంచి వారికి వైద్య సేవలు అందించి వారు కోలుకునేదాకా అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇంటింటి సర్వే ద్వారా వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించి వారికి మందులు అందిస్తున్నారు. వీరంతా కరోనా పడగ నీడలో ఎప్పుడు వైరస్ బారిన పడతామో తెలియని పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నారు. ఇప్పటికే పలువురు కరోనాతో ఇంటి దగ్గర ఉండి చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ బారిన పడిన వేలాది మందికి సేవలందించడం ద్వారా నర్సులు ప్రజల అభిమానం చూరగొంటున్నారు. అయితే మరి ఈ రోజే నర్సుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా... 1820 మే 12న నర్సు వృత్తి గౌరవానికి ప్రతీక అయిన ఫ్లొరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజు. 1854లో క్రిమియన్ యుద్ధం సందర్భంగా 38 మంది నర్సుల బృందం యుద్ధంలో గాయపడిన సైనికులకు విశేషమైన సేవలు అందించింది. ఇందులో ఫ్లొరెన్స్ నైటింగేల్ ఆ నర్సుల బృందానికి నాయకురాలిగా, మార్గదర్శకురాలిగా సేవలందించటంలో ఆదర్శంగా నిలించింది. నిరంతరం ఆ క్షతగాత్రులకు సేవలందించేందుకు దీపం పట్టుకొని శిబిరాల్లో తిరిగేది. దీంతో ఆమెను లేడీ విత్ ది ల్యాంప్ అని పిలిచేవారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ (ఐసిఎన్) – 1965 నుంచి ఈ రోజును జరుపుకుంటున్నారు. ఆమె చేసిన త్యాగపూరితమైన కృషి ఫలితంగా నేడు నర్సు వృత్తి కొనసాగటమే కాదు, వైద్యరంగానికి వన్నెతెచ్చింది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా అంతర్జాతీయ నర్సు దినోత్సవం జరుపుకుంటారు. -
మిలియనర్స్
మే 12 ఇంటర్నేషనల్ నర్సెస్ డే ‘‘ఈమధ్య మీరెందుకు రాయడం లేదు’’ అని ఎవరో అడిగితే - ‘మోడ్రన్ నర్సింగ్’కు మార్గదర్శి అయిన ఫ్లారెన్స్ నైటింగేల్ ఇలా చెప్పారు... ‘నా అందమైన ఊహలను అక్షరాల్లో బంధించడం నాకు ఇష్టం లేదు. వాటిని ఆచరణలోకి తీసుకువెళ్లడమే నాకు ఇష్టం’! అవును నిజమే. కళ్లలో కరుణ నిండిన దేవదూతల్లా ధవళ వస్త్రాల్లో కనిపించే నర్స్‌లు దేన్నీ మాటల్లో చెప్పరు. ఆచరించి చూపిస్తారు. ఆ ఆచరణ రోగుల కన్నీటిని తుడుస్తుంది. నిలువెత్తు ధైర్యవచనం అవుతుంది. ఒక్కరిని బతికించినవాడు హీరో అవుతాడు. మరి వందమందిని బతికించిన వ్యక్తి ఏమవుతారు? నర్స్ అవుతారు! నర్సింగ్ కెరీర్లోకి వెళ్లడం అంటే సేవాపథంలో చిత్తశుద్ధితో చేసే ప్రయాణంలాంటిది. ఇదొక కోణం అయితే మరో కోణం కూడా ఉంది. కెరీర్ పరంగా నర్సింగ్ ఎంతో లాభదాయకంగా ఉంది. విదేశాల్లో ఉద్యోగావకాశాల్ని కల్పిస్తోంది. మంచి ఆదాయాన్ని, సౌకర్యాలను, సమాజంలో గౌరవప్రదమైన స్థాయిని ఇస్తోంది. పలు దేశాల్లో నర్సుల ఆదాయంపై ఓ సర్వే వెల్లడించిన సమగ్రమైన రిపోర్ట్ ఇది... నర్సులకు యూఎస్‌లో అద్భుతమైన అవకాశాలు ఉంటున్నాయి. అక్కడ జీతాన్ని గంటల చొప్పున లెక్కపెడుతుంటారు. ఓవర్‌టైమ్ చేస్తే గంటకింత అని పే చేసేస్తారు. వాటితో పాటు అలవెన్సులు, ఇన్స్యూరెన్స్ వంటి ప్రత్యేక సదుపాయాలు కూడా ఉంటున్నాయి. దాంతో అమెరికాలో అవకాశాల కోసం నర్సింగ్ చేసినవాళ్లు క్యూ కడుతున్నారు. బ్రిటన్ కూడా నర్సులకు సాదరంగా ఆహ్వానం చెబుతోంది. గత సంవత్సరం 8,500 మంది విదేశీయుల్ని ఆ దేశపు హాస్పిటళ్లు నర్సులుగా చేర్చుకున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ సంఖ్య రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. యూకేలో పనిచేసే నర్సుల్లో మన దేశీయుల సంఖ్య ఎక్కువేనట. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు కూడా నర్సులకు మంచి అవకాశాలను కల్పిస్తున్నాయి. జీతాలతో పాటు యేటా బోనస్‌లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. వసతి, భోజన సౌకర్యాలు వంటివి కల్పించి తమ దేశంలో పనిచేసేవారికి సౌకర్యవంతమైన జీవితాన్ని కల్పిస్తున్నాయి. అయితే హాస్పిటళ్లలో పనిచేసే నర్సుల కంటే బెడ్ రిడెన్ పేషెంట్లకు కేర్ టేకర్లుగా ఇళ్లలో పనిచేసే నర్సులకు ఎక్కువ వేతనం లభిస్తోందని తెలుస్తోంది. అలాగే ల్యాబ్స్‌లో పని చేసేవాళ్లు, ఆపరేషన్ థియేటర్లలో పనిచేసే నర్సుల జీతాలు మామూలు నర్సుల కంటే కాస్త అధికంగానే ఉంటున్నాయట. వివిధ దేశాల్లో నర్సుల జీతాలను మన కరెన్సీలో లెక్క వేస్తే పై నివేదిక తయారైంది! అమెరికా గంటకు - రూ.1,383 - రూ.2,561 ఓవర్ టైమ్ (గంటకు) - రూ.948 - రూ.3,845 దక్షిణాఫ్రికా ఏడాది జీతం - రూ.4,96,697 - రూ.11,59,526 బోనస్ - రూ.11,4,287 - రూ.1,70,815 సౌదీ అరేబియా ఏడాది జీతం- రూ.4,34,881 - రూ.38,21,535 బోనస్ - రూ.3,47,131 సింగపూర్ ఏడాది జీతం- రూ.10,69,144 - రూ.30,83,908 బోనస్ - రూ.4,91,385 ఆస్ట్రేలియా గంటకు- రూ. 1,226 - రూ.1,963 ఓవర్ టైమ్ (గంటకు) - రూ.157 - రూ.3,129 న్యూజిలాండ్ గంటకు-రూ.1,027 - రూ.1,449 ఓవర్ టైమ్ (గంటకు) - రూ.67- రూ.2,257 యూకే ఏడాది జీతం- రూ.17,21,685 - రూ.30,17,938 బోనస్ - రూ.1,95,324 కెనడా గంటకు- రూ.1,317 - రూ.2,192 ఓవర్ టైం (గంటకు) - రూ.161- రూ.4,045