intlo deyyam nakem bayam
-
షాక్ ఇచ్చిన అల్లరి నరేష్
2016కు నవ్వులతో గుడ్ బై చెప్పడానికి రెడీ అవుతున్న అల్లరి నరేష్, ఇంట్లోదెయ్యం నాకేం భయం సినిమాను డిసెంబర్ 30న రిలీజ్ చేస్తున్నాడు. కొంతకాలంగా తన స్థాయికి తగ్గ హిట్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న ఈ కామెడీ స్టార్, కొత్త సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందుకే.. సరైన సమయం కోసం చాలా సార్లు వాయిదా వేసి డిసెంబర్ నెలాఖరున రిలీజ్ ప్లాన్ చేశాడు. ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమా ప్రమోషన్ సందర్భంగా నరేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిమానులకు షాక్ ఇచ్చాడు ఈ యంగ్ హీరో. చాలా రోజులుగా డైరెక్షన్ చేసే ఆలోచనలో ఉన్న నరేష్, తన దర్శకత్వంలో రాబోయే సినిమా రిలీజ్ డేట్ కూడా చెప్పేశాడు. ఇంత వరకు కథా కథనాలు, నటీనటులు ఏదీ లేకపోయినా.. 2020 మే నెలలో తన దర్శకత్వంలో సినిమా రిలీజ్ అవుతుందంటూ ప్రకటించేశాడు. ఆ డేట్‌నే ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్నకు సమాధానంగా సౌండ్ బాగుంది కాబట్టే ఆ డేట్‌ను ఎంచుకున్నానని తెలిపాడు. -
నోట్ల బ్యాన్‌తో సినిమా వాయిదా..?
500, 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సినీరంగాన్ని కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమాలకు ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టగా ఈ వారం రిలీజ్ కావాల్సిన సినిమాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనం దగ్గర డబ్బులు లేకపోవటంతో ఎంత మంది థియేటర్ల వరకు వస్తారో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. దీంతో చేసేదేమి లేక తమ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు అల్లరి నరేష్. హర్రర్ కామెడీగా తెరకెక్కిన ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాను ముందుగా ఈ శుక్రవారం రిలీజ్ చేయాలని భావించారు. తరువాత ఒక్క రోజు ఆలస్యంగా శనివారం విడుదల చేయాలని నిర్ణయించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వారం పాటు వాయిదా వేసి వచ్చే శుక్రవారం (నవంబర్ 18న) రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.