నేటి నుంచి డైట్‌సెట్ కౌన్సెలింగ్
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలో సోమవారం నుంచి డైట్‌సెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఏ కేంద్రానికీ వెళ్లాల్సిన అవసరం లేదు. సొంత కంప్యూటర్లు, ఇంటర్నెట్ కేఫ్‌ల నుంచి ఆప్షన్లు ఎం చుకోవచ్చు. కోరుకున్న మూడు కళాశాలలను వరుస క్రమంలో పొందుపరుచుకోవాల్సి ఉంది. 15వ తేదీ వరకు వె బ్ ఆప్షన్లకు గడువు ఉంది. ప్రతిభ, ర్యాంకుల ఆధారంగా ఈ నెల 1న సీటు కేటాయిస్తారు. సీటు పొందినవారికి సమాచారం ఇస్తారు. వారు మాత్రమే 23న ఇందుకూరుపేట మం డలం పల్లిపాడులోని ప్రభుత్వ డైట్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంది. ఈ నెల 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
అన్నిసెట్లకు భిన్నంగా..
అన్ని ప్రవేశపరీక్షలకు భిన్నంగా డైట్‌సెట్ కౌన్సెలింగ్‌లో తొలుత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమవుతోంది. సాధరణంగా కౌన్సెలింగ్‌లలో ముందుగా సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ఆప్షన్ల ప్రక్రియ, కళాశాలల కేటాయింపు... ఇలా ఉంటుంది వరుసక్రమం. డైట్‌సెట్‌లో మాత్రం సీటు లభించాకే, జిల్లావ్యాప్తంగా ఒక్క పల్లిపాడు ప్రభుత్వ డైట్ కళాశాలలోనే సర్టిఫికెట్ల పరిశీలన చేపడుతున్నారు. స్వీకరించిన సర్టిఫికెట్లు, ఇతర వివరాలను సంబంధిత కళాశాలలకు పంపుతారు.
జిల్లాలో 6500 మంది డైట్‌సెట్ పరీక్షకు హాజరై ర్యాంకులు సాధించి ఉన్నారు. జిల్లాలో 12 ప్రైవేట్ కళాశాలలున్నాయి. ఒక్కో కళాశాలలో 50 సీట్లు ఉన్నాయి. వీటిలో 40 సీట్లు కన్వీనర్ కోటా కింద, పది సీట్లు యాజమాన్య కోటా కింద ఉంటాయి. పల్లెపాడులో ఉన్న ప్రభుత్వ డైట్ కళాశాలలో మాత్రం 150 సీట్లు ఉన్నాయి. గతేడాది వరకు జిల్లాలో 11 ప్రైవేటు కళాశాలల్లో కలిపి 550 సీట్లు ఉండేవి. ఈ ఏడాది శ్రీహర్ష ఎడ్యుకేషనల్ సొసైటీకి కొత్తగా ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడంతో మరో 50 సీట్లు అదనంగా అభించాయి.