షాక్ ఇచ్చిన అల్లరి నరేష్ | Allari Naresh maiden directorial in the year 2020 | Sakshi
Sakshi News home page

షాక్ ఇచ్చిన అల్లరి నరేష్

Published Wed, Dec 28 2016 11:38 AM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM

షాక్ ఇచ్చిన అల్లరి నరేష్

షాక్ ఇచ్చిన అల్లరి నరేష్

2016కు నవ్వులతో గుడ్ బై చెప్పడానికి రెడీ అవుతున్న అల్లరి నరేష్, ఇంట్లోదెయ్యం నాకేం భయం సినిమాను డిసెంబర్ 30న రిలీజ్ చేస్తున్నాడు. కొంతకాలంగా తన స్థాయికి తగ్గ హిట్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న ఈ కామెడీ స్టార్, కొత్త సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందుకే.. సరైన సమయం కోసం చాలా సార్లు వాయిదా వేసి డిసెంబర్ నెలాఖరున రిలీజ్ ప్లాన్ చేశాడు.

ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమా ప్రమోషన్ సందర్భంగా నరేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిమానులకు షాక్ ఇచ్చాడు ఈ యంగ్ హీరో. చాలా రోజులుగా డైరెక్షన్ చేసే ఆలోచనలో ఉన్న నరేష్, తన దర్శకత్వంలో రాబోయే సినిమా రిలీజ్ డేట్ కూడా చెప్పేశాడు. ఇంత వరకు కథా కథనాలు, నటీనటులు ఏదీ లేకపోయినా.. 2020 మే నెలలో తన దర్శకత్వంలో సినిమా రిలీజ్ అవుతుందంటూ ప్రకటించేశాడు. ఆ డేట్నే ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్నకు సమాధానంగా సౌండ్ బాగుంది కాబట్టే ఆ డేట్ను ఎంచుకున్నానని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement