ఇంటర్నెట్‌ కేఫ్‌కు అని వెళ్లి.. | went for Internet cafe then lady missing | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్‌ కేఫ్‌కు అని వెళ్లి..

Published Wed, Jan 18 2017 9:39 PM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM

went for Internet cafe then lady missing

హైదరాబాద్‌: ఇంటర్నెట్‌ కేఫ్‌కు అని వెళ్లిన ఓ యువతి తిరిగి కనిపించకుండా పోయిన సంఘటన కేపీహెచ్‌బీ కాలనీలోని నిజాంపేట పరిధి రాజీవ్‌గృహకల్పలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కృష్ణ కూతురు లావణ్య(21) ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి కనిపించటం లేదు. బంధువులు, మిత్రులను ఆరా తీసినా లాభం లేకపోవడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జనగా మురళి అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement